హైదరాబాద్ : వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి లోనైన ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంజీరా కాలనీ మంగాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగాపురం కాలనీకి చెందిన అనసూయ(26) ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కొంతకాలం పాటు పనిచేశారు. ఇటీవల రాసిన ఎండీ ప్రవేశ పరీక్షలో అర్హత పొందలేకపోవటంతో తీవ్ర ఆందోళనకు లోనైన ఆమె శనివారం తన ఇంట్లోనే ఉరి వేసుకుని తనువు చాలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.