
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని బట్టి మూడు జోన్లుగా విభజించగా వాటిలో రెడ్‌జోన్‌లో 41 ప్రాంతాలను గుర్తించారు. మరో 45 ప్రాంతాలను ఆరెంజ్ జోన్‌లుగా మ్యాపింగ్ చేశారు. మొత్తం రెడ్, ఆరెంజ్ జోన్‌లలో 86 ప్రాంతాలున్నాయి. పట్టణప్రాంతాల్లో 43, గ్రామీణ ప్రాంతాల్లో మరో 43 ప్రాంతాలుగా ఉన్నాయి. వైరస్ ప్రభావం లేని.. అంటే గ్రీన్ జోన్ ప్రాంతాలుగా 590 మండలాలను గుర్తించారు.
► కర్నూలు జిల్లాలో అత్యధికంగా 15 రూరల్ మండలాల్లో కరోనా బాధితులు నమోదయ్యారు.
► నెల్లూరు జిల్లాలోనూ 13 మండలాలు వైరస్ ప్రభావానికి లోనయ్యాయి.
► రాష్ట్రంలోని గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ.. ఈ ఐదు ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్‌లలోనే 146 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
► వీరిలో 123 మంది ఢిల్లీ వెళ్లివచ్చినవారు, వారి ద్వారా వైరస్ సోకినవారే ఉన్నారు.
► అత్యధికంగా గుంటూరులో 59 కేసులు నమోదు.
► సోమవారం సాయంత్రానికి విడుదలైన బులెటిన్‌లో లెక్క చూస్తే రాష్ట్రం మొత్తమ్మీద ఈ ఐదు కార్పొరేషన్‌లలోనే 33.2 శాతం కేసులు నమోదైనట్టు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment