Communication is essential: రష్యా ఉక్రెయిన్‌తో దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటినుంచి తొలుత పశ్చమ దేశాలతో సంబంధాలు చాలావరకు దూరమయ్యాయి. యూఎస్‌తో సంబంధాల కూడా అంతగా లేవు. అదీగాక యూఎస్ రష్యా యుద్ధానికి దిగుతుందంటూ.. ముందుగానే ఉక్రెయిన్‌ని హెచ్చరించింది. పైగా రష్యాని కూడా ఇలాంటి దారుణమైన చర్యలకు ఒడిగట్టందంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది .
అయినా రష్యా ప్రంపంచ దేశాలన్ని మూకుమ్ముడిగా యుద్ధం వద్దని చెప్పిన తనదారి తనదే అంటూ.. ఉక్రెయిన్‌తో తలపడేందుకు రెడీ అయిపోయింది. దీంతో యూఎస్ దాని మిత్రదేశాలతో సహా ఆర్థిక ఆంక్షలు విధించి రష్యాని ఒంటరిని చేయాలని చూసిన రష్యా ఏ మాత్రం దిగిరాలేదు. దీంతో మరిన్ని కఠినతరమైన ఆంక్షలు సైతం ప్రంపంచ దేశాలు విధించాయి. ఆఖరికి రష్యా తీరుని చూసి చాలా దేశాలు దూరం పెట్టడం మొదలు పెట్టాయి.
ఈ నేపథ్యంలో మాస్కో ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌తో సంబంధాల విషయమై క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..."యూఎస్‌తో సంబంధాలు మెరుగు పరుచుకుంటామంటూ.. షాక్ అయ్యేలా సమాధానం ఇచ్చారు. ఈ యుద్ధం కారణంగా ఏ దేశాలు మాకు దూరంగా ఉండవు.
యూఎస్ ఎక్కడికిపోదు, పశ్చిమదేశాలు కూడా దూరండా ఉండవు. మేము తిరిగి యూఎస్, పశ్చిమ దేశాలతో సంబంధాలను తిరిగి కొనసాగిస్తాం. మాకు యూఎస్‌తో సంబంధాలు కొనసాగించడం అత్యంత ముఖ్యం. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాకి యూఎస్‌తో ఉన్న సంబంధాలు దెబ్బతినవు, ఇదేమంతా పెద్ద విషయం కాందని తేల్చి చెప్పేశారు."
ఐతే యూఎస్ అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని ప్రపంచ వేదికపై తిట్టి పోయేడమే కాకుండా ప్రపంచదేశాల నుంచి బహిష్కరిస్తానని కూడా ప్రకటించారు. పైగా పుతిన్ కూడా యూఎస్ ఆర్థిక యుద్ధం చేస్తుందంటూ నిప్పులు చెరిగారు. కానీ రష్యా ఈ యుద్ధం కారణంగా యూఎస్‌తో సంబంధాలు ఏమి చెడిపోవని, రెండు దేశాల మధ్య భవిష్యత్తులో పరస్పర సహకారం, గౌరవం ఉంటాయని చెప్పాడం గమనార్హం.
(చదవండి: పాక్ మంత్రి సంచలన విజ్ఞప్తి!.. ప్లీజ్.. ఛాయ్ తాగడం తగ్గించండి)
Comments
Please login to add a commentAdd a comment