Viral Video: మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోయాన్నదానికి నిదర్శనం ఈ ఘటన. మనిషి. మనీ షీగా మారిపోయిన ఉదంతం ఇది. చనిపోయిన వ్యక్తి నుంచి ఆస్తి కాజేసే ఉద్దేశంతో బంధువులు.. ఆ శవం చేత కాలి వీలునామా కాగితాలపై వేలిముద్ర వేయించారు. ఈ దుర్మార్గానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ కాగా.. పోలీసులు ఆ వీడియోపై స్పష్టత ఇచ్చారు.
వయసు పైబడి ఓ మహిళ కన్నుమూసింది. ఆమె భర్త అంతకు ముందు కొన్నేళ్ల కిందటే చనిపోగా.. వాళ్లకు సంతానం లేదని తెలుస్తోంది. పిల్లలు లేకపోవడంతో బంధువుల పిల్లలను ఆ దంపతులు ఆప్యాయంగా చూసుకునేవాళ్లు. ఈ క్రమంలో.. వాళ్ల ఆస్తి మీద ఆ బంధువులకు దుర్బుద్ధి పుట్టినట్లుంది. ఆమె బావ కొడుకులు ఆమె మృతదేహన్ని శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. కాస్త దూరం వెళ్లాక.. ఆమె మృతదేహాన్ని కారు నుంచి బయటకు లాగి, ఓ లాయర్ సమక్షంలో వీలునామా కాగితాల మీద ఆమె వేలిముద్రలు తీసుకున్నారు.
ఆమె పేరిట ఉన్న ఓ పెద్ద దుకాణం, ఇంటిని తమ పేరిట మార్చేసేందుకు అలా డాక్యుమెంటరీని ఫోర్జరీ చేసే యత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆమె దూరపు బంధువైన ఓ వ్యక్తికి, ఆ వేలిముద్ర పై అనుమానం కలిగింది. ఎందుకంటే ఆమె చదువుకుంది, సంతకం చేయగలదు కాబట్టి. అయితే ఆధారాలు లేకపోవడంతో.. నిర్ధారించుకోలేకపోయాడు.
కానీ, ఆయన అనుమానం నిజమేనే విషయం ఇప్పుడు బయటపడింది. ఆస్తుల పంపకాల్లో తేడాలు రావడంతో.. వాళ్లలో ఒకరు ఆ వీడియో బయటపెట్టాడు. ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. 2021, మే 8వ తేదీన కమలా దేవి అనే మహిళ మరణించగా.. ఆమె బంధువులు చేసిన పని తాజాగా ఓ వీడియో ద్వారా నెట్‌లో వైరల్ అవుతోంది. దీంతో ఆ బంధువు శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు వీడియోపై దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో పాకిస్తాన్‌లోది అంటూ ప్రచారం జరిగినా.. చివరకు మన దేశంలోనిదేనని ఆగ్రా పోలీసులు ధృవీకరించారు.
Video of man taking thumb impression of deceased woman lying in car goes viral.
— Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) April 10, 2023
pic.twitter.com/mZjaz2BvFE
Disclaimer: ఈ వీడియో కేవలం విషయం తెలియజేయడానికే.. ఎవరినీ ఇబ్బందిపెట్టడానికి కాదు
Comments
Please login to add a commentAdd a comment