![Anna Hazare Reaction To Delhi Election Results](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/anna-hazare.jpg.webp?itok=8bYyCWoP)
ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే స్పందించారు. అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోయారంటూ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్న అన్నాహజారే.. డబ్బు, అధికారాన్ని దుర్వినియోగం చేశారని.. అందుకే కేజ్రీవాల్‌ను ప్రజలు ఓడించారన్నారు.
గతంలో అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి అన్నాహజారే.. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌పై అన్నాహజారే మాట్లాడటం ఇదేమీ తొలిసారి కాదు.. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్టయిన సందర్భంలోనూ ఆయన మండిపడ్డారు.
కాగా, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోంది. 50 సీట్లలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. సెంట్రల్ ఢిల్లీ, ఔటర్ ఢిల్లీలోనూ బీజేపీదే హవా చూపుతోంది. ఔటర్ ఢిల్లీలోనూ ఆప్ తుడిచిపెట్టుకుపోయింది. ఆప్ అగ్రనేతలు, మంత్రులు వెనుకంజలో ఉన్నారు. అవినీతి కేసుల్లో చాలామంది నేతలు ఇరుక్కోవడం ఆప్‌కు వ్యతిరేకతగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా లాంటి అగ్రనేతలు జైలుకు వెళ్లి రావడంతో పలువురు ఆప్ అగ్రనేతలు బీజేపీలోకి చేరారు. దీంతో ఆయా స్థానాల్లో బీజేపీకి విజయావకాశాలు పెరిగాయి. మరోవైపు, ఢిల్లీసీఎం అధికారిక నివాసం నిర్మాణంలో అవినీతి, లిక్కర్ స్కాం అభియోగాలు ఆప్ ప్రతిష్ఠను మరింత దిగజార్చాయి.
Comments
Please login to add a commentAdd a comment