వైరల్‌: ఊపిరి ఊది ప్రాణం పోసిన డాక్టరమ్మ | Agra Doctor Mouth To Mouth Breath To New Baby Born Video Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: చలనం లేని బిడ్డకు ఊపిరి ఊది ప్రాణం పోసిన డాక్టరమ్మ

Published Sat, Sep 24 2022 11:40 AM | Last Updated on Sat, Sep 24 2022 12:35 PM

Agra Doctor Mouth To Mouth Breath To New Baby Born Video Viral - Sakshi

వైరల్‌: రాత రాసేది బ్రహ్మ.. ప్రాణం మోసేది అమ్మ.. మరి ఆ ప్రాణం నిలిపేది?.. ఇంకెవరు దైవంతో సమానమైన వైద్యులు. ఇక్కడో డాక్టరమ్మ అప్పుడే పుట్టిన ఓ బిడ్డకు ప్రాణదానం చేసింది. ఒక తల్లికి గుండెకోతను తప్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 

నార్మల్‌ డెలివరీ ద్వారా పుట్టిన ఓ ఆడబిడ్డ.. చలనం లేకుండా ఉంది. ఆ బిడ్డకు శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారిందని వైద్యులు గుర్తించారు. దీంతో.. ఆక్సిజన్‌ సపోర్ట్‌ ద్వారా బిడ్డకు ఊపిరి అందించే యత్నం చేశారు వైద్యులు. అయితే.. నవజాత శిశువు కావడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో.. నోటి ద్వారా శ్వాసను అందించడానికి సిద్ధమైంది అక్కడే ఉన్న ఓ డాక్టరమ్మ. అలా ఏడు నిమిషాలపాటు శ్వాస అందించింది. వేర్వేరు ప్రయత్నాలు చేసింది. చివరకు బిడ్డ ఊపిరి పీల్చుకుంది. కళ్లు తెరిచిన ఆ బిడ్డను చూసి ఆ వైద్యురాలు ఎంతగానో మురిసిపోయింది. వెల కట్టలేని క్షణం అది!.

ఆగ్రా ఎట్మాదపూర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో మార్చి నెలలోనే ఈ ఘటన జరిగింది. ఆ వైద్యురాలి పేరు డాక్టర్‌ సులేఖ చౌదరి. సచిన్‌ కౌశిక్‌ అనే యూపీ అధికారి తాజాగా ఈ వీడియోను వైరల్‌ చేయడంతో.. ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి: అన్యోన్యం.. ఆ అవ్వ ప్రేమకు అంతా ఫిదా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement