బీజింగ్: ఇటలీ వేదికగా జీ-7 దేశాధినేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై చైనా విమర్శలు గుప్పించింది. రష్యాకు ఆయుధాలు సరాఫరా చేయవద్దని జీ-7 దేశాధినేతలు చైనాను హెచ్చరించారు. ఈ మేరకు జీ-7 సమ్మిట్‌లో సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
దీనిపై తాజాగా చైనా స్పందించింది. జీ-7 దేశాల సమ్మిట్ విడుదల చేసిన ప్రకటన అహంకారం, పక్షపాతం, అబద్దాలతో కూడినదని విమర్శలు చేసింది. సోమవారం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మీడియాతో మాట్లాడారు.
‘జీ-7 దేశాధినేతలు చైనాకు వ్యతిరేకంగా అసత్యాలతో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ దేశాలు చేస్తున్న ఆరోపణలు నిజం కాదు. చట్టబద్ధత, నైతికతకు దూరంగా ఉన్నాయి. జీ-7 సమ్మిట్ ప్రకటన పూర్తిగా అహంకారం, పక్షపాతం, అసత్యాలతో కూడినది. జీ-7 కూటమి ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించేంది కాదు. ప్రపంచ జనాభాలో ఆ ఏడు దేశాలు కేవలం పదిశాతం జనాభాను మాత్రమే కలిగి ఉంటాయి.
.. ఆ ఏడు దేశాలు మొత్తం కలిసినా కూడా ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి అందించే సహాకారం చైనా కంటే తక్కువ. జీ-7 దేశాల కూటమి అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను స్థిరంగా ఉంచటంలో కీలకంగా వ్యవహరించాలి. కానీ, అమెరికా, పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని పెంచే ఒక పోలిటికల్ టూల్‌గా మారింది’ అని లిన్ జియాన్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment