G-7
-
‘జీ-7 కూటమి అమెరికా ఆధిపత్యం పెంచే పొలిటికల్ టూల్’
బీజింగ్: ఇటలీ వేదికగా జీ-7 దేశాధినేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై చైనా విమర్శలు గుప్పించింది. రష్యాకు ఆయుధాలు సరాఫరా చేయవద్దని జీ-7 దేశాధినేతలు చైనాను హెచ్చరించారు. ఈ మేరకు జీ-7 సమ్మిట్‌లో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దీనిపై తాజాగా చైనా స్పందించింది. జీ-7 దేశాల సమ్మిట్ విడుదల చేసిన ప్రకటన అహంకారం, పక్షపాతం, అబద్దాలతో కూడినదని విమర్శలు చేసింది. సోమవారం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మీడియాతో మాట్లాడారు. ‘జీ-7 దేశాధినేతలు చైనాకు వ్యతిరేకంగా అసత్యాలతో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ దేశాలు చేస్తున్న ఆరోపణలు నిజం కాదు. చట్టబద్ధత, నైతికతకు దూరంగా ఉన్నాయి. జీ-7 సమ్మిట్ ప్రకటన పూర్తిగా అహంకారం, పక్షపాతం, అసత్యాలతో కూడినది. జీ-7 కూటమి ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించేంది కాదు. ప్రపంచ జనాభాలో ఆ ఏడు దేశాలు కేవలం పదిశాతం జనాభాను మాత్రమే కలిగి ఉంటాయి. .. ఆ ఏడు దేశాలు మొత్తం కలిసినా కూడా ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి అందించే సహాకారం చైనా కంటే తక్కువ. జీ-7 దేశాల కూటమి అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను స్థిరంగా ఉంచటంలో కీలకంగా వ్యవహరించాలి. కానీ, అమెరికా, పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని పెంచే ఒక పోలిటికల్ టూల్‌గా మారింది’ అని లిన్ జియాన్ మండిపడ్డారు. -
జీ-7 మద్దతు: ఉక్రెయిన్-రష్యా యుద్ధం! మళ్లీ బీభత్సమేనా!
ఇటలీలోని అపులియాలో నిర్వహించిన జీ-7 దేశాల సమ్మిట్ రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచింది. అదేవిధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సైతం జీ-7 సమ్మిట్‌లో పలు దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో పశ్చాత్య దేశాల మద్దతు కారణంగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మరింత చెలరేగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఫ్రాన్స్ బలగాలు ఉక్రెయిన్ యుద్ధం భూమిలో దిగనున్నాయి. యూకే 300 కిలోమీటర్ల రేంజ్ ఉండే స్టార్మ్ షాడో క్షిపణులు అందజేయనుంది. రష్యాను టార్గెట్ చేయడానికి పలు అధునాత రాకెట్లు, మిసైల్స్‌ను అమెరికా ఉక్రెయిన్‌కు సరఫరా చేయనుంది. జీ-7 దేశాల సమ్మిట్ ద్వారా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ పాశ్చాత్య దేశాల మద్దతు మరింత కూడగట్టుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా భారీ ఆర్థిక, సైనిక సాయాన్ని ఉక్రెయిన్‌కు అందించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియాలోని స్థావరాలపై ఉక్రెయిన్ టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది.జీ-7 దేశాల సమ్మిట్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి జెలెన్స్కీ మోదీకి వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పాశ్చాత్యదేశాలు ఉక్రెయిన్‌కు సహకరించాడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించిన విషయం తెలిసిందే. అదే విధంగా రష్యా సార్వభౌమత్వానికి ముప్పు వస్తే.. అణ్వాయుధాలు వినియోగించడాకి కూడా వెనకడబోమని గతంలోనే ఆయన హెచ్చరించారు. చదవండి: జీ-7లో ప్రధాని మోదీ.. ఉక్రెయిన్‌కు రష్యా ఆఫర్.. ఏంటంటే? -
జీ-7: ముగిసిన మోదీ పర్యటన.. ఏమన్నారంటే
రోమ్: ఇటలీలోని అపులియాలో జరుగుతున్న జీ-7 దేశాల సమ్మిట్ తొలిరోజు పాల్గొనటం చాలా అద్భుతం అనిపించిందని ప్రధాని మోదీ అన్నారు. ఇటలీలోని అపులియాలో నిర్వహిస్తున్న మూడు రోజుల జీ-7 దేశాల సమ్మిట్ తొలిరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరై.. పలువురు దేశాధినేతలతో భేటీ నిర్వహించారు.Had a very productive day at the G7 Summit in Apulia. Interacted with world leaders and discussed various subjects. Together, we aim to create impactful solutions that benefit the global community and create a better world for future generations.I thank the people and…— Narendra Modi (@narendramodi) June 14, 2024రోజంతా ఆయా దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇక.. జీ-7 దేశాల సమ్మిట్ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ ఇండియాకు బయల్దేరారు. ఈ సందర్భంగా మోదీ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.చదవండి: స్వేచ్ఛా వాణిజ్యంపై మోదీ, రిషీ సమీక్ష#WATCH | Apulia, Italy: Prime Minister Narendra Modi leaves for India from Brindisi Airport after attending the G7 Summit. pic.twitter.com/7kiamKGCbH— ANI (@ANI) June 14, 2024 ‘ఇటలీలోని అపులియాలో జరిగిన G-7 సమ్మిట్‌లో చాలా ఉత్పాదకమైన రోజు. ప్రపంచ నాయకులతో భేటీ అయ్యాను. పలు దేశాధినేతలతో వివిధ అంశాలపై చర్చించాను. గ్లోబల్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చే ప్రభావవంతమైన పరిష్కారాలను రూపొందించటం, భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడం మా లక్ష్యం. ఇటలీ ప్రజలు, ప్రభుత్వం సాదరమైన ఆతిథ్యానికి ధన్యవాదాలు’ అని మోదీ అన్నారు. చదవండి: ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో చర్చలుచదవండి: జీ-7: కృత్రిమ మేధపై పోప్ ఆందోళన -
G-7 Summit: బైడెన్‌కు ఏమైంది?.. ఇటలీలో వింత ప్రవర్తన!
ఇటలీ వేదికగా ప్రతిష్ఠాత్మక జీ-7 దేశాల సదస్సుకు పలు దేశాల నేతల హాజరయ్యారు. జీ-7లో అమెరికా సభ్య దేశం కావడంతో సదస్సులో పాల్గొనేందుకు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఇటలీ చేరుకున్నారు. కాగా, ఇటలీలో జో బైడెన్ వింతగా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో, బైడెన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ఇటలీ తీరప్రాంత నగరం అపూలియాలో రెండు రోజులపాటు జీ-7 సదస్సు కొనసాగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందకు జీ-7 కూటమి దేశాల నేతలు ఇటలీ చేరుకున్నారు. కాగా, సదస్సు ఆరంభం కావడానికి ముందు అపూలియా తీర ప్రాంతాన్ని ఆయా దేశాల నేతలు సందర్శించారు. అక్కడ ఉన్న వాటర్ స్పోర్ట్స్‌ను వీక్షించారు. పారా గైడ్లింగ్ చేస్తున్న వారిని పలకరించారు. ఆ సమయంలో జో బైడెన్ వింతగా ప్రవర్తించారు. 🇺🇸 President Joe Biden is completely lost at the G7 Summit. pic.twitter.com/LbyiNg7mqE— BRICS News (@BRICSinfo) June 13, 2024 తీర ప్రాంతం వద్ద రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, మెలోనీ, ఉర్సులా వాన్ డెర్.. ఒకవైపు ఉండి వాటర్ స్పోర్ట్స్‌ను తిలకిస్తోండగా.. జో బైడెన్ మాత్రం వారికి దూరంగా వెళ్లి దిక్కులు చూస్తూ నిలబడిపోయారు. అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరితోనో ఆయన మాట్లాడుతున్నట్టు సైగలు చేశారు. కుడి చెయ్యి పైకి ఎత్తి పలకరించడం కనిపించింది. ఈ సమయంలో బైడెన్‌ను గమనించిన మెలోని ఆయన దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకువచ్చారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బైడెన్‌కు ఏమైందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.అయితే, బైడెన్ ఇలా వింతగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. అంతుకుముందు పలు సందర్భాల్లో కూడా ఆయన ఇలాగే చేశారు. అమెరికాకు సంబంధించి చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే కార్యక్రమంలో సెనేట్ మెజార్టీ లీడన్ చక్ షూమర్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పొడియం వద్దకు వచ్చిరాగానే ముందుగా బైడెన్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి, ఆ తర్వాత స్టేజ్ మీద ఉన్న మిగతావాళ్లకు ఇచ్చాడు లీడన్. అప్పటికి తను షేక్‌హ్యాండ్ ఇచ్చిన విషయం మర్చిపోయిన బైడెన్.. మరోసారి షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు తీసుకెళ్లారు. అయితే చేతిని కాసేపు అలాగే షేక్ హ్యాండ్ పొజిషన్లో ఉంచి షాక్‌తో మళ్లి చేతిని కిందకు దించాడు బైడెన్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. It took Joe Biden exactly 3 seconds to forget he had already shaken Schumer's hand. pic.twitter.com/V3eEOuaFuz— Gain of Fauci (@DschlopesIsBack) June 12, 2024 గతంలోనూ ఇలాంటి పొరపాటే చేసి మీడియాకు అడ్డంగా దొరికిపోయారు బైడెన్. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పేరు సైతం మర్చిపోవడం, తనతోపాటు పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు. Pay close attention to Joe Biden’s hands in this video! pic.twitter.com/C5r0ceTNnX— Matt Wallace (@MattWallace888) June 12, 2024 It’s funny to MAGA because Joe Biden physically turned around and faced the WWII D Day veterans instead of having his back turned pic.twitter.com/lLC3I1AXCF— Andrew Mercado (@RealAndyMerc) June 7, 2024 -
జీ-7 సమ్మిట్: బైడెన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ!
ఢిల్లీ: ఇటలీలో రేపు( శుక్రవారం) జరగబోయే జీ-7 దేశాల సమ్మిట్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సుల్లివన్ బుధవారం తెలిపారు. జీ-7 దేశాల సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ఇటలీ వెళ్తున్న సమయంలో జేక్ మీడియాతో మాట్లాడారు. ‘‘ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఇటలీలో ప్రధాని మోదీని చూడాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే జీ-7 సమ్మిత్‌కు మోదీ హాజరవుతారని భారత్ అధికారంగా ప్రకటించింది. అయితే మోదీ, బైడెన్ ఇటలీలో కలుసుకునే అవకాశం ఉందని భావిస్తున్నా’’ అని అన్నారు. అదే విధంగా తాము పారిస్‌లో ఉన్న సమయంలో అధ్యక్షుడు బైడెన్ మోదీకి ఫోన్ చేసినట్లు తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని అయినందుకు బైడెన్ ఫోన్లో శుభాకాక్షలు తెలిపారని అన్నారు.ఇక.. ప్రధాని మోదీ ఇవాళ (గురువారం) ఇటలీ బయల్దేరనున్నారు. మోదీ మూడోసారిగా ప్రధానమంత్రి బాధ్యత్యలు చేపట్టిన అనంతరం ఇటలీ ఆయన మొదటి విదేశి పర్యటన కావటం గమనార్హం. జూన్ 14న తమ దేశంలో జరగనున్న 50వ జీ-7 సమ్మిట్‌కు హాజరుకావాలని ఇటలీ.. భారత్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ కానున్నారని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. అదే విధంగా సమ్మిట్ వచ్చే ఇతర దేశాల నేతలతో సైతం ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు క్వాత్రా తెలిపారు. -
G7 Summit: ఐరాసను సంస్కరించాల్సిందే
హిరోషిమా: ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలను నేటి వాస్తవాలకు అద్దం పట్టేలా, అవసరాలను తీర్చేలా తక్షణం సంస్కరించుకోవాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. లేదంటే ఐరాస, భద్రతా మండలి వంటివి కేవలం నామమాత్రపు చర్చా వేదికలుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ఆదివారం జపాన్‌లోని హిరోషిమాలో జీ–7 సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ప్రపంచ శాంతే ప్రధాన లక్ష్యంగా స్థాపించుకున్న ఐరాస యుద్ధాలు, సంక్షోభాలను ఎందుకు నివారించలేకపోతోంది? శాంతి గురించి పలు ఇతర వేదికలపై చర్చించుకోవాల్సిన అవసరం ఎందుకు తలెత్తుతోంది? ఉగ్రవాదపు నిర్వచనాన్ని కూడా ఐరాస ఎందుకు అంగీకరించడం లేదు? ఆలోచిస్తే తేలేదొక్కటే. ఐరాస ప్రస్తుత ప్రపంచపు వాస్తవాలకు అనుగుణంగా లేదు. గత శతాబ్దానికి చెందిన ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు 21వ శతాబ్దపు అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఇవన్నీ చాలా సీరియస్‌గా దృష్టి సారించాల్సిన విషయాలు’’ అని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధం మానవతకు సంబంధించిన సంక్షోభమని మోదీ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ చట్టాలను, దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను అందరూ గౌరవించాలని రష్యా, చైనాలను ఉనుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు జరిగే ఏకపక్ష ప్రయత్నాలపై దేశాలన్నీ ఉమ్మడిగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం, లద్దాఖ్ దురాక్రమణకు కొన్నేళ్లుగా చైనా చేస్తున్న యత్నాల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు భారత్ సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తుందని హామీ ఇచ్చారు. దీనికి చర్చలు, రాయబారమే ఏకైక పరిష్కారమని తాము ముందునుంచీ చెబుతున్నామని గుర్తు చేశారు. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ బుద్ధుని బోధల్లో చక్కని పరిష్కారాలున్నాయన్నారు. హిరోషిమా పార్కులోని స్మారక మ్యూజియాన్ని దేశాధినేతలతో కలిసి మోదీ సందర్శించారు. అణుబాంబు దాడి మృతులకు నివాళులర్పించారు. మీకు మహా డిమాండ్! మోదీతో బైడెన్, ఆల్బనీస్ వ్యాఖ్యలు మీ ఆటోగ్రాఫ్ అడగాలేమో: బైడెన్ జీ–7 సదస్సులో భాగంగా జరిగిన క్వాడ్ దేశాధినేతల భేటీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీ దగ్గరికి వచ్చి మరీ ఆత్మీయంగా ఆలింగనంచేసుకుని ముచ్చటించడం తెలిసిందే. మోదీ విషయమై తమకెదురవుతున్న గమ్మత్తైన ఇబ్బందిని ఈ సందర్భంగా బైడెన్ ఆయన దృష్టికి తెచ్చారట. వచ్చే నెల మోదీ వాషింగ్టన్లో పర్యటించనుండటం తెలిసిందే. ఆ సందర్భంగా మోదీ పాల్గొనే పలు కార్యక్రమాల్లో ఎలాగైనా ఆయనతో భేటీ ఏర్పాటు చేయించాల్సిందిగా అమెరికా ప్రముఖుల నుంచి లెక్కలేనన్ని ‘రిక్వెస్టులు’ వచ్చిపడుతున్నాయట! వాటిని తట్టుకోవడం తమవల్ల కావడం లేదని బైడెన్ చెప్పుకొచ్చారు. భేటీలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా తామూ అచ్చం అలాంటి ‘సమస్యే’ ఎదుర్కొంటున్నామంటూ వాపో యారు! మోదీ మంగళవారం ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో 20 వేల మంది సామర్థ్యమున్న స్టేడియంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. దానికి టికెట్లు కావాలని లెక్కకు మించిన డిమాండ్లు, రిక్వెస్టులు వచ్చి పడుతున్నాయని ఆల్బనీస్ చెప్పుకొచ్చారు. ఇటీవలి భారత్ పర్యటన సందర్భంగా గుజరాత్లో 90 వేల మంది సామర్థ్యంతో కిక్కిరిసిన స్టేడియంలో తామిద్దరం ఎలా ప్రజలకు అభివాదం చేసిందీ గుర్తు చేసుకున్నారు. దాంతో బైడెన్ స్పందిస్తూ బహుశా తాను మోదీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలేమో అంటూ చమత్కరించారు! గత మార్చిలో భారత్–ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌ను మోదీ, ఆల్బనీస్ ప్రారంభించడం తెలిసిందే. -
G7 Summit: సమ్మిళిత ఆహార వ్యవస్థ
హిరోషిమా: ప్రపంచవ్యాప్తంగా అత్యంత దుర్బల స్థితిలో ఉన్న నిరుపేదల సంక్షేమం నిమిత్తం సమ్మిళిత ఆహార వ్యవస్థ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఎరువుల వనరులను చెరపడుతున్న విస్తరణవాద ధోరణికి చెక్ పెట్టాలన్నారు. ‘సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ప్రజాస్వామ్యీకరణ చేయాలి. ఇలాంటి చర్యలు అభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి మధ్య వారధిగా ఉంటాయి’ అని అన్నారు. పాన్‌లోని హిరోషిమాలో జీ–7 సదస్సులో మోదీ మాట్లాడారు. సహజ వనరులను సమగ్రంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా అభివృద్ధి నమూనాను మార్చాలని చెప్పారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్‌లతో కూడిన జీ–7 కూటమి సదస్సు ఈసారి జపాన్‌లో జరుగుతోంది. భారత్‌తో పాటు మరో ఏడు దేశాల అధినేతలను సదస్సుకు జపాన్ ఆహ్వానించింది. ఈ మేరకు సదస్సులో పాల్గొన్న ప్రధాని తన ప్రసంగంలో ఆహార భద్రతపైనే అత్యధికంగా దృష్టిసారించారు. ప్రపంచ ఆహార భద్రత సుస్థిరంగా ఉండాలంటే ఆహార వృథాను అరికట్టడం అత్యంత కీలకమని చెప్పారు. సదస్సులో జరుగుతున్న చర్చలు జీ–20, జీ–7 కూటముల మధ్య కీలకమైన అనుసంధానంగా మారతాయని ఆశాభావం వెలిబుచ్చారు. సమ్మిళిత ఆహార విధానం రూపకల్పనలో చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎరువుల పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరముంది. ఈ క్రమంలో ఎదురయ్యే రాజకీయపరమైన అడ్డంకులను తొలగించాలి’’ అని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రధాని పదేపదే సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రైతులందరికీ డిజిటల్ టెక్నాలజీ అందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మోదీకి బైడెన్ ఆత్మీయ ఆలింగనం జీ–7 సదస్సులో ఆసక్తికరమైన దృశ్యాలు కన్పించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీ కూర్చున్న కుర్చీ దగ్గరికి వడివడిగా వచ్చారు. ఆయన్ను చూసి మోదీ కుర్చీలోంచి లేచి స్వాగతించారు. నేతలిరువురూ పలకరించుకొని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను కూడా మోదీ ఆప్యాయంగా కౌగిలించుకొని మాట్లాడారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో ద్వైపాక్షిక అంశాలపై మోదీ చర్చించారు. అణు విలయపు నేలపై శాంతిమూర్తి రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబుతో భస్మీపటలమై లక్షలాది మంది మృత్యువాత పడ్డ హిరోషిమా పట్టణంలో శాంతి, అహింసలకు సంఘీభావంగా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మోదీ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాకు తాను బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని అక్కడే నాటారని తెలిసి సంబరపడ్డారు. హిరోషిమా పేరు చెబితే ఇప్పటికీ ప్రపంచం వణికిపోతుందని గుర్తు చేశారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి కృషి: మోదీ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత మోదీ తొలిసారిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. జీ–7 సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు కరచాలనం చేసుకొని ఫొటోలకు పోజులిచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం మానవత్వం, మానవ విలువలకు సంబంధించినదని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభానికి సాధ్యమైనంత వరకు పరిష్కార మార్గం కనుగొంటానని జెలెన్స్కీకి హామీ ఇచ్చారు. ‘‘ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలన్నింటిపై పలు రకాలుగా ప్రభావం చూపింది. ఉక్రెయిన్‌లో పరిస్థితిని రాజకీయ, ఆర్థిక అంశంగా చూడడం లేదు. మానవత్వం, మానవ విలువలకు సంబంధించిన అంశంగా చూస్తున్నాం. యుద్ధంతో పడే బాధలు మాకంటే మీకే బాగా తెలుసు. ఈ సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో పాటు వ్యక్తిగతంగా నేను కూడా కృషి చేస్తానని హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. తాను రూపొందించిన సమగ్ర శాంతి ఫార్ములాలో భారత్ కూడా భాగస్వామి కావాలని జెలెన్స్కీ కోరారు. -
రష్యాకు శిక్ష తప్పదు.. ఆ దేశంపై ఇక మరిన్ని ఆంక్షలు
హిరోషిమా/న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో మారణకాండ సాగిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న రష్యాకు శిక్ష తప్పదని జి–7 దేశాల అధినేతలు హెచ్చరించారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించబోతున్నట్లు తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జి–7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కూటమి దేశాల అధినేతలు శుక్రవారం జపాన్‌లోని హిరోషిమాకు చేరుకున్నారు. అనంతరం సమాశమై, తాజా అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఉక్రెయిన్‌పై రష్యా చట్ట విరుద్ధమైన, న్యాయ విరుద్ధమైన యుద్ధం సాగిస్తోందని మండిపడ్డారు. రష్యాకు వ్యతిరేకంగా కలిసికట్టుగా ముందుకు సాగాలని జి–7 దేశాల నేతలు ప్రతిన బూనారు. రష్యా ప్రారంభించిన ఈ యుద్ధాన్ని రష్యానే ముగించాలని అన్నారు. హిరోషిమాలోని శాంతి పార్కును వారు సందర్శించారు. రెండో ప్రపంచ యుద్ధంలో బాంబు దాడిలో దెబ్బతిన్న డోమ్ వద్ద గ్రూప్ ఫొటోలు దిగారు. అక్కడ పుష్పగుచ్ఛాలు ఉంచి, అమర వీరులకు నివాళులర్పించారు. జి–7 శిఖరాగ్ర సదస్సుకు గుర్తుగా చెర్రీ మొక్కను నాటారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో రాజీలేదు: మోదీ సార్వభౌమత్వం, గౌరవాన్ని కాపాడుకొనే విషయంలో భారతదేశం పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉందని, ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో భారత్–చైనా సంబంధాలు మెరుగుపడడం అనేది కేవలం ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని తేల్చిచెప్పారు. శుక్రవారం జపాన్ వార్తా సంస్థ ‘నిక్కీ ఆసియా’ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడారు. పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. పొరుగు దేశాలతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలంటే సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు కొనసాగడం తప్పనిసరి అని చెప్పారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని కాపాడుకోవడానికి, చట్టబద్ద పాలనకు, వివాదాలకు శాంతియుత పరిష్కారం కనుగొనడానికి తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు. భారత్–చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి చేరుకుంటే ఇరు దేశాలకే కాకుండా ప్రపంచానికి కూడా లబ్ధి చేకూరుతుందని తెలియజేశారు. భారత్ ప్రగతి పథంలో దూసుకుపోతోందని వివరించారు. 2014లో ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు. పాకిస్తాన్‌తో సాధారణ, ఇరుగుపొరుగు సంబంధాలను నరేంద్ర మోదీ కోరుకుంటున్నట్లు నిక్కీ ఆసియా వెల్లడించింది. చదవండి: ఎలిజబెత్ అంత్యక్రియలకు రూ.1,655 కోట్లు హిరోషిలో మోదీ జి–7, క్వాడ్ దేశాల అధినేతల సదస్సులో పాల్గొనడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జపాన్‌లోని హిరోషిమా నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు జపాన్ సీనియర్ అధికారులు, భారత రాయబార కార్యాలయం అధికారులు స్వాగతం పలికారు. హిరోషిమాలో ల్యాండ్ అయ్యానంటూ మోదీ ట్వీట్ చేశారు. ఆయన ఈ నెల 21 దాకా హిరోషిమాలో పర్యటిస్తారు. జి–7 సదస్సుతోపాటు వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారు. జపాన్ పర్యటనకు బయలుదేరేముందు ఢిల్లీలో మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘జి–20 కూటమికి ఈ ఏడాది భారత్ సారథ్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో హిరోషిమాలో జి–7 దేశాల అధినేతలతో సమావేశమై, చర్చించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ప్రపంచ సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించబోతున్నాం’’ అన్నారు. సదస్సులో పాల్గొననున్న జెలెన్స్కీ జి–7 దేశాల శిఖరాగ్ర సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం పాల్గొనబోతున్నారు. ఆయన ఆదివారం సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీ ఒలెక్సీ డానిలోవ్ నిర్ధారించారు. తమ దేశంలో నెలకొన్న అస్థిరతను పరిష్కరించడానికి తమ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తారని, ఎవరినైనా కలుస్తారని చెప్పారు. -
G7 summit: 600 బిలియన్ డాలర్ల నిధి!
ఎల్మౌ: ఉక్రెయిన్‌పై దండెత్తుతున్న రష్యాను, అప్పులిచ్చి చిన్న దేశాలను గుప్పిట పడుతున్న డ్రాగన్ దేశం చైనాను అడ్డుకోవడమే లక్ష్యంగా జి–7 శిఖరాగ్ర సదస్సు ఆదివారం జర్మనీలోని బవేరియన్ ఆల్ప్స్లో ప్రారంభమయ్యింది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా దేశాల అధినేతలు పాలుపంచుకుంటున్నారు. బంగారం దిగుమతులపై నిషేధం సహా రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలను ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువు దిగుమతులను భారీగా తగ్గించుకొనేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చలు సాగిస్తున్నారు. చైనా ప్రభావాన్ని అడ్డుకొనేందుకు ఉద్దేశించిన గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్ పార్ట్‌నర్‌షిప్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద 7 దేశాలు కలిసి 2027 నాటికి 600 బిలియన్ డాలర్లు (రూ.46.95 లక్షల కోట్లు) సమీకరిస్తాయి. అంతర్జాతీయంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఈ నిధులను ఖర్చు చేస్తాయి. చైనా ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి పేరిట చిన్నదేశాలకు అప్పులిచ్చి, లాభపడుతున్న సంగతి తెలిసిందే. చైనాకు కౌంటర్‌గానే 600 బిలియన్ డాలర్ల నిధిని జి–7 దేశాలు తెరపైకి తీసుకొచ్చాయి. పుతిన్ జోస్యం ఫలించదు ఉక్రెయిన్‌లో రష్యా రాక్షసకాండను జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. రష్యా అనాగరిక చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రష్యా అధినేత పుతిన్‌కు వ్యతిరేకంగా మిత్రదేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. నాటో, జి–7 విచ్ఛిన్నమవుతాయని పుతిన్ జోస్యం చెబుతున్నారని, నిజానికి అలాంటిదేమీ జరగదని స్పష్టం చేశారు. బైడెన్ జర్మన్ చాన్సరల్ ఒలాఫ్ షోల్జ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మిత్రదేశాల నేతలంతా కలిసి ఉంటే అది ఒక గొప్ప సందేశం అవుతుందని షోల్జ్ అభిప్రాయపడ్డారు. తమ ఐక్యతను పుతిన్ ఊహించలేదని చెప్పారు. ఉక్రెయిన్ భద్రత విషయంలో జర్మనీ, అమెరికా కలిసి పని చేస్తాయన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్‌కు అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ అనుకూల కూటమి విషయంలో విభేదాలకు స్థానం లేదన్నారు రష్యా బంగారం దిగుమతిపై నిషేధం! రష్యా నుంచి బంగారం దిగుమతులపై పూర్తిగా నిషేధం విధించాలని జి–7 దేశాలు భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ చర్య వల్ల ఆర్థికంగా ప్రపంచంలో రష్యా ఏకాకి అవుతుందన్నారు. చమురు తర్వాత రష్యా నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యేది బంగారమే. 2020లో ప్రపంచం మొత్తం బంగారం ఎగుమతుల్లో రష్యా వాటా 5 శాతం. దీని విలువ 19 బిలియన్ డాలర్లు. దీనిలో 90 శాతం బంగారం జీ7 దేశాలకే వెళ్తోంది. మన డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉంది మ్యునిచ్: జీ7 సమిట్‌లో పాల్గొనేందుకు ఆదివారం జర్మనీ చేరుకున్న ప్రధాని మ్యునిచ్‌లోని ఆడి డోమ్ స్టేడియంలో భారత సంతతి వారినుద్దేశించి మాట్లాడారు. ‘ప్రతి భారతీయుడి డీఎన్ఏలో ప్రజాస్వామ్యం ఉంది. 1975లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు జరిగిన కుట్రలను ప్రజలు ప్రజాస్వామ్య యుతంగానే తిప్పికొట్టారు. మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుందాం. భారత ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యాలకు మాతృక అని సగర్వంగా చాటుదాం’ అని పిలుపునిచ్చారు. ‘గత శతాబ్దంలో సంభవించిన మూడో పారిశ్రామిక విప్లవం నుంచి అమెరికా, యూరప్ లబ్ధిపొందాయి. ఆ సమయంలో భారత్ దాస్య శృంఖలాల్లో ఉంంది. ప్రస్తుత నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్ నాయకత్వం వహిస్తోంది’ అని అన్నారు. భారతదేశం డిజిటల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందన్నారు. నూతన సాంకేతికతను అద్భుతమైన రీతిలో ప్రజలు అందిపుచ్చుకుంటున్నారని తెలిపారు. -
ప్రపంచ సంక్షోభమే.. జి–7 దేశాల ఆందోళన
వీసెన్‌హాస్(జర్మనీ): ఉక్రెయిన్–రష్యా యుద్ధం ప్రపంచ సంక్షోభంగా పరిణమిస్తోందని జి–7 విదేశాంగ మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాలు ఎగుమతుల్లేక ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో ఆకలి కేకలు మొదలయ్యే ప్రమాదం ఉందన్నారు. రష్యా దళాలు ఉక్రెయిన్ నుంచి వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. రష్యాకు ఏ రూపంలోనూ సాయమందించినా తీవ్ర పరిణామాలుంటాయని చైనాను హెచ్చరించారు. శనివారం ముగిసిన ఈ 3 రోజుల భేటీలో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులను ప్రారంభించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఉక్రెయిన్‌కు సాయం పెంచాలని తీర్మానించారు. ఆహార కొరతను అధిగమించే విషయంలో తమ మిత్రదేశాలకు అండగా నిలుస్తామని వెల్లడించారు. చదవండి: (Russia-Ukraine war: ఖర్కీవ్ నుంచి రష్యా సేనలు ఔట్!) -
వ్యాక్సిన్ పాస్‌పోర్టు సరైంది కాదు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరణకు అడ్డుకట్టవేయడానికి వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని తీసుకురావాలనే కొన్ని దేశాలు ప్రతిపాదనల్ని జీ–7 సదస్సు వేదికగా భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది అత్యంత వివక్షాపూరిత చర్యగా అభివర్ణించింది. వ్యాక్సిన్ పాస్‌పోర్టు వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలకు నష్టం వాటిల్లుతుందని సదస్సులో పాల్గొన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. జీ–7 దేశాల సదస్సుకు ఈ ఏడాది భారత్‌ను అతిథిగా ఆహ్వానించారు. జీ–7 ఆరోగ్య మంత్రుల సమావేశంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన హర్షవర్ధన్ అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యాక్సిన్ కొరతని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. భారత్‌లో కేవలం 3 శాతం మంది ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రతిపాదల్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలు టీకాల సరఫరా, పంపిణీ, రవాణా, సామర్థ్యం వంటి అంశాల్లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని అమల్లోకి తీసుకువస్తే అది వివక్ష చూపించడమే’’ అని ఆయన గట్టిగా చెప్పారు. కాగా ఈ సదస్సులో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజలందరికీ టీకాలు ఇవ్వడానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాలను మంత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వ్యాక్సిన్ పాస్‌పోర్టు అంటే.. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడానికి వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని అమలు చేయాలని అంతర్జాతీయంగా ప్రతిపాదనలు వస్తున్నాయి. కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న వారు తాము వ్యాక్సిన్ తీసుకున్నామని ధ్రువపత్రం చూపించాలి. అయితే ఇది డిజిటల్ రూపంలో ఉంటుంది. ఇప్పటికే కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలు తయారుచేసిన యాప్‌లలో ప్రజలు వ్యాక్సినేషన్ వివరాలను పొందుపరచాలి. విదేశీ ప్రయాణం సమయంలో ఆ దేశాలు ఈ యాప్‌ల ద్వారా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో తెలుసుకుంటాయి. కరోనాని కట్టడి చేయాలంటే ఈ విధానాన్ని అమలు చేయాలని అమెరికా, కొన్ని యూరప్ దేశాలు సమాలోచనలు జరుపుతున్నాయి. అదే జరిగితే భవిష్యత్‌లో వ్యాక్సిన్ పాస్‌పోర్టు ఉంటేనే విదేశీ ప్రయాణాలు సాధ్యమవుతాయి. -
Group of Seven: జి ఫర్ గ్రేట్
జి సెవన్ అంటే ‘గ్రేట్’ సెవన్ అనుకుంటాం. కాదు! ‘గ్రూప్’ సెవన్. అయితే లండన్ జి7 ఆర్థిక మంత్రుల సమావేశంలో జరిగిన తాజా నిర్ణయం గురించి వింటే ఈ దేశాలను గ్రూప్ సెవన్ కాదు, గ్రేట్ సెవన్ అనడమే కరెక్ట్ అనిపిస్తుంది. బాలికలు, మహిళల మీదే కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందని ఏడాదిన్నరగా సర్వేలు చెబుతూ వస్తున్నాయి. సర్వేల వరకు వెళ్లక్కర్లేదు. మన చుట్టూ చూస్తేనే తెలిసిపోతుంది. ఇళ్లలో మహిళలకు పని భారం ఎక్కువైంది. ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కంపెనీలకు భారమయ్యారు! బాలికల పరిస్థితి కూడా ఇంతే. బడి గంటలు పోయి, ఇంట్లో పని గంటలు వచ్చేశాయి. ఇక గృహహింస, మహిళల అనారోగ్యాలపై కుటుంబ సభ్యుల అలక్ష్యం, నిరాదరణ ఎప్పుడూ ఉన్నవే. ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. మొదట ఈ పరిస్థితులను చక్కబరిస్తే గానీ కరోనా పర్యవసానాలను నివారించలేమని జి7 దేశాల గుర్తించాయి. బాలికలు, మహిళల చదువు, సంక్షేమాల కోసం నిధులను, విధులను భుజానికెత్తుకున్నాయి. ఏటా జి7 దేశాధ్యక్షుల సదస్సు జరగడానికి ముందు జి7 ఆర్థిక మంత్రుల సమావేశం జరుగుతుంది. కష్టకాలంలో కలిసికట్టుగా ఉండటానికి, అభివృద్ధి చెందే దశలో ఉన్న దేశాలను గట్టెక్కించడానికి ఒక జట్టుగా ఏర్పడిన ఏడు పారిశ్రామిక, ధనిక దేశాల బృందమే జి సెవన్. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యు.కె., జపాన్. వీటితో పాటు ఐరోపా సమాఖ్య ఉంటుంది. జి సెవన్ అంటే ‘గ్రేట్’ సెవన్ అనుకుంటాం. కాదు! ‘గ్రూప్’ సెవన్. అయితే లండన్‌లో జి7 ఆర్థిక మంత్రుల సమావేశంలో తాజాగా జరిగిన నిర్ణయం గురించి వింటే ఈ దేశాలను గ్రూప్ సెవన్ కాదు, గ్రేట్ సెవన్ అనడమే కరెక్ట్ అనిపిస్తుంది. వచ్చే రెండేళ్లలో బాలికల చదువు, మహిళల ఉద్యోగాల కోసం.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సుమారు లక్షా పది వేల కోట్ల రూపాయలను సహాయంగా అందివ్వాలని ఏడు దేశాల ఆర్థిక మంత్రులు తీర్మానించారు. వారి సహాయం పొందే దేశాలలో భారత్ కూడా ఉంది. ∙∙ నలభై ఐదేళ్లుగా ఏటా జి7 సదస్సులు జరుగుతున్నాయి. ఏ సదస్సులోనూ ఇంత భారీ ఎత్తున బాలికలు, మహిళల కోసం నిధుల కేటాయింపు లేదు! పైగా ఇది విరాళం వంటి సహాయం. ఈ ఏడు సభ్యదేశాలే తమ కోశాగారం లోంచి తీసి ఇవ్వవలసి ఉంటుంది. అందుకు జి7లోని ఏ దేశమూ కాదనడం ఉండదు కానీ, ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం మీద, వాక్సిన్లు ఆక్సిజన్ల మీద కదా ధార్మిక దృష్టి ఉండవలసింది! ఆ మాట వాస్తవమే కానీ, ఈ ఆపత్సమయంలో మిగతా కూటములలోని భాగస్వాములుగా జి సెవన్ దేశాలు తాము అందిస్తున్న సహాయ సహకారాలతో పాటు.. జి7 గ్రూపుగా ప్రస్తుత పరిస్థితుల్లో బాలికల చదువును, మహిళల ఉద్యోగాలను ప్రాధాన్యతా అంశాలుగా గుర్తించాయి! జూన్‌లో జరిగే జి 7 దేశాధ్యక్షుల సదస్సులో ఇప్పుడీ జీ7 ఆర్థిక మంత్రుల నిర్ణయానికి ఆమోదముద్ర పడిన అనంతరం నిధులు పంపిణీకి ప్రణాళిక సిద్ధం అవుతుంది. విషయం ఏంటంటే.. ఇది ఒకరు అడిగితే చేస్తున్న సహాయం కాదు. సహాయం చేయవలసిన అవసరాన్ని గుర్తించి అందిస్తున్న స్నేహ హస్తం. ఆడపిల్లలకు ఆరేళ్ల వయసు నుంచి పన్నెండేళ్ల పాటు నాణ్యమైన విద్యను అందించడం, మహిళలకు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ సహాయం ముఖ్యోద్దేశం. జి7 దేశాల్లోని డి.ఎఫ్.ఐ.లు (డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్) ఈ నిధుల్ని సమీకరించి, ఆర్థికమంత్రిత్వ శాఖలకు సమకూరుస్తాయి. జి7 తాజా సమావేశం మరొక లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుంది. 2026 నాటికి అల్ప, దిగువ మధ్య తరగతి ఆదాయాలున్న దేశాలలో 4 కోట్ల మంది బాలికలను పాఠశాలల్లో చేర్పించాలి. అలాగే 2 కోట్ల మంది బాలికల్ని వారి పదో ఏట కల్లా చదవడం వచ్చిన వారిలా తీర్చిదిద్దాలి. ఈ రెండు లక్ష్యాలపై కూడా జి సెవన్ మంత్రులు సంతకాలు చేశారు. ∙∙ లండన్‌లో ‘ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్’ (ఎఫ్.సి.డి.వో.) అని విదేశీ ఆర్థిక వ్యవహారాల కార్యాలయం ఒకటి ఉంది. జి7 దేశాల ఆర్థిక మంత్రుల సమన్వయంతో అది పని చేస్తుంది. డబ్బును తెలివిగా ఇన్వెస్ట్ చేసే విషయాన్ని ఎఫ్.సి.డి.వో.నే అడగాలి ఏ దేశమైనా! బాలికల చదువు మీద పెట్టుబడి పెట్టడం వివేకవంతమైన పని అంటుంది ఎఫ్.సి.డి.వో.! ‘‘దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు, దేశ ఆర్థికాభివృద్ధికి వివిధ మార్గాలలో పెట్టుబడులు పెడుతుంటాం. అవి ఎంతవరకు ఫలిస్తాయో, ఎప్పటికి ఫలవంతం అవుతాయో కచ్చితంగా చెప్పలేం. కానీ బాలికల చదువు కోసం ఒక దేశం పెట్టే పెట్టుబడి మాత్రం నమ్మకంగా ఆ దేశంలోని పేదరికాన్ని రూపుమాపుతుంది. ఆ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది’’ అని ఎఫ్.సి.డి.వో. జి7 మంత్రుల తీర్మానానికి మద్దతు పలికింది. ‘నువ్వొక బాలుడిని చదివిస్తే అది అతడికే ఉపయోగం. ఒక బాలికను చదివిస్తే మొత్తం దేశానికే ప్రయోజనం’ అని జేమ్స్ ఎమ్మెన్ అన్న మాటను గుర్తుకు తెచ్చేలా ఈసారి జి7 మంత్రుల నిర్ణయాలు ఉన్నాయి. సోమవారం ప్రారంభమైన ఈ సమావేశాలు ‘గర్ల్స్ ఎడ్యుకేషన్ పొలిటికల్ డిక్లరేషన్’పై ఏడు దేశాలూ సంతకాలు చేయడంతో బుధవారం ముగిశాయి. కరోనా చీకట్లలో కాంతి కిరణం: బాలికల చదువుకు, మహిళల ఉపాధికి జి7 దేశాల లక్షా పది వేల కోట్ల రూపాయల తీర్మానం -
గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని?
లండన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆçహ్వానాన్ని అంగీకరిస్తే, 1993 తరువాత బ్రిటన్ ప్రధాని తొలిసారి భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 27న బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌తో ఫోన్లో మాట్లాడుతూ జనవరి 26న భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలంటూ ఆహ్వానించారు. అలాగే వచ్చేయేడాది బ్రిటన్‌లో జరిగే జీ–7 సమ్మిట్‌కి ప్రధాని మోదీని, బోరిస్ ఆహ్వనించారు. ప్రధాని నిర్ణయంపై అంతా ఆశ్చర్యపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ బ్రిటన్ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాబోయే దశాబ్దంలో భారత్, బ్రిటన్ల మధ్య సత్సంబంధాలను పెంచుకోవడానికి తన మిత్రుడు బోరిస్ జాన్సన్‌తో సుహృద్భావ చర్చలు జరిపినట్లు నవంబర్ 27న మోదీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. చివరిసారి 1993లో బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్ భారత గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు. -
ప్రపంచ వ్యాప్తంగా 10 వేల మరణాలు
ప్యారిస్: కరోనా వైరస్ మహమ్మారి ధాటికి ప్రపంచం దాదాపు స్తంభించిపోతోంది. చైనాలో పుట్టి 150 దేశాలకుపైగా విస్తరించిన ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య పదివేలు దాటగాదాదాపు 2.44 లక్షల మందికి ఈ వైరస్ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే వైరస్ మొదలైన చైనాలోని వూహాన్ ప్రాంతంలో రెండో రోజూ కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అమెరికాలోనూ కోవిడ్ మృతుల సంఖ్య 200 దాటిపోయింది. స్పెయిన్‌లో వెయ్యికి చేరిన మృతుల సంఖ్య... యూరోపియన్ దేశం స్పెయిన్‌లో శుక్రవారం నాటికి కరోనా వైరస్ ధాటికి వెయ్యిమంది బలయ్యారు. మొత్తం 20 వేల మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు శ్రీలంక శుక్రవారం నుంచి దేశవ్యాప్త కర్ఫ్యూ విధించింది. కరోనా వైరస్‌తో ఇరాన్లో మృతుల సంఖ్య 1433కి చేరిందని, 20వేల మంది పాజిటివ్‌గా తేలారని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాలో మొత్తం 274 మంది వ్యాధి బారిన పడ్డ విషయం తెలిసిందే. పాకిస్తాన్లో 452 మంది వ్యాధి బారిన పడగా ముగ్గురు మరణించారు. చైనాలో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 3,248కి చేరుకుంది. ఏటా జరిగే అగ్రదేశాధినేతల సమావేశం జీ–7తోపాటు ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డాయి. ఇటలీలో ఒక్కరోజే 627 మంది మృతి రోమ్: ఇటలీలో కరోనా విలయం కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 627 మంది బలయ్యారు. దీంతో ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,032కి చేరింది. అలాగే, కేసుల సంఖ్య 47 వేలు దాటింది. భారత ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘సార్క్ కరోనా ఎమర్జెన్సీ ఫండ్’కు నేపాల్ సుమారు 10 లక్షల డాలర్ల(10 కోట్ల నేపాలీ రూపాయలు) విరాళం ప్రకటించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలంటూ ప్రధాని మోదీ చేసిన ప్రతిపాదనకు పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ మద్దతు ప్రకటించారు. -
థర్డ్‌పార్టీ తహతహ !
ఎవ్రీబడీ లవ్స్ ఎ గుడ్ డ్రాట్.. 90వ దశకం ప్రారంభంలో పలు రాష్ట్రాలను కుదిపేసిన కరువు రక్కసి పై ప్రముఖ జర్నలిస్టు సాయినాథ్ రాసిన వ్యాస సంకలనం పేరిది. ఇది ఆయనకు రామన్ మెగసెసే అవార్డును సంపాదించి పెట్టింది. ఏదైనా సమస్య కనిపిస్తే దాని సకల లక్షణాల పై సవాలక్ష తీర్పులిచ్చేయడానికి, వాస్తవ దూరమైన వ్యాఖ్యానాలు చేయడానికే అందరూ ఉబలాటపడతారు తప్ప సరైన పరిష్కారాల పై సర్కారు సహా ఎవరూ చేసిందేమీ లేదన్నది దాని సారాంశం. దశాబ్దాల తరబడి రావణ కాష్టంలా రగులుతున్న కాశ్మీర్ సమస్య విషయంలోనూ ఇదే జరుగుతోంది. కాశ్మీర్ పై అనేక దేశాలు... మరీ ముఖ్యంగా అగ్రదేశమైన అమెరికా అంతులేని ఆసక్తిని ప్రదర్శిస్తుంటుంది. వీలు చిక్కినప్పుడల్లా అందులో జోక్యం చేసుకోవడానికి తహతహలాడుతుంటుంది. అత్యుత్సాహానికి పెట్టింది పేరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కాశ్మీర్ విషయంలో తన సహజ లక్షణాన్ని తరచూ బయటపెట్టుకుంటున్నారు. వివాదాస్పదమైన కాశ్మీర్ సమస్యపై భారత్ – పాకిస్తాన్ ప్రధాన మంత్రులతో తాను మాట్లాడానని, అవసరమైతే ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమేనని తాజాగా ఆయన మరోమారు ప్రకటించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో ఇప్పటికే మాట్లాడేశానని, త్వరలో ఫ్రాన్స్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని కాశ్మీర్‌పై చర్చిస్తానని ట్రంప్ చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని తీరప్రాంత నగరం బియారిట్జ్‌లో జరగనున్న జీ 7 సదస్సు సందర్భంగా తాను మోదీని కలుస్తానని ఆయన అంటున్నారు. జీ7లో భారత్ సభ్యదేశం కాకపోయినా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానం మేరకు ఈ సదస్సుకు మోదీ హాజరవుతున్నారు. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు అర్ధమౌతోంది. వాస్తవానికి కాశ్మీర్లో ఏ చిన్న అలజడి కనిపించినా అమెరికా వెంటనే అలర్ట్ అయిపోతుంటుంది. మధ్యవర్తిగా జోక్యం చేసుకునేందుకు, పెద్ద మనిషి తరహాలో తీర్పులిచ్చేందుకు తహతహలాడుతుంటుంది. సరిగ్గా నెలరోజుల క్రితం కూడా అమెరికా అధ్యక్షుడు ఇలాంటి ప్రకటనే చేశారు. భారత ప్రధాని మోదీ అభ్యర్థిస్తే భారత్ – పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధమేనని అన్నారు. అమెరికా పర్యటిస్తున్న పాక్ ప్రధానిని కలుసుకున్న తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. దీని పై భారత్ నిరసన వ్యక్తం చేయడంతో కొద్ది రోజులకు ట్రంప్ తన స్వరం కొంచెం తగ్గించారు. ఉభయదేశాలు కోరుకుంటేనే కాశ్మీర్ విషయంలో తాను జోక్యం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. అయినా అమెరికా అధ్యక్షుడి వైఖరిలో మార్పు లేదని, అవకాశం కోసం.. అదును కోసం ఎదురుచూస్తున్నారని తాజా ప్రకటనతో తేటతెల్లం అవుతోంది. కాశ్మీర్ సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారత్ అనుసరిస్తున్న విధానం. 370 అధికరణం రద్దు, కాశ్మీర్లో తాజా పరిణామాల నేపథ్యంలో మరోమారు తతీయపక్ష మధ్యవర్తిత్వం అంశం తెరపైకి వచ్చింది. కానీ భారత్ వైఖరికే రష్యా, బ్రిటన్ మద్దతు పలికాయి. కాశ్మీర్ సమస్యకు ద్వైపాక్షిక చర్చలే పరిష్కారమన్న తమ వైఖరిలో మార్పులేదని మోదీతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడితో పాకిస్తాన్ ప్రధానమంత్రి చర్చలు జరుపుతున్న సమయంలోనే పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ యెస్ లీడ్రియన్తో మాట్లాడి భంగపడ్డారు. ‘కాశ్మీర్ మీ రెండు దేశాల అంతర్గత సమస్య, దానిని చర్చల ద్వారా పరిష్కరించుకోండి’ అని ఫ్రెంచి విదేశాంగ మంత్రి స్పష్టం చేయడం పాక్‌కు చెంపపెట్టు వంటిదే. ఫ్రాన్స్ మాత్రమే కాదు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్‌కు ఇలాంటి షాకే ఇచ్చింది. 370 అధికరణం రద్దు అనేది భారత ప్రభుత్వ నిర్ణయం.. అది ఆ దేశ అంతర్గత సమస్య.. అందులో జోక్యం చేసుకోవడానికేమీ లేదు అని బంగ్లాదేశ్ స్పష్టం చేయడం పాక్‌కు అశనిపాతంలా తగిలింది. కాశ్మీర్ విషయంలో ట్రంప్ ఆత్రత వెనుక కారణాలు తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అటు పశ్చిమాసియాలో ప్రాబల్యాన్ని కాపాడుకోవడం, ఇటు భారత ఉపఖండాన్ని చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించడం అమెరికాకు చాలా అవసరం.. అమెరికా ‘పథకాలు’ నెరవేరాలంటే వ్యూహాత్మకంగానూ, భౌగోళికంగానూ అనుకూలంగా ఉన్న పాకిస్తాన్ చాలా కీలకం. అందుకే అది పాకిస్తాన్‌కు వంతపాడుతుంటుంది. 1962 చైనా – భారత్ యుద్ధ సమయంలో భారత్‌కు అమెరికా సహాయం చేసింది. విమానాలను, సైనిక సామగ్రిని అందించింది. అందుకు ప్రతిఫలంగా కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించేందుకు అంగీకరించాలని భారత్ పై వత్తిడి చేసిందంటే అమెరికా ఈ విషయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. 1962 నవంబర్ 21న చైనా యుద్ధం ముగియగానే భారత, పాక్ విదేశాంగ మంత్రుల సమక్షంలో 24 మంది అమెరికా అధికారులు ఆరు రౌండ్లు చర్చలు జరిపారు. అవి 1963 జనవరిలో అసంపూర్తిగా ముగిసాయి. ఆ తర్వాత ఇక అమెరికా జోక్యానికి భారత్ ఎన్నడూ ఒప్పుకోలేదు. తతీయపక్ష జోక్యానికి ఏ నాడూ తావివ్వలేదు. 1972లో బంగ్లా యుద్ధం తర్వాత కుదిరిన సిమ్లా ఒప్పందమైనా, 1999లో సంతకాలు జరిగిన లాహోర్ డిక్లరేషనైనా ద్వైపాక్షిక చర్చల పర్యవసానమే తప్ప ఎవరి జోక్యాన్నీ భారత్ అంగీకరించలేదు. 2003–2008 మధ్య నాలుగంచెల ఫార్ములాపై పలు సందర్భాలలో జరిగిన చర్చలు కూడా ద్వైపాక్షికమే తప్ప మరెవరి ప్రమేయమూ లేదు. అంతెందుకు నల్ల సూరీడు నెల్సన్ మండేలా, ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటానియో గుట్టెరాస్, నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్ సహా పలువురు అంతర్జాతీయ నాయకులు కాశ్మీర్ పై మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చినా భారత్ వైఖరిలో మార్పులేదు. ఇక ముందూ ఇదే కొనసాగుతుంది తప్ప ట్రంప్ తహతహలకు తాళం వేసే పరిస్థితి ఉండదనే చెప్పాలి. -
అంతర్జాతీయ సదస్సులు
జీ-7 ఎనిమిది అత్యంత అభివృద్ధి చెందిన దేశాల కూటమి జీ-8. అయితే, 2014లో క్రిమియా సంక్షోభం కారణంగా రష్యాను ఈ కూటమి నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఈ గ్రూప్‌ను జీ-7గా పిలుస్తున్నారు. అమెరికా, కెనడా, యూకే, ఫ్రాన్స, జర్మనీ, ఇటలీ, జపాన్‌లు ఈ కూటమిలో సభ్యదేశాలు. 42వ జీ-7 సదస్సు 2016, మే 26, 27 తేదీల్లో జపాన్‌లోని కషికో దీవిలోని షిమా నగరంలో జరిగింది. ఈ సదస్సులో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడో, ఫ్రాన్స అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఇటలీ ప్రధాని మతియో రెంజీ, జపాన్ ప్రధాని షింజో అబే, యూకే అప్పటి ప్రధాని డేవిడ్ కామెరాన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు. 43వ జీ-7 సదస్సును 2017, మేలో ఇటలీలోని సిసిలీలో నిర్వహించనున్నారు. జీ-20 ప్రపంచంలోని 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమే జీ-20. ఇది 1999లో ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల వేదికగా ఏర్పడింది. అయితే 2008లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం తర్వాత దేశాధినేతలు లేదా ప్రభుత్వాధినేతల సదస్సుగా రూపాంతరం చెందింది. జీ-20లో 19 దేశాలకు, యూరోపియన్ యూనియన్‌కు సభ్యత్వం ఉంది. భారత్ కూడా సభ్యత్వం కలిగిఉంది. 11వ జీ-20 సదస్సు 2016, సెప్టెంబర్ 4, 5 తేదీల్లో చైనాలోని హాంగ్జూ నగరంలో జరిగింది. ఈ సదస్సులో అర్జెంటీనా అధ్యక్షుడు మరీసియో మక్రి, ఆస్ట్రేలియా ప్రధాని మల్కమ్ టర్నబుల్, బ్రెజిల్ అధ్యక్షుడు మిషెల్ టెమెర్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ఫ్రాన్స అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, భారత ప్రధాని నరేంద్రమోదీ, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో, ఇటలీ ప్రధాని మతియో రెంజీ, జపాన్ ప్రధాని షింజో అబే, మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నియతో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సౌదీ అరేబియా డిప్యూటీ క్రౌన్ ప్రిన్స మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్, దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క గెన్-హై, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, యూకే ప్రధాని థెరిసా మే, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్, యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ జీన్ క్లాడ్ జంకర్లు పాల్గొన్నారు.12వ జీ-20 శిఖరాగ్ర సదస్సు 2017, జూలైలో జర్మనీలోని హాంబర్‌గలో జరగనుంది. అణుభద్రతా సదస్సు అణు ఉగ్రవాదాన్ని అరికట్టడం, అణు పదార్థాలను ఉగ్రవాదులు ఉపయోగించకుండా చూడాలనే ఉద్దేశంతో అణు భద్రతా సదస్సును 2010 నుంచి రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులు 2010లో వాషింగ్టన్లో, 2012లో సియోల్‌లో, 2014లో హేగ్‌లో జరిగాయి. నాలుగో అణు భద్రతా సదస్సు 2016, మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరిగింది. దీనికి భారత ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ఈ సదస్సులో పాల్గొన్న నేతలు అణు నిరాయుధీకరణ, అణ్వాయుధ వ్యాప్తి నిరోధం, అణు ఇంధనాన్ని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించడం వంటి లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఎస్సీవో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) ఒక రాజకీయ, ఆర్థిక, సైనిక సంస్థ. 1996లో చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్ దేశాలు ‘షాంఘై ఫైవ్’ కూటమిగా ఏర్పడ్డాయి. 2001లో ఉజ్బెకిస్థాన్ చేరికతో ఇది ఎస్సీఓగా మారింది. దీని ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్‌లో ఉంది. దీనిలో భారత్‌కు 2017లో పూర్తిస్థాయి సభ్యత్వం దక్కనుంది. భారత్‌తో పాటు పాకిస్థాన్‌కు కూడా సభ్యత్వం కల్పించనున్నారు. 2016, జూన్‌లో 16వ ఎస్సీవో సదస్సు ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్లో జరిగింది. ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. తర్వాతి సదస్సు 2017లో కజకిస్థాన్ రాజధాని అస్తానాలో జరగనుంది. బ్రిక్స్ గోల్డ్‌మన్ శాక్స్ సంస్థకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ 2001లో తొలిసారిగా ‘బ్రిక్’ (ఆఖఐఇ) అనే పదాన్ని వాడారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాల కూటమే బ్రిక్. ఈ నాలుగు అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు. బ్రిక్ తొలి సదస్సు 2009లో రష్యాలోని ఎకాతెరిన్బర్గ్ నగరంలో జరిగింది. 2010, డిసెంబర్లో దక్షిణాఫ్రికా చేరికతో ఈ గ్రూప్ బ్రిక్స్ (ఆఖఐఇ)గా మారింది. 8వ బ్రిక్స్ దేశాధినేతల సదస్సు 2016, అక్టోబర్ 15, 16 తేదీల్లో గోవాలోని బెనాలిమ్‌లో జరిగింది. ఈ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. 2012లో న్యూఢిల్లీ వేదికగా 4వ బ్రిక్స్ సదస్సు జరిగింది. గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో బ్రెజిల్ అధ్యక్షుడు మిషెల్ టెమెర్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా పాల్గొన్నారు. ఉగ్రవాదం ప్రధానాంశంగా జరిగిన ఈ సదస్సులో, భారత్‌లో జరిగిన ఉగ్రవాద దాడులను బ్రిక్స్ నేతలు తీవ్రంగా ఖండించారు. 9వ బ్రిక్స్ సదస్సును 2017లో చైనాలో నిర్వహిస్తారు. గోవా బ్రిక్స్ సదస్సుకు భారత ప్రభుత్వం బిమ్స్టెక్ (ఆఐకఖీఉఇ) దేశాలను అతిథులుగా ఆహ్వానించింది. దక్షిణాసియా, ఆగ్నేయాసియా లోని ఏడు దేశాలు బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్ట్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కో ఆపరేషన్ (బిమ్స్టెక్) అనే సంస్థను ఏర్పాటు చేశాయి. ఇందులో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మయన్మార్, థాయిలాండ్‌లు సభ్య దేశాలుగా ఉన్నాయి. బిమ్స్టెక్ ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉంది. గోవా సదస్సులో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్, మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ అంగ్‌సాన్ సూచీ, థాయిలాండ్ విదేశీ వ్యవహారాల శాఖ ఉప మంత్రి వీరసక్టి పుట్రకుల్ పాల్గొన్నారు. నామ్ సదస్సు ప్రచ్ఛన్న యుద్ధకాలంలో రెండు అగ్ర రాజ్యాలైన అమెరికా, యూఎస్ఎస్ఆర్లకు సమ దూరం పాటించిన (తటస్థంగా ఉన్న) దేశాలు ఏర్పాటు చేసుకున్న కూటమే అలీనోద్యమ కూటమి (నాన్ అలైన్డ మూమెంట్ -నామ్). ఈ కూటమి తొలి శిఖరాగ్ర సదస్సు 1961లో యుగోస్లేవియాలోని బెల్గ్రేడ్లో జరిగింది. ‘నామ్’లో 120 సభ్య దేశాలున్నాయి. ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాలు. వీటినే మూడో ప్రపంచ దేశాలు అంటారు. తీవ్ర రాజకీయ అస్థిరత, సంక్షోభం నేపథ్యంలో అలీనోద్యమ 17వ శిఖరాగ్ర సదస్సు వెనెజులాలోని పోర్లమార్ నగరంలో 2016 సెప్టెంబర్ 17, 18 తేదీల్లో జరిగింది. ఈ సదస్సుకు వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మద్యురో నేతృత్వం వహించారు. 12 దేశాల అధినేతలు మాత్రమే ఈ సదస్సుకు హాజరయ్యారు. దీన్నిబట్టి అలీనోద్యమం.. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత తన ప్రాధాన్యాన్ని కోల్పోయిందని భావించొచ్చు. భారత్.. నామ్ వ్యవస్థాపక దేశం. వెనెజులా సదస్సులో భారత్ తరఫున ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రాతినిధ్యం వహించారు. ఆసియాన్ ఆగ్నేయాసియా ప్రాంతంలోని 10 దేశాల కూటమే ఆసియాన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్). ఇది 1967లో ఏర్పడింది. ఇందులో బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, సింగపూర్, లావోస్, వియత్నాం, థాయ్‌లాండ్, మయన్మార్ (బర్మా), ఫిలిప్పీన్స్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ కూటమి ప్రధాన కార్యాలయం ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఉంది. ఆసియాన్ సదస్సులు సాధారణంగా ఏటా రెండు సార్లు జరుగుతాయి. 28, 29వ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులు 2016, సెప్టెంబర్ 6న లావోస్ రాజధాని వియాంటియాన్‌లో జరిగాయి. ఆతిథ్య దేశ ప్రధాని థోంగ్లన్ సిసోలిథ్ అధ్యక్షత వహించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, సహజ విపత్తులు, వాతావరణ మార్పులు, సముద్ర జలాల పరిరక్షణ, భూ వివాదాలు వంటి కీలకాంశాలపై చర్చించారు. కూటమి దేశాల వార్షిక సమావేశం అనంతరం ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. 14వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సు 2016, సెప్టెంబర్ 7న వియాంటియాన్‌లో జరిగింది. ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. 2017లో ఆసియాన్ సదస్సులు ఫిలిప్పీన్స్‌లో జరుగుతాయి. తూర్పు ఆసియా సదస్సు వార్షిక ఆసియాన్ సదస్సు ముగిసిన వెంటనే అదే నగరంలో తూర్పు ఆసియా సదస్సును నిర్వహిస్తారు. తూర్పు ఆసియా సదస్సు (ఉ్చట్ట అటజ్చీ ఠఝఝజ్టీ-ఉఅ)లో మొత్తం 18 సభ్య దేశాలున్నాయి. అవి.. 10 ఆసియాన్ దేశాలు, చైనా, భారత్ , జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యాలు. 11వ తూర్పు ఆసియా సదస్సు 2016, సెప్టెంబర్ 8న లావోస్ రాజధాని వియాంటియాన్‌లో జరిగింది. దీనికి భారత ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. 12వ తూర్పు ఆసియా సదస్సును 2017లో ఫిలిప్పీన్స్‌లో నిర్వహించనున్నారు. హార్ట్ ఆఫ్ ఆసియా అఫ్గానిస్తాన్ దాని పొరుగు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సహకారానికి, ముఖ్యమైన ప్రాంతీయ అంశాలను చర్చించడానికి వేదికగా 2011, నవంబర్‌లో హార్ట్ ఆఫ్ ఆసియా సంస్థ ఏర్పడింది. హార్ట్ ఆఫ్ ఆసియా మొట్టమొదటి మంత్రుల సమావేం 2011, నవంబర్ 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగింది. ఈ సంస్థలో భారత్ సహా 14 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. హార్ట్ ఆఫ్ ఆసియా 6వ మంత్రుల సమావేశం 2016, డిసెంబర్ 3, 4 తేదీల్లో భారత్‌లోని అమృత్‌సర్‌లో జరిగింది. ఈ సమావేశాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రధానంగా ఉగ్రవాదంపై చర్చించారు. ఎపెక్ ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ (అ్కఉఇ)లోని సభ్య దేశాల సంఖ్య 21. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ఈ దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని పెంపొందించేందుకు 1989లో ఎపెక్ను ఏర్పాటు చేశారు. ఇందులో ఆస్ట్రేలియా, బ్రూనై, కెనడా, చిలీ, చైనా, తైవాన్, హాంగ్‌కాంగ్, పపువా న్యూగినియా, ఇండోనేసియా, జపాన్, దక్షిణ కొరియా, మలేసియా, మెక్సికో, న్యూజిలాండ్, పెరూ, ఫిలిప్పీన్స్, రష్యా, సింగపూర్, థాయ్‌లాండ్, అమెరికా, వియత్నాంలు సభ్యదేశాలుగా ఉన్నాయి. 2016, నవంబర్ 19, 20 తేదీల్లో ఎపెక్ దేశాల ఆర్థిక నాయకుల సదస్సు పెరూ రాజధాని లిమాలో జరిగింది. ఈ సదస్సుకు పెరూ అధ్యక్షుడు పెడ్రో పాబ్లో కుజిన్‌స్కీ అధ్యక్షత వహించారు. 2017లో ఎపెక్ సదస్సు వియత్నాంలోని దనాంగ్‌లో జరగనుంది. ఎన్. విజయేందర్ రెడ్డి జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్