పుణే: రెడ్ జోన్ వాసుల దుస్థితిని రాజకీయ నాయకులతోపాటు రక్షణ శాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకుగాను దేహూ రోడ్ రెడ్ జోన్ సంఘర్ష్ సమితి గురువారం ధర్నా చేసింది. నిగిడిలోని భక్తిశక్తి చౌక్ వద్ద జరిగిన ఈ కార ్యక్రమంలో శివసేన ఎంపీ శివాజీరావ్ అఢల్‌రావ్ పాటిల్, ఎమ్మెల్యే బాలాభెగ్డే, లక్ష్మణ్ జగ్తాప్, మేయర్ మోహినీ లాండే, బీజేపీ నాయకుడు ఏక్‌నాథ్‌పవార్, వందలాదిమంది స్థానికులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుడు ఏక్‌నాథ్ పవార్, ఆ పార్టీ పింప్రి-చించ్వాడ్ శాఖ అధ్యక్షుడు సదాశివ్ ఖడేలతోపాటు దేహూ రోడ్ రెడ్ జోన్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఢిల్లీలో ఆందోళనకు దిగుతాం
ధర్నా అనంతరం దేహూ రోడ్ రెడ్ జోన్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు సుడం తరస్ మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల సమయంలో దేశ రాజధానిలో ఆందోళనకు దిగుతామని పేర్కొన్నారు. జిల్లాలోని దిఘి, దేహూరోడ్, లోహెగావ్, పాషణ్ సుతర్వాడిలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయని, ఈ కారణంగా ఆ పరిసర ప్రాంతాల్లో నివసించే ఆరు లక్షలమంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.
తమ బాధలను ప్రముఖ సంఘసేవకుడు అన్నాహజారే దృష్టికి తీసుకెళ్లామని, తమ ఆందోళనకు నాయకత్వం వహించేందుకు ఆయన అంగీకరించారన్నారు. కాగా దేహూరోడ్ ఆయుధ కర్మాగారం (డీఏడీ) పరిధిలోకి దేహూ కంటోన్మెంట్ తోపాటు పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అనేక ప్రాంతాలు వస్తాయి. ది వర్క్స్ ఆఫ్ డిఫెన్స్ చట్టం-1903 ప్రకారం రెడ్ జోన్ పరిధిలో ఎటువంటి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టకూడదు. రక్షణ శాఖకు చెందిన ఆయుధ డిపోలపై వీటి ప్రభావం పడడం వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించేవారికి నష్టం వాటిల్లకుండా చేయాలనేది ఈ చట్టం ముఖ్యోద్దేశం.
‘రెడ్ జోన్’కు వ్యతిరేకంగా ధర్నా
Published Sat, Feb 1 2014 5:55 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement
Advertisement