ముంబై: ఫేస్ మాస్క్ లేకుండా బయటకు వస్తూ, లాక్‌డౌన్ నిబంధనలు ఎందుకు ఉల్లంఘిస్తున్నారంటూ ప్రశ్నించిన పోలీసులపై దాడికి దిగారు కొందరు దుండగులు. ఈ దారుణ ఘటన గురువారం ముంబైలో చోటు చేసుకుంది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని ఆంటోప్ హిల్ ప్రాంతం రెడ్ జోన్ పరిధిలో ఉంది. అక్కడ గురువారం 15 మంది వ్యక్తులు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వచ్చారు. దీంతో వారిని గమనించిన పోలీసులు కరోనా వ్యాప్తి నివారణ జాగ్రత్తలు ఏమాత్రం పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (టార్గెట్ ‘ఆర్మీ’ !)
ఫేస్ మాస్క్ కూడా ధరించకుండా బయట ఎందుకు తిరుగుతున్నారని వారిని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. వెంటనే ఆవేశంతో దుండగులు పోలీసులపై పదునైన ఆయుధాలతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఒక ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయాలపాలయ్యారు. వారిని ప్రస్తుతం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులపై దాడిని తీవ్రంగా పరిగణించిన పై అధికారులు దీనికి కారణమైన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (లాక్‌డౌన్: మహిళపై అఘాయిత్యం)
Comments
Please login to add a commentAdd a comment