
భర్త వేధింపులకు లేడీ డాక్టర్ బలి!
భువనేశ్వర్: శ్వేతపద్మ మిశ్రా అనే మహిళా డాక్టర్ బహుళ అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్వేత మరణంపై ఆమె తల్లిదండ్రులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
భర్త ఆరిజిత్ మహాపాత్ర వేధింపుల వల్లే శ్వేత చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. మహాపాత్ర కట్నం కోసం తమ కుమార్తెను వేధించేవాడని, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని చెప్పారు. మహాపాత్ర కూడా డాక్టర్గా పనిచేస్తున్నాడు. పోలీసులు శ్వేత అత్తామామలను, ఇరుగుపొరుగు వారిని విచారించారు. శ్వేత మరణానికి గల కారణాలను ఇప్పుడే వెల్లడించలేమని పోలీసులు చెప్పారు. కాగా బిల్డింగ్ పైనుంచి ఒకవ్యక్తి ఆమెను కిందికి నెట్టేయడం సాధ్యంకాదని అభిప్రాయపడ్డారు.