Ramadan month
-
యూఏఈ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ నిత్యావసర సరుకుల పంపిణీ
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని దుబాయ్ లోని సోనాపూర్ లేబర్ క్యాంపులో ఆదివారం (ఏప్రిల్ 16) అక్కడి కార్మికులకు తెలుగు అసోసియేషన్ వారు (tauae.org) నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బియ్యం, పప్పు దినుసులు, నూనె, పండ్లు తదితర నిత్యావసర సరుకులతో కూడిన కిట్స్ అందజేశారు. తెలుగు అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ సహాయ కార్యక్రమం పట్ల కార్మికులు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మున్ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు అసోసియేషన్ తరఫున కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్లు రవి ఉట్నూరి, సాయి ప్రకాష్ సుంకు సంయుక్త ఆధ్వర్యంలో విజయ భాస్కర్, భీం శంకర్, శరత్ చంద్ర, శ్రీమతి ఉషాదేవి, శ్రీమతి లతానగేష్ కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్ కుమార్ ఉగ్గిన, ఉపాధ్యక్షుడు మసిఉద్దీన్, ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుసా, వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీనివాసరావు యండూరి, మార్కెటింగ్ డైరెక్టర్ అంబేడ్కర్, లీగల్ డైరెక్టర్ శ్రీధర్ దామర్ల, ఫహీమ్, మోహన కృష్ణ, సీహెచ్ శ్రీనివాస్, చైతన్య తదితరులు కార్యక్రమానికి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ మాసం శుభాకాంక్షలు
-
ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ నెల శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు నియమనిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య మాసాన్ని ముస్లిం సోదర సోదరీమణులంతా జరుపుకొం టారని, వారికి అల్లాహ్ దీవెనలు లభించాలని ఆయన ఆకాంక్షిం చారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. రంజాన్ అంటే ఉపవాస దీక్షలు మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప సందర్భం అని ఆయన అన్నారు. -
రేపటి నుంచి ప్రారంభం కానున్న రంజాన్ మాసం
-
రంజాన్‌కు ముమ్మర ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నగరంలోని మసీదులు, దర్గాల వద్ద ముమ్మర ఏర్పాట్లు చేశారు. బుధవారం నెలవంక కన్పించక పోవడంతో గురువారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్నట్లు రుహయిత్-ఇ-హిలాల్ కమిటీ ప్రకటించింది. నెలవంక కన్పించిన వెంటనే మసీదుల్లో తరాబీ నమాజ్‌తో రంజాన్ మాసం ప్రారంభం అవుతుంది. శుక్రవారం నుంచి ఉపవాసదీక్షలు ప్రారంభం అవుతాయి. ఇప్పటికే ప్రభుత్వం తరపున మక్కామసీదు, రాయల్ మసీదుల్లో ఏర్పాట్లు పూర్తిచేశారు. నమాజ్ వేళల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఒక గంట ముందే విధులను విరమించుకోవచ్చని తెలిపింది. జూన్ 18 నుంచి జూలై 17 వరకు ఇది వర్తిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. -
చాయ్.. ‘ఖావా’లా?
* ఆరోగ్యాన్యిచ్చేదిగా గుర్తింపు * రంజాన్‌లో మంచి ఆదరణ అరబ్ దేశపు చాయ్ ‘ఖావా’కు హైదరాబాద్‌లో భలే డిమాండ్ ఉంది. ఖావా అంటే అరబ్బీ భాషలో వివిధ ఔషధాల మిశ్రమం అని అర్థం. సుమారు వెయ్యేళ్లకు పూర్వం అరబ్ దేశమైన యెమన్‌లో షాజిలీ, ఖామిరి అనే ఇద్దరు ధర్మ పండితులు రాత్రి పూట దైవ నామస్మరణ (జాగరణ)లో గడపడానికి ఈ వేడి పానీయాన్ని తయారు చేసి వాడడం మొదలు పెట్టారు. దీనికి ‘ఖావా’ అని పేరు పెట్టారని చెబుతారు. కాలక్రమేణా ఇది ‘ఖావ’గా మారిపోయింది. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ కాలంలో ప్రభుత్వ మిలట్రీ కోసం యెమన్ నుంచి అరబ్లను ఇక్కడికి తీసుకొచ్చి వారికి రక్షణ సంబంధిత బాధ్యతలను అప్పగించారు. సుమారు 150 ఏళ్ల నుంచి ఈ ఖావా మన హైదరాబాద్‌లోని అరబ్‌ల వాడకంలో ఉందని అంటారు. - సాక్షి, సిటీ బ్యూరో ఇలా తయారవుతోంది కాఫీ పొడి, సొంటి, ఎండు అల్లం, దాల్చిన చెక్క, ఇలాచీని నూరి పౌడర్లా తయారు చేస్తారు. దీనిని వేడినీటిలో కలపడంతో ఖావా తయారవుతుంది. ప్రస్తుతం ఇది ఖావా, పాల ఖావా, లెమన్ ఖావాలనే మూడు రకాలలో లభ్యమవుతోంది. అరబ్‌లు ఉన్నచోట ఖావా తప్పక ఉంటుంది. వారి దినచర్యలో దీనికి ఎంతో ప్రాధాన్యమిస్తారు. ఖావా పౌడర్ బార్కాస్‌లోని ప్రధాన దుకాణాలలో లభ్యమవుతుంది. 25 గ్రాముల పౌడర్ ధర 100 వరకు ఉంటోంది. ఇవీ ప్రయోజనాలు ఖావా తాగడం ద్వారా జీర్ణశక్తి పెరగడంతో పాటు మలబద్ధకం దూరమవుతుంది. జలుబు తగ్గుతుంది. పరగడుపున ఖావా తాగడం ద్వారా ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని హబీబ్ అబ్దుల్ రెహమాన్ అంటున్నారు. గత 50 ఏళ్లలో ఖావా లేకుండా ఒక్క రోజు కూడా గడపలేదని చెబుతున్నారు. బార్కాస్‌లోని ప్రతి ఇంట్లో రంజాన్ ఉపవాసాలను ఇఫ్తార్ ఖావా, ఖర్జూరంతో విడవడం ఆనవాయితీగా వస్తోంది. రోజుకు మూడు నాలుగుసార్లు ఖావా తాగడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉందని సయ్యద్ అహ్మద్ బిన్ అల్వీ అంటున్నారు. మార్కెట్లో... రంజాన్ మాసంలో ఖావా దుకాణాలు పెద్ద ఎత్తున వెలిశాయి. యువకులు, మహిళలు, వృద్ధులు ఖావా తాగేందుకు ఎంతో ఇష్టపడతారు. పాల ఖావాకు మంచి ఆదరణ ఉంది. అన్ని వయసుల వారు దీనిని ఆదరిస్తున్నారు. పాతబస్తీలోని హుస్సేనీఆలం, డబీర్‌పురా, శాలిబండ, సలాల, బార్కాస్ తదితర ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఖావా విక్రయాలు కొనసాగుతున్నాయి.