అంతర్జాతీయ సదస్సులు | International Conferences | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సదస్సులు

Published Sun, Dec 11 2016 4:13 AM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

అంతర్జాతీయ సదస్సులు

అంతర్జాతీయ సదస్సులు

 జీ-7
 ఎనిమిది అత్యంత అభివృద్ధి చెందిన దేశాల కూటమి జీ-8. అయితే, 2014లో క్రిమియా సంక్షోభం కారణంగా రష్యాను ఈ కూటమి నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి  నుంచి ఈ గ్రూప్‌ను జీ-7గా పిలుస్తున్నారు. అమెరికా, కెనడా, యూకే, ఫ్రాన్‌‌స, జర్మనీ, ఇటలీ, జపాన్‌లు ఈ కూటమిలో సభ్యదేశాలు.  42వ జీ-7 సదస్సు 2016, మే 26, 27 తేదీల్లో జపాన్‌లోని కషికో దీవిలోని షిమా నగరంలో జరిగింది. ఈ సదస్సులో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడో, ఫ్రాన్‌‌స అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఇటలీ ప్రధాని మతియో రెంజీ, జపాన్ ప్రధాని షింజో అబే, యూకే అప్పటి ప్రధాని డేవిడ్ కామెరాన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు. 43వ జీ-7 సదస్సును 2017, మేలో ఇటలీలోని సిసిలీలో నిర్వహించనున్నారు.
 
 జీ-20
 ప్రపంచంలోని 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమే జీ-20. ఇది 1999లో ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల వేదికగా ఏర్పడింది. అయితే 2008లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం తర్వాత దేశాధినేతలు లేదా ప్రభుత్వాధినేతల సదస్సుగా రూపాంతరం చెందింది. జీ-20లో 19 దేశాలకు, యూరోపియన్ యూనియన్‌కు సభ్యత్వం ఉంది. భారత్ కూడా సభ్యత్వం కలిగిఉంది.
 
  11వ జీ-20 సదస్సు 2016, సెప్టెంబర్ 4, 5 తేదీల్లో చైనాలోని హాంగ్‌జూ నగరంలో జరిగింది. ఈ సదస్సులో అర్జెంటీనా అధ్యక్షుడు మరీసియో మక్రి, ఆస్ట్రేలియా ప్రధాని మల్కమ్ టర్‌‌నబుల్, బ్రెజిల్ అధ్యక్షుడు మిషెల్ టెమెర్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ఫ్రాన్‌‌స అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, భారత ప్రధాని నరేంద్రమోదీ, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో, ఇటలీ ప్రధాని మతియో రెంజీ, జపాన్ ప్రధాని షింజో అబే, మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నియతో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సౌదీ అరేబియా డిప్యూటీ క్రౌన్ ప్రిన్‌‌స మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్, దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్‌‌క గెన్-హై, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, యూకే ప్రధాని థెరిసా మే, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్, యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ జీన్ క్లాడ్ జంకర్‌లు పాల్గొన్నారు.12వ జీ-20 శిఖరాగ్ర సదస్సు 2017, జూలైలో జర్మనీలోని హాంబర్‌‌గలో జరగనుంది.
 
 అణుభద్రతా సదస్సు
 అణు ఉగ్రవాదాన్ని అరికట్టడం, అణు పదార్థాలను ఉగ్రవాదులు ఉపయోగించకుండా చూడాలనే ఉద్దేశంతో అణు భద్రతా సదస్సును 2010 నుంచి రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులు 2010లో వాషింగ్టన్‌లో, 2012లో సియోల్‌లో, 2014లో హేగ్‌లో జరిగాయి. నాలుగో అణు భద్రతా సదస్సు 2016, మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరిగింది. దీనికి భారత ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ఈ సదస్సులో పాల్గొన్న నేతలు అణు నిరాయుధీకరణ, అణ్వాయుధ వ్యాప్తి నిరోధం, అణు ఇంధనాన్ని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించడం వంటి లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.
 
 ఎస్‌సీవో
 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) ఒక రాజకీయ, ఆర్థిక, సైనిక సంస్థ. 1996లో చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్ దేశాలు ‘షాంఘై ఫైవ్’ కూటమిగా ఏర్పడ్డాయి. 2001లో ఉజ్బెకిస్థాన్ చేరికతో ఇది ఎస్‌సీఓగా మారింది. దీని ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్‌లో ఉంది. దీనిలో భారత్‌కు 2017లో పూర్తిస్థాయి సభ్యత్వం దక్కనుంది. భారత్‌తో పాటు పాకిస్థాన్‌కు కూడా సభ్యత్వం కల్పించనున్నారు. 2016, జూన్‌లో 16వ ఎస్‌సీవో సదస్సు ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌లో జరిగింది. ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. తర్వాతి సదస్సు 2017లో కజకిస్థాన్ రాజధాని అస్తానాలో జరగనుంది.
 
 బ్రిక్స్
 గోల్డ్‌మన్ శాక్స్ సంస్థకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ 2001లో తొలిసారిగా ‘బ్రిక్’ (ఆఖఐఇ) అనే పదాన్ని వాడారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాల కూటమే బ్రిక్. ఈ నాలుగు అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు. బ్రిక్ తొలి సదస్సు 2009లో రష్యాలోని ఎకాతెరిన్‌బర్గ్ నగరంలో జరిగింది. 2010, డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా చేరికతో ఈ గ్రూప్ బ్రిక్స్ (ఆఖఐఇ)గా మారింది.  8వ బ్రిక్స్ దేశాధినేతల సదస్సు 2016, అక్టోబర్ 15, 16 తేదీల్లో గోవాలోని బెనాలిమ్‌లో జరిగింది. ఈ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. 2012లో న్యూఢిల్లీ వేదికగా 4వ బ్రిక్స్ సదస్సు జరిగింది. గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో బ్రెజిల్ అధ్యక్షుడు మిషెల్ టెమెర్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా పాల్గొన్నారు. ఉగ్రవాదం ప్రధానాంశంగా జరిగిన ఈ సదస్సులో, భారత్‌లో జరిగిన ఉగ్రవాద దాడులను బ్రిక్స్ నేతలు తీవ్రంగా ఖండించారు. 9వ బ్రిక్స్ సదస్సును 2017లో చైనాలో నిర్వహిస్తారు.
 
  గోవా బ్రిక్స్ సదస్సుకు భారత ప్రభుత్వం బిమ్స్‌టెక్ (ఆఐకఖీఉఇ) దేశాలను అతిథులుగా ఆహ్వానించింది. దక్షిణాసియా, ఆగ్నేయాసియా లోని ఏడు దేశాలు బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్ట్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కో ఆపరేషన్ (బిమ్స్‌టెక్) అనే సంస్థను ఏర్పాటు చేశాయి. ఇందులో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మయన్మార్, థాయిలాండ్‌లు సభ్య దేశాలుగా ఉన్నాయి. బిమ్స్‌టెక్ ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉంది. గోవా సదస్సులో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్, మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ అంగ్‌సాన్ సూచీ, థాయిలాండ్ విదేశీ వ్యవహారాల శాఖ ఉప మంత్రి వీరసక్టి పుట్రకుల్ పాల్గొన్నారు.
 
  నామ్ సదస్సు
 ప్రచ్ఛన్న యుద్ధకాలంలో రెండు అగ్ర రాజ్యాలైన అమెరికా, యూఎస్‌ఎస్‌ఆర్‌లకు సమ దూరం పాటించిన (తటస్థంగా ఉన్న) దేశాలు ఏర్పాటు చేసుకున్న కూటమే అలీనోద్యమ కూటమి (నాన్ అలైన్‌‌డ మూమెంట్ -నామ్). ఈ కూటమి తొలి శిఖరాగ్ర సదస్సు 1961లో యుగోస్లేవియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగింది. ‘నామ్’లో 120 సభ్య దేశాలున్నాయి. ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాలు. వీటినే మూడో ప్రపంచ దేశాలు అంటారు. తీవ్ర రాజకీయ అస్థిరత, సంక్షోభం నేపథ్యంలో అలీనోద్యమ 17వ శిఖరాగ్ర సదస్సు వెనెజులాలోని పోర్లమార్ నగరంలో 2016 సెప్టెంబర్ 17, 18 తేదీల్లో జరిగింది. ఈ సదస్సుకు వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మద్యురో నేతృత్వం వహించారు. 12 దేశాల అధినేతలు మాత్రమే ఈ సదస్సుకు హాజరయ్యారు. దీన్నిబట్టి అలీనోద్యమం.. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత తన ప్రాధాన్యాన్ని కోల్పోయిందని భావించొచ్చు. భారత్.. నామ్ వ్యవస్థాపక దేశం. వెనెజులా సదస్సులో భారత్ తరఫున ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రాతినిధ్యం వహించారు.
 
 ఆసియాన్
 ఆగ్నేయాసియా ప్రాంతంలోని 10 దేశాల కూటమే ఆసియాన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్). ఇది 1967లో ఏర్పడింది. ఇందులో బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, సింగపూర్, లావోస్, వియత్నాం, థాయ్‌లాండ్, మయన్మార్ (బర్మా), ఫిలిప్పీన్స్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ కూటమి ప్రధాన కార్యాలయం ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఉంది. ఆసియాన్ సదస్సులు సాధారణంగా ఏటా రెండు సార్లు జరుగుతాయి. 28, 29వ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులు 2016, సెప్టెంబర్ 6న లావోస్ రాజధాని వియాంటియాన్‌లో జరిగాయి. ఆతిథ్య దేశ ప్రధాని థోంగ్లన్ సిసోలిథ్ అధ్యక్షత వహించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, సహజ విపత్తులు, వాతావరణ మార్పులు, సముద్ర జలాల పరిరక్షణ, భూ వివాదాలు వంటి కీలకాంశాలపై చర్చించారు. కూటమి దేశాల వార్షిక సమావేశం అనంతరం ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. 14వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సు 2016, సెప్టెంబర్ 7న వియాంటియాన్‌లో జరిగింది. ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. 2017లో ఆసియాన్ సదస్సులు ఫిలిప్పీన్స్‌లో జరుగుతాయి.
 
 తూర్పు ఆసియా సదస్సు
 వార్షిక ఆసియాన్ సదస్సు ముగిసిన వెంటనే అదే నగరంలో తూర్పు ఆసియా సదస్సును నిర్వహిస్తారు. తూర్పు ఆసియా సదస్సు (ఉ్చట్ట అటజ్చీ ఠఝఝజ్టీ-ఉఅ)లో మొత్తం 18 సభ్య దేశాలున్నాయి. అవి.. 10 ఆసియాన్ దేశాలు, చైనా, భారత్ , జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యాలు. 11వ తూర్పు ఆసియా సదస్సు 2016, సెప్టెంబర్ 8న లావోస్ రాజధాని వియాంటియాన్‌లో జరిగింది. దీనికి భారత ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. 12వ తూర్పు ఆసియా సదస్సును 2017లో ఫిలిప్పీన్స్‌లో నిర్వహించనున్నారు.
 
 హార్ట్ ఆఫ్ ఆసియా
 అఫ్గానిస్తాన్ దాని పొరుగు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సహకారానికి, ముఖ్యమైన ప్రాంతీయ అంశాలను చర్చించడానికి వేదికగా 2011, నవంబర్‌లో హార్ట్ ఆఫ్ ఆసియా సంస్థ ఏర్పడింది. హార్ట్ ఆఫ్ ఆసియా మొట్టమొదటి మంత్రుల సమావేం 2011, నవంబర్ 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగింది. ఈ సంస్థలో భారత్ సహా 14 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. హార్ట్ ఆఫ్ ఆసియా 6వ మంత్రుల సమావేశం 2016, డిసెంబర్ 3, 4 తేదీల్లో భారత్‌లోని అమృత్‌సర్‌లో జరిగింది. ఈ సమావేశాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రధానంగా ఉగ్రవాదంపై చర్చించారు.
 
 ఎపెక్
 ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ (అ్కఉఇ)లోని సభ్య దేశాల సంఖ్య 21. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ఈ దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని పెంపొందించేందుకు 1989లో ఎపెక్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఆస్ట్రేలియా, బ్రూనై, కెనడా, చిలీ, చైనా, తైవాన్, హాంగ్‌కాంగ్, పపువా న్యూగినియా, ఇండోనేసియా, జపాన్, దక్షిణ కొరియా, మలేసియా, మెక్సికో, న్యూజిలాండ్, పెరూ, ఫిలిప్పీన్స్, రష్యా, సింగపూర్, థాయ్‌లాండ్, అమెరికా, వియత్నాంలు సభ్యదేశాలుగా ఉన్నాయి.
 
  2016, నవంబర్ 19, 20 తేదీల్లో ఎపెక్ దేశాల ఆర్థిక నాయకుల సదస్సు పెరూ రాజధాని లిమాలో జరిగింది. ఈ సదస్సుకు పెరూ అధ్యక్షుడు పెడ్రో పాబ్లో కుజిన్‌స్కీ అధ్యక్షత వహించారు. 2017లో ఎపెక్ సదస్సు వియత్నాంలోని దనాంగ్‌లో జరగనుంది.
 
 ఎన్. విజయేందర్ రెడ్డి
 జనరల్ అవేర్‌నెస్ ఫ్యాకల్టీ,
 హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement