USA: ఉక్రెయిన్‌ను $250 మిలియన్ల మిలిటరీ సాయం | US Releases Fresh 250 Million Dollars Aid Fund To Ukraine | Sakshi
Sakshi News home page

USA: ఉక్రెయిన్‌ను $250 మిలియన్ల మిలిటరీ సాయం

Published Thu, Dec 28 2023 1:26 PM | Last Updated on Thu, Dec 28 2023 1:26 PM

US Releases Fresh 250 Million Dollars Aid Fund To Ukraine - Sakshi

(ఫైల్‌ ఫొటో)

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య 673 రోజుల నుంచి యుద్ధ వాతావరణం కొనసాగుతునే ఉంది. ఈ క్రమంలో మరోసారి అగ్రరాజ్యం అమెరికా తన భాగస్వామ్య దేశమైన ఉక్రెయిన్‌కు $250 మిలియన్‌ డాలర్ల మిలిటరీ ఆర్థిక సాయం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు, పలు రక్షణ పరికరాలు ఈ ప్యాకేజీ ద్వారా అందజేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఏడాది ఉక్రెయిన్‌కు ఆమెరికా అందించే చివరి మిలటరీ సాయమని వైట్‌హౌజ్‌ వర్గాలు పేర్కొన్నాయి.

‘తమ భాగస్వామ్య దేశమైన ఉక్రెయిన్‌ స్వాతంత్రం, స్వేచ్ఛ కోసం రష్యాతో పోరాడుతోంది. ఈ సమయంలో తాము ఉక్రెయిన్‌కు సాయం అందిస్తున్నాం’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. తమ దేశ భద్రతలో భాగంగా ఉక్రెయిన్‌ దేశ భావిష్యత్తును దృష్టితో పెట్టుకొని మిలటరీ ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. 2022 ఫిబ్రవరి ఉక్రెయిన్‌-రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అప్పటీ నుంచి ఉక్రెయిన్‌కు ఆమెరికా సుమారు $44.3 బిలియన్‌ డాలర్ల  మిలిటరీ ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే.

చదవండి:   Russia-Ukraine Conflict: పుతిన్‌ పిలిచారు.. ఉక్రెయిన్‌ సంక్షోభానికి తెర పడ్డట్లేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement