యూఏఈ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ నిత్యావసర సరుకుల పంపిణీ | UAE Telugu Association Distributes essentials on the occasion of Ramadan month | Sakshi
Sakshi News home page

యూఏఈ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ నిత్యావసర సరుకుల పంపిణీ

Published Tue, Apr 18 2023 3:14 PM | Last Updated on Tue, Apr 18 2023 3:16 PM

UAE Telugu Association Distributes essentials on the occasion of Ramadan month - Sakshi

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని దుబాయ్ లోని సోనాపూర్ లేబర్ క్యాంపులో ఆదివారం (ఏప్రిల్ 16) అక్కడి కార్మికులకు తెలుగు అసోసియేషన్ వారు (tauae.org) నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బియ్యం, పప్పు దినుసులు, నూనె, పండ్లు తదితర నిత్యావసర సరుకులతో కూడిన కిట్స్ అందజేశారు. తెలుగు అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ సహాయ కార్యక్రమం పట్ల కార్మికులు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మున్ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమానికి తెలుగు అసోసియేషన్ తరఫున కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్లు రవి ఉట్నూరి, సాయి ప్రకాష్ సుంకు సంయుక్త ఆధ్వర్యంలో విజయ భాస్కర్, భీం శంకర్, శరత్ చంద్ర, శ్రీమతి ఉషాదేవి, శ్రీమతి లతానగేష్ కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్ కుమార్ ఉగ్గిన, ఉపాధ్యక్షుడు మసిఉద్దీన్, ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుసా, వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీనివాసరావు యండూరి, మార్కెటింగ్ డైరెక్టర్ అంబేడ్కర్, లీగల్ డైరెక్టర్ శ్రీధర్ దామర్ల, ఫహీమ్, మోహన కృష్ణ, సీహెచ్‌ శ్రీనివాస్, చైతన్య తదితరులు కార్యక్రమానికి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement