ఢిల్లీ: ఇటలీలో రేపు( శుక్రవారం) జరగబోయే జీ-7 దేశాల సమ్మిట్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సుల్లివన్ బుధవారం తెలిపారు. జీ-7 దేశాల సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ఇటలీ వెళ్తున్న సమయంలో జేక్ మీడియాతో మాట్లాడారు.
‘‘ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఇటలీలో ప్రధాని మోదీని చూడాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే జీ-7 సమ్మిత్‌కు మోదీ హాజరవుతారని భారత్ అధికారంగా ప్రకటించింది. అయితే మోదీ, బైడెన్ ఇటలీలో కలుసుకునే అవకాశం ఉందని భావిస్తున్నా’’ అని అన్నారు. అదే విధంగా తాము పారిస్‌లో ఉన్న సమయంలో అధ్యక్షుడు బైడెన్ మోదీకి ఫోన్ చేసినట్లు తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని అయినందుకు బైడెన్ ఫోన్‌లో శుభాకాక్షలు తెలిపారని అన్నారు.
ఇక.. ప్రధాని మోదీ ఇవాళ (గురువారం) ఇటలీ బయల్దేరనున్నారు. మోదీ మూడోసారిగా ప్రధానమంత్రి బాధ్యత్యలు చేపట్టిన అనంతరం ఇటలీ ఆయన మొదటి విదేశి పర్యటన కావటం గమనార్హం.
జూన్ 14న తమ దేశంలో జరగనున్న 50వ జీ-7 సమ్మిట్‌కు హాజరుకావాలని ఇటలీ.. భారత్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ కానున్నారని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. అదే విధంగా సమ్మిట్ వచ్చే ఇతర దేశాల నేతలతో సైతం ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు క్వాత్రా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment