ఇటలీలోని అపులియాలో నిర్వహించిన జీ-7 దేశాల సమ్మిట్ రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచింది. అదేవిధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ సైతం జీ-7 సమ్మిట్‌లో పలు దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో పశ్చాత్య దేశాల మద్దతు కారణంగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మరింత చెలరేగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఫ్రాన్స్ బలగాలు ఉక్రెయిన్ యుద్ధం భూమిలో దిగనున్నాయి. యూకే 300 కిలోమీటర్ల రేంజ్ ఉండే స్టార్మ్ షాడో క్షిపణులు అందజేయనుంది. రష్యాను టార్గెట్ చేయడానికి పలు అధునాత రాకెట్లు, మిసైల్స్‌ను అమెరికా ఉక్రెయిన్‌కు సరఫరా చేయనుంది. జీ-7 దేశాల సమ్మిట్ ద్వారా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్‌స్కీ పాశ్చాత్య దేశాల మద్దతు మరింత కూడగట్టుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా భారీ ఆర్థిక, సైనిక సాయాన్ని ఉక్రెయిన్‌కు అందించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియాలోని స్థావరాలపై ఉక్రెయిన్ టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
జీ-7 దేశాల సమ్మిట్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి జెలెన్‌స్కీ మోదీకి వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పాశ్చాత్యదేశాలు ఉక్రెయిన్‌కు సహకరించాడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించిన విషయం తెలిసిందే. అదే విధంగా రష్యా సార్వభౌమత్వానికి ముప్పు వస్తే.. అణ్వాయుధాలు వినియోగించడాకి కూడా వెనకడబోమని గతంలోనే ఆయన హెచ్చరించారు.
చదవండి: జీ-7లో ప్రధాని మోదీ.. ఉక్రెయిన్‌కు రష్యా ఆఫర్.. ఏంటంటే?
Comments
Please login to add a commentAdd a comment