కీవ్: ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై 63 రోజులు గడుస్తున్నా పరిస్థితుల్లో మార్పులేం కనిపించడం లేదు. ఇరు దేశాల మధ్య యుద్ధ ముగియడం మాట అటుంచితే మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందంటూ రష్యా హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందిస్తూ సహాయం చేయడం మూడో ప్రపంచ యుద్ధం ముప్పు ‘వాస్తవం’ అంటూ హెచ్చరించింది.
రష్యాను దెబ్బ కొట్టాలనే ప్రణాళికలతో నాటో దేశాలు, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నాయని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ మండి పడ్డారు. రష్యా సేనలు అలసిపోయినట్లు భావిస్తుండడం కూడా ఒక భ్రమే అన్నారు. ఉక్రెయిన్‌కు భారీ స్థాయిలో ఆయుధాలను సరఫరా చేసేందుకు అమెరికా దాని మిత్రదేశాలు సిద్ధమవుతోన్న వేళ రష్యా తాజా ప్రకటన భయాందోళనలు కలిగిస్తోంది.
చదవండి👉 కిండర్‌గార్టెన్‌లో కాల్పుల కలకలం.. నలుగురి మృతి
విషయం తెలిసే ఇదంతా..
మరోవైపు మూడోప్రపంచ యుద్ధం ముప్పుపై రష్యా విదేశాంగమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఉక్రెయిన్ స్పందించింది. ‘ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వకుండా ప్రపంచ దేశాలను భయపెట్టాలని చూసిన రష్యా.. చివరకు ఆశలు కోల్పోయింది. అందుకే మూడో ప్రపంచ యుద్ధం ముప్పు వాస్తవం అంటూ బెదిరిస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఉక్రెయిన్ ఓటమిని రష్యా గ్రహించినట్లు అర్థమవుతోంది’ అని ఉక్రెయిన్ విదేశాంగమంత్రి దిమిత్రో కులేబా పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, రష్యా సైనికచర్యతో అల్లాడుతోన్న ఉక్రెయిన్‌కు నేరుగా బలగాలను పంపించేందుకు నిరాకరిస్తున్నప్పటికీ ఆయుధ సామగ్రిని అందిస్తున్నాయి పశ్చిమ దేశాలు. తాజాగా ఉక్రెయిన్‌లో పర్యటించిన అమెరికా విదేశాంగ, రక్షణశాఖ మంత్రులు కూడా భారీ స్థాయితో ఆయుధ సహకారం అందిస్తామని ప్రకటించారు. ఓవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో అమెరికా మంత్రుల రహస్య భేటీ జరగడం,మరోవైపు రష్యా సరిహద్దు ప్రాంతంలో క్షిపణి దాడులు జరుగుతుండడంతో మూడో ప్రపంచ యుద్ధ ముప్పు అంటూ రష్యా మరిన్ని హెచ్చరికలు చేస్తోంది.
చదవండి👉🏻 మస్క్ చేతికి ట్విటర్.. ట్రంప్ రీఎంట్రీ ఉంటుందా అంటే...?
Comments
Please login to add a commentAdd a comment