G-7 Summit: బైడెన్‌కు ఏమైంది?.. ఇటలీలో వింత ప్రవర్తన! | US President Joe Biden Awkward Moment At G-7 Summit In Italy, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

G-7 Summit: బైడెన్‌కు ఏమైంది?.. ఇటలీలో వింత ప్రవర్తన!

Published Fri, Jun 14 2024 9:40 AM | Last Updated on Fri, Jun 14 2024 9:52 AM

US President Joe Biden Awkward Moment At G-7 Summit In Italy

ఇటలీ వేదికగా ప్రతిష్ఠాత్మక జీ-7 దేశాల సదస్సుకు పలు దేశాల నేతల హాజరయ్యారు. జీ-7లో అమెరికా సభ్య దేశం కావడంతో​ సదస్సులో పాల్గొనేందుకు యూఎస్‌ అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఇటలీ చేరుకున్నారు. కాగా, ఇటలీలో జో బైడెన్‌ వింతగా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో, బైడెన్‌ ప్రవర్తనపై సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది.

ఇటలీ తీరప్రాంత నగరం అపూలియాలో రెండు రోజులపాటు జీ-7 సదస్సు కొనసాగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందకు జీ-7 కూటమి దేశాల నేతలు ఇటలీ చేరుకున్నారు. కాగా, సదస్సు ఆరంభం కావడానికి ముందు అపూలియా తీర ప్రాంతాన్ని ఆయా దేశాల నేతలు సందర్శించారు. అక్కడ ఉన్న వాటర్ స్పోర్ట్స్‌ను వీక్షించారు. పారా గైడ్లింగ్‌ చేస్తున్న వారిని పలకరించారు. ఆ సమయంలో జో బైడెన్ వింతగా ప్రవర్తించారు.

 

 

తీర ప్రాంతం వద్ద రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, మెలోనీ, ఉర్సులా వాన్ డెర్.. ఒకవైపు ఉండి వాటర్ స్పోర్ట్స్‌ను తిలకిస్తోండగా.. జో బైడెన్ మాత్రం వారికి దూరంగా వెళ్లి దిక్కులు చూస్తూ నిలబడిపోయారు. అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరితోనో ఆయన మాట్లాడుతున్నట్టు సైగలు చేశారు. కుడి చెయ్యి పైకి ఎత్తి పలకరించడం కనిపించింది. ఈ సమయంలో బైడెన్‌ను గమనించిన మెలోని ఆయన దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకువచ్చారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బైడెన్‌కు ఏమైందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

అయితే, బైడెన్‌ ఇలా వింతగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. అంతుకుముందు పలు సందర్భాల్లో కూడా ఆయన ఇలాగే చేశారు. అమెరికాకు సంబంధించి చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే కార్యక్రమంలో సెనేట్‌ మెజార్టీ లీడన్‌ చక్‌ షూమర్‌ అందరికీ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. పొడియం వద్దకు వచ్చిరాగానే ముందుగా బైడెన్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి, ఆ తర్వాత స్టేజ్‌ మీద ఉన్న మిగతావాళ్లకు ఇచ్చాడు లీడన్‌. అప్పటికి తను షేక్‌హ్యాండ్ ఇచ్చిన విషయం మర్చిపోయిన బైడెన్.. మరోసారి షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు తీసుకెళ్లారు. అయితే చేతిని కాసేపు అలాగే షేక్‌ హ్యాండ్‌ పొజిషన్‌లో ఉంచి షాక్‌తో మళ్లి చేతిని కిందకు దించాడు బైడెన్‌. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

 

గతంలోనూ ఇలాంటి పొరపాటే చేసి మీడియాకు అడ్డంగా దొరికిపోయారు బైడెన్‌. ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ పేరు సైతం మర్చిపోవడం, తనతోపాటు పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు. 
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement