will
-
కన్నీటి వీలునామా
సెప్టెంబర్ 30న గాజాలో ఒక ఇంటి మీద ఇజ్రాయిల్ బాంబు వేసింది. ఆ ఇంటిలోని 10 ఏళ్ల పాప, ఆమె 11 ఏళ్ల సోదరుడు మరణించారు. తల్లిదండ్రులు వారిని అంతిమంగా సాగనంపి పాప నోట్‌బుక్ తెరిస్తే ఈ మరణాన్ని, ఇలాంటి మరణాన్ని ఊహించి, గాజాలో కొంతకాలంగా మరణించిన16,700 మంది పిల్లలతో పాటు తానూ చేరక తప్పదని తెలిసి ఆ పాప నోట్‌బుక్‌లో వీలునామా రాసి వెళ్లింది. ఆ వీలునామాలో తొలి వాక్యం ‘నేను చనిపోతే ఏడ్వొద్దు’ అని.గాజా పసిపిల్లలు జీవించి ఉన్నారంటే వారు చిరంజీవులయ్యారని కాదు. వారి ఊపిరి కాలం పొడిగింప బడిందనే అర్థం. ఇక్కడ చూడండి... జూన్ 10న గాజాలోని ఒక ఇంటి మీద బాంబు జారవిడిచింది ఇజ్రాయిల్. ఆ ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ఇరుగూ పొరుగూ కలిసి లోపల ఉన్న భార్యాభర్తల్ని వారి కుమారుడు 11 ఏళ్ల అహ్మద్‌ని కూతురు 10 ఏళ్ల రాషాను బయటకు తీసుకొచ్చారు. వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ఇజ్రాయిల్ ఆ ఇంటి మీద బాంబు ఎందుకు వేసింది? కారణం ఏమీ లేదు. మొన్నటి సెప్టెంబర్ 30 వరకూ కూడా ఆ కుటుంబం ఆకలిదప్పులతో వేదనలతో బతికింది. అయితే ఇజ్రాయిల్ తిరిగి సెప్టెంబర్ 30న మరో బాంబు అదే ఇంటి మీద వేసింది. కారణం ఏమిటి? ఏమీ లేదు. కాని దురదృష్టం.. ఈసారి రాషా, ఆమె సోదరుడు అహ్మద్ మృతి చెందారు. (ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు)తల్లిదండ్రులు ఎంతో దుఃఖంతో వారిని సాగనంపి తిరిగి వచ్చాక రాషా నోట్ పుస్తకంలో రాసిన తన వీలునామా కనిపించింది. అప్పటి వరకూ వారికి ఆ చిన్నారి అలాంటి వీలునామా రాసి ఉంటుందని తెలియదు. ఆ పాప అప్పటికే ఎందరో చిన్నపిల్లల మరణాలని చూసింది గాజాలో. మాట్లాడుకుంటుంటే వినింది. కనుక తాను కూడా చనిపోతానని భావించిందో ఏమో నోట్‌బుక్‌లో వీలునామా ఇలా రాసింది.రాషా రాసిన ఈ వీలునామాను ఆమె మేనమామ అసిమ్ అలనబి లోకానికి చూపించాడు. రాషా ఎందుకనో తాను మరణించి తన సోదరుడు బతుకుతాడని ఆశించింది. ఆమె సోదరుడు అహ్మద్ గడుగ్గాయి. అల్లరి చేసినా అందరూ వాణ్ణి ప్రేమించేవారట. గదమాయిస్తూనే దగ్గరికి తీసుకునేవారట. కాని ఆమెతో పాటు ఆ ముద్దుల సోదరుడు కూడా మరణించాడు. గాజాలో రోజూ వందలాది మంది పిల్లలు చనిపోతున్నారు. గాజాలో పిల్లల గుండెల్లో ఎన్ని మూగబాధలు చెలరేగుతున్నాయో దూరంగా నిశ్చింతగా ఉంటూ తమ పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తున్న తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు.ఏ యుద్ధమైనా, ఎటువంటి ద్వేషమైనా, ఏ విషబీజాలైనా, ఎటువంటి వివక్ష అయినా అంతిమంగా ముందు పిల్లల్ని బాధిస్తుంది. పిల్లల్లో ఉండే కరుణను పెద్దలు ఎప్పటికైనా అందుకోగలరా?‘నేను చనిపోతే నా కోసం ఎవరూ ఏడ్వద్దు. ఎందుకంటే మీ కన్నీళ్లు నాకు నొప్పి కలిగిస్తాయి. నా దుస్తులు అవసరమైనవారికి ఇస్తారని భావిస్తాను. నా అలంకార వస్తువులు రాహా, సరా, జూడీ, బతుల్, లానాల మధ్య సమానంగా పంచాలి. నా పూసల పెట్టె ఇకపై పూర్తిగా అహ్మద్, రాహల సొంతం. నాకు నెలవారీ అలవెన్సుగా వచ్చే 50 షెకెల్స్ (ఒక షెకెల్ 22 రూపాయలకు సమానం) సగం రాహాకు, సగం అహ్మద్‌కు ఇవ్వండి. నా కథలు, నోట్ పుస్తకాలు రాహావి. నా బొమ్మలు బతూల్వి. మరోటి, మా అన్న అహ్మద్‌ను గదమాయించొద్దు. ఈ కోరికలు నెరవేర్చండి’... -
Ratan Tata: పెంపుడు కుక్క టిటో, పనిమనిషికి కూడా..
ముంబై: పారిశ్రామికవేత్త రతన్ టాటా తన దాతృత్వాన్ని చనిపోయాక కూడా చాటుకున్నారు. తన రూ.10 వేల కోట్ల ఆస్తుల్లో తోబుట్టువులకే కాదు, పెంపుడు శునకం టిటో, పనిమనిషి సుబ్బయ్య, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు కూడా వాటాలు పంచుతూ వీలునామా రాశారు. టాటా గ్రూప్ చైర్మన్ మాతృసంస్థ టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఈ నెల 9వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. తనకెంతో ప్రీతిపాత్రమైన జర్మన్ షెపర్డ్ శునకం టిటో సంరక్షణ బాధ్యతలను జీవితకాలం పాటు వంట మనిషి రజన్ షా చూసుకోవాలని కోరారు. ఆస్తుల్లో సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరీమణులు షిరీన్, డియానా జీజాభాయ్లకు కొంత కేటాయించారు. టాటా సన్స్‌లో వాటాను రతన్ టాటా ధార్మిక ఫౌండేషన్‌కు బదిలీ చేయాలని కోరారు. విల్లుపై బాంబే హైకోర్టు విచారణ జరపనుందని అధికారులు తెలిపారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు చెందిన గుడ్‌ఫెలోస్‌లో పెట్టిన పెట్టుబడిని వదిలేయాలని, విదేశాల్లో చదువుకునేందుకు నాయుడుకిచ్చిన రుణం మాఫీ చేయాలని వీలునామాలో తెలిపారు. -
రతన్ టాటా వీలునామా.. పెంపుడు శునకం ‘టిటో’కు వాటా!
రతన్ టాటా మూగజీవాలపై ఎంత ప్రేమ చూపించేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన చివరి శ్వాస వరకూ తన పెంపుడు జంతువుల సంరక్షణకు శ్రద్ధ చూపిన రతన్ టాటా తన మరణం తర్వాత కూడా వాటి సంరక్షణకు లోటు రాకుండా ఏర్పాట్లు చేశారు.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. రతన్ టాటా రాసిన రూ.10,000 కోట్ల వీలునామాలో తన పెంపుడు జర్మన్ షెపర్డ్ శునకం ‘టిటో’ను చేర్చారు. ఈ శునకానికి "అపరిమిత" సంరక్షణ కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించినట్లు సమాచారం. ఐదారేళ్ల క్రితం ఇదే పేరుతో ఇంతకు ముందున్న శునకం చనిపోయిన తర్వాత ఇప్పుడున్న ‘టిటో’ను ఆయన తెచ్చుకుని సంరక్షణ బాధ్యతలు చూసేవారు.రతన్ టాటా దగ్గర చాలా ఏళ్లుగా వంటమనిషిగా పని చేస్తున్న రాజన్ షా ఇకపై ‘టిటో’ సంరక్షణ బాధ్యతలు చూసుకుంటారు. నివేదిక ప్రకారం.. టాటాతో మూడు దశాబ్ధాలుగా ఉంటున్న పనిమనిషి సుబ్బయ్యకు సంబంధించిన నిబంధనలను కూడా వీలునామాలో చేర్చారు.రూ. 10,000 కోట్లకు పైగా ఉన్న రతన్ టాటా ఆస్తులలో అలీబాగ్‌లోని 2,000 చదరపు అడుగుల బీచ్ బంగ్లా, ముంబైలోని జుహు తారా రోడ్‌లోని 2-అంతస్తుల ఇల్లు, రూ. 350 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు, టాటా సన్స్‌లో 0.83% వాటా ఉన్నాయి. దీన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ (RTEF)కి బదిలీ చేయనున్నారు. -
వీలునామాను మార్చవచ్చా? ఎన్నిసార్లు మార్చవచ్చు!
నేను ఇదివరకే వీలునామా రాసి ఉంచాను. అలా వీలునామా రాసిన విషయం నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకి చెప్పి ఉంచాను. ఇప్పుడు ఆ వీలునామాను మార్చాలను కుంటున్నాను. వీలవుతుందా? – పి. కోటేశ్వరరావు, విజయవాడమీరు సంపాదించిన ఆస్తులపై, మీకు సంక్రమించిన ఆస్తులపై వీలునామా రాయడం అనేది మీ హక్కు. మీ జీవిత కాలంలో మీ వీలునామాని మీరు కావాలి అంటే మార్చుకోవచ్చు. అయితే అలా మార్చుకోవాలి అనుకున్నప్పుడు గతంలోనే మీరు వీలునామా రాసిన విషయాన్ని, అందులోని అంశాలను, వివరాలను ప్రస్తావిస్తూ, పాత వీలునామా ఇక చెల్లదు అని మీరు రాయబోయే వీలునామాలో పేర్కొనాల్సి ఉంటుంది. మీ వీలునామాలో మీరు కావాలి అంటే ‘మరలా ఒకసారి కూడా వీలునామా మార్చవచ్చును’ అని, అలా మార్చక΄ోతే ఇదే ఆఖరి వీలునామా అవుతుంది అని కూడా రాయించవచ్చు.మీరు వీలునామా రాసిన విషయాన్ని ఇప్పటికే మీ బంధుమిత్రులకు, స్నేహితులకు చెప్పాను అని అన్నారు. అలాంటి వీలునామాలు చట్టరీత్యా చెల్లినప్పటికీ మీ తదనంతరం మీ ఆస్తిలో భాగం కోరుకునే వారు ఎవరైనా ఆ వీలునామా సరైనది కాదు అని లేదా మరొక కారణం చూపి లేని΄ోని కేసులు వేయవచ్చు. సొంతంగా రాసుకున్న వీలునామాలలో కచ్చితంగా ΄÷ందుపరచవలసిన కొన్ని అంశాలను విస్మరించడం తరచుగా చూస్తుంటాం. అలాంటి వీలునామాలు కోర్టు కేసులలో బలమైన అంశాలుగా పరిగణించబడవు. వీలునామాలో మీరు పేర్కొనే వారసులు ఒకవేళ మైనర్ అయితే, వారికి గార్డియన్‌ను నియమించటం, శానిటీ ఓత్ (చిత్తశుద్ధి ప్రమాణం/ధ్రువీకరణ) చేయటం, అచ్చుతప్పులు లేకుండా రాయటం, ఆస్తి వివరాలను క్షుణ్ణంగా వివరించటం వంటి అంశాలు వీలునామా చెల్లుబాటునకు అవసరం. అలా లీగల్ గా చెల్లుబడి అయేలా మెరుగైన వీలునామాను మీ దగ్గరలోని లాయర్‌తో రాయించుకుని, వీలునామాలో మీరు పొందుపరచాలి అనుకున్న నిబంధనలు ఏవైనా ఉంటే అవి చట్టరీత్యా చెల్లుతాయా లేదా అనే అంశాలను కూడా అడిగి తెలుసుకోవడం మంచిది. మరో ముఖ్య విషయం ఏమిటంటే, మీరు రాసిన వీలునామాను రిజిస్టర్ చేయించుకోవడం ఉత్తమం. అలా రిజిస్ట్రేషన్ చేయించిన వీలునామా అయితే మీ తదనంతరం కూడా అందరికీ అన్ని విధాలా మేలు చేస్తుంది. మీరు అనుకున్న విధంగా మీ వీలునామా అమలుకు నోచుకుంటుంది.– శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshi.family3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
మహాత్మా గాంధీ వీలునామా ఏ భాషలో రాశారు? ఎంతకు విక్రయమయ్యింది?
దేశవ్యాప్తంగా నేడు (అక్టోబర్ 2) గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. పలు పాఠశాలల్లో గాంధీజీని గుర్తుచేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం గాంధీజీ వినియోగించిన వస్తువులకు సంబంధించిన వేలం వివరాలను తెలుసుకుందాం. నాటి రోజుల్లో గాంధీ వినియోగించిన పలు వస్తువులు అత్యధిక ధరలకు వేలంలో అమ్ముడయ్యాయి. గతంలో నిర్వహించిన ఈ వేలంలో గాంధీజీ రాసిన వీలునామా అత్యధిక ధరకు అమ్ముడయ్యింది. ఈ వేలంలో గాంధీజీ వినియోగించిన బ్రౌన్ స్లిప్పర్, లెదర్ బ్యాగ్ కూడా అమ్ముడయ్యాయి. ఈ రెండింటికీ కొనుగోలుదారులు అధిక ధరలను చెల్లించారు. మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో రాసిన రెండు పేజీల వీలునామా పత్రం అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఈ వీలునామా పత్రం వేలంలో 55 వేల పౌండ్లకు విక్రయమయ్యింది. ఇది ఇప్పటి మన కరెన్సీలో రూ. 55 లక్షల కంటే అధికం. దీని వేలం కోసం ప్రారంభమైన బిడ్డింగ్ 30 నుండి 40 వేల పౌండ్లతో ప్రారంభం కావడం విశేషం. అయితే ఈ వీలునామాను ఎవరు కొనుగోలు చేశారనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అదే వేలంలో గాంధీజీ వినియోగించిన బ్రౌన్ లెదర్ స్లిప్పర్ కూడా అమ్ముడుపోయింది. దీని కోసం కొనుగోలుదారులు 19000 పౌండ్లు చెల్లించారు. దీన్ని భారత రూపాయిల్లోకి మార్చినట్లయితే దాదాపు రూ.19 లక్షలు అవుతుంది. బీబీసీలో ప్రచురితమైన నివేదిక ప్రకారం గాంధీ ముంబైలోని జుహు బీచ్ సమీపంలోని ఒక ఇంట్లో 1917 నుండి 1934 వరకు నివసించారు. అక్కడే గాంధీ వినియోగించిన చెప్పులు లభ్యమయ్యాయి. ఇది కూడా చదవండి: స్వాతంత్ర్యం వచ్చాక మహాత్మాగాంధీ ఏం చేశారు? -
విల్లు.. వివాదాలకు చెల్లు
రఘు వయసు 51. అప్పటివరకూ కష్టపడి కూడబెట్టింది ఫిక్స్డ్ డిపాజిట్‌గా దాచుకున్నాడు. నామినీగా భార్య పేరు రాశాడు. కొన్నాళ్లకు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. మరి.. రఘు డిపాజిట్లు మొత్తం నామినీగా ఉన్న భార్యకే దక్కాయా? అంటే లేదనే చెప్పాలి. సరస్వతి భర్త చిన్న వయసులోనే కాలం చేశాడు. వారికి పిల్లలు కూడా లేరు. ఉన్నదల్లా తల్లి, తండ్రి, అత్త మాత్రమే. ఈ పరిస్థితుల్లో సరస్వతి కూడా మరణిస్తే ఆమె సంపాదించినది ఎవరికి దక్కుతుంది? ముగ్గురికీ అనుకుంటున్నారా? కానీ చట్టప్రకారం ఒక్క అత్తకు మాత్రమే దక్కింది. సాక్షి, హైదరాబాద్: ఇలాంటి ఘటనలు ఏ ఒకరిద్దరికో పరిమితం కాదు.. ఇటీవలి కాలంలో చాలా మంది ఇళ్లలో ఎదురవుతున్నవే. మరి ఒక వ్యక్తి తన ఆస్తులను ఇష్టం వచ్చిన వారికి ఇవ్వాలనుకుంటే ఎలా? నామినీకి, వీలునామాకు తేడా ఏమిటి? దాన్ని ఎప్పుడు రాయాలి.. ఎలా రాయాలి లాంటి వివరాలతో కథనం. వీలునామా అంటే... : ఒక వ్యక్తి మరణం తరువాత తన స్థిర, చరాస్తులు ఎవరికి చెందాలో, ఎలా పంపకాలు జరగాలో తెలియజెప్పే చట్టబద్ధమైన డాక్యుమెంటే వీలునామా. మరణ వాంగ్మూలానికి ఎంత చట్టబద్ధత ఉందో అలాంటి చట్టబద్ధతే ఈ వీలునామాకు ఉంది. మనిషి బతికున్నంత వరకు వీలునామా ఎన్ని సార్లయినా మార్చుకోవచ్చు. కానీ చివరిసారిగా రాసిన వీలునామానే చట్టప్రకారం చెల్లుబాటు అవుతుంది. వీలునామాపై ఇద్దరు సాక్షుల సంతకం తప్పనిసరి. ఆర్యోగంగా, మానసికంగా సరిగ్గా ఉన్న మేజర్లు రాసిన విల్లు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. భారతీయ వారసత్వ చట్టం సెక్షన్ 59 ప్రకారం విల్లు రాయాలి. నామినీ వేరు.. వారసులు వేరు..: చాలా మంది జీవిత బీమాకో.. బ్యాంకు ఖాతాకో.. ఇతర ఆర్థిక లావాదేవీలకో.. నామినీగా ఎవరినో ఒకరిని పెడతారు. తమకేమన్నా అయితే నామినీకి ఆ మొత్తం వెళుతుందనుకుంటారు. అయితే చట్టప్రకారం నామినీ అనేది వారసుల కిందకు రాదు. వ్యక్తి మరణించిన తర్వాత ఆ నగదు నామినీకి చెందదు. వారసుల్లో నామినీ ఉంటే వారికి చట్టప్రకారం వాటా మాత్రమే వస్తుంది. నామినీగా ఒక వారసుడి పేరో లేదా వారసురాలి పేరో పెట్టినంత మాత్రాన ఆ నగదు మొత్తం వారికే చెందదు. ఇది తెలియని చాలా మంది నామినీగా ఫలానా వారి పేరు పెట్టారని వారికి రావాల్సిన వాటాను కోల్పోతుంటారు. వీలునామా రిజిస్ట్రేషన్అవసరమా?..: వీలునామాను రిజిస్ట్రేషన్ చేయిస్తే.. దాంతో లబ్దిదారులు బ్యాంకు రుణాలు, ఇతర అవసరాలకు వాడుకొనే వీలు ఉంటుంది. రిజిస్టర్ అయిన వీలునామాకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నామమాత్రపు చార్జీతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. తెల్ల కాగితంపై రాసినా చట్టబద్ధమే. కుటుంబంలో కనీసం ఒక్క వ్యక్తికయినా వీలునామాను ఎక్కడ భద్రపరిచిందీ తెలియజేయాలి. ఆన్లైన్లో వీలునామా సేవల కోసం ఓ సంస్థ..: అత్యంత స్వల్ప రుసుముతో ఆన్లైన్ ద్వారా చట్ట ప్రకారం విల్లు సిద్ధం చేసే లక్ష్యంతో ఆసాన్విల్ అనే సంస్థ ఏడాది క్రితం ప్రారంభమైంది. ఈ సంస్థ రూపకర్త తెలంగాణ వ్యక్తి విష్ణు చుండి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ ఉన్నట్లు.. వీలునామా కూడా ఉండాలన్నదే ఆ సంస్థ లక్ష్యం. అంతేకాదు.. తమ వద్దకు వచ్చే వారిని సేవా కార్యక్రమాలు, అవయవదానం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు దాదాపు రూ. 100 కోట్లను వివిధ చారిటీలకు అందించారు. దీనికిగాను 2018లో ది సొసైటీ ఆఫ్ విల్ రైటర్స్ నుంచి గుర్తింపు పత్రం అందుకున్నారు. రూ. 1,50,000 కోట్లు.. ఎవరికీ చెందకుండా దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాల్లో, బీమా పాలసీ కంపెనీల్లో పేరుకుపోయిన నగదు లెక్క ఇది. (లెక్కల్లోకి రానిది ఈ మొత్తంకన్నా ఇంకా ఎక్కువ ఉండొచ్చు.) స్పృహలో లేనప్పుడు రాస్తే చెల్లదు... సొంతంగా సంపాదించిన ఆస్తులకు, ఆదాయానికి సంబంధించి మాత్రమే వీలునామా రాయొచ్చు. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు చట్టప్రకారం వారసులకే ఆ ఆస్తులు దక్కుతాయి. ఆ వ్యక్తి మరణానంతరమే వీలునామా అమల్లోకి వస్తుంది. మత్తులో ఉన్న సమయంలోనూ, తీవ్ర అనారోగ్యంగా ఉన్నప్పుడు, తాను ఏం చేస్తున్నానన్న దానిపై స్పృహ లేని వ్యక్తులు వీలునామా రాయడానికి అవకాశం లేదు. – సామల రవీందర్, ప్రభుత్వ న్యాయవాది, హైకోర్టు -
మూడేళ్ల పరిచయానికి రూ.900 కోట్లు ఇచ్చేశాడు..!
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీ గత నెలలో మరణించిన సంగతి తెలిసిందే. చనిపోయే ముందు ఆయన తన గార్ల్‌ఫ్రెండ్ మార్టా ఫాసినా(33)కి రూ.900 కోట్ల రూపాయలను ఇచ్చారు. ఈ మేరకు ఆస్పత్రి బెడ్‌పైనే వీలునామా రాసి సంతకం చేశారు. బ్రిటన్‌కు మూడు సార్లు ప్రధానిగా ఉన్న ఆయన ఆస్తి మొత్తం ఆరు బిలియన్లకు పైనే ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది. మార్టా ఫాసినాతో బెర్లుస్కోనికి 2020 నుంచి గత మూడేళ్లుగా పరిచయం ఏర్పడింది. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఫాసినా ఇటలీ పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు. బెర్లుస్కోనీ స్థాపించిన ఫోర్జా ఇటాలియా పార్టీలో సభ్యురాలుగా కూడా ఉన్నారు. ఇరువురి మధ్య స్నేహం తర్వాత మరింత దగ్గరయ్యారు. అయితే.. బెర్లుస్కోనీ వ్యాపారాన్ని ఆయన ఇద్దరు పిల్లలు మెరీనా, పీర్ సిల్వియోలు చూసుకుంటున్నారు. వ్యాపార వాటాలో 53 శాతం కుటుంబంపై ఉంది. వీలునామాలో తన సోదరుడు పాలోకు 100 మీలియన్ల యూరోలను కేటాయించారు బెర్లుస్కోనీ. మాఫియాతో సహవాసం చేసి, జైలు శిక్ష అనుభవించిన తన పార్టీ మాజీ సెనేటర్ మార్సెల్లో డెల్ ఉట్రీకి 30 మీలియన్ల యూరోలను ఇచ్చారు. ఉన్న ఆస్తిలో పిల్లలు మెరీనా, పియర్ సిల్వియోలకు సమాన భాగాలుగా పంచి ఇస్తున్నట్లు వీలునామా రాసిన బెర్లుస్కోనీ.. మిగిలిన ఆస్థిని ఐదుగురు పిల్లలు మెరీనా, పీర్ సిల్వియో, బార్బరా, ఎలియోనోరా, లుయిగికి సమాన భాగాలుగా ఇస్తున్నట్లు రాశారు. మార్టా ఫాసినాను అధికారికంగా పెళ్లి చేసుకోకున్నప్పటికీ వీలునామాలో మాత్రం భార్యగా పేర్కొని ఆస్తిని కేటాయించారు. ల్యుకేమియాతో బాధపడుతున్న బెర్లుస్కోనీ 86 ఏళ్ల వయసులో జూన్ 12న మరణించారు. వ్యాపార వేత్తగా, ప్రధానిగా రాణించిన ఆయనపై పలు కేసులు కూడా ఉన్నాయి. పన్నుల ఎగవేతకు సంబంధించిన కేసులో ఆరేళ్ల పాటు రాజకీయం నుంచి నిషేధానికి కూడా గురయ్యారు. ఇదీ చదవండి: దయా హృదయం-మహా ఖరీదు.. అస్థికలు భద్రపరిచేందుకు అద్దె రూ.63 లక్షలు, ఫ్యామిలీ ప్యాక్ కూడా! -
ఫైనల్ బెర్త్ ఎవరిది..
-
ఫైనల్ కి వెళ్ళేది ఏవరు.. ప్రెజర్ లో GT జోష్ లో MI
-
పిల్లలు లేరు కదా అనుకుంటే.. బంధువులే రాబంధువులై..
Viral Video: మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోయాన్నదానికి నిదర్శనం ఈ ఘటన. మనిషి. మనీ షీగా మారిపోయిన ఉదంతం ఇది. చనిపోయిన వ్యక్తి నుంచి ఆస్తి కాజేసే ఉద్దేశంతో బంధువులు.. ఆ శవం చేత కాలి వీలునామా కాగితాలపై వేలిముద్ర వేయించారు. ఈ దుర్మార్గానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ కాగా.. పోలీసులు ఆ వీడియోపై స్పష్టత ఇచ్చారు. వయసు పైబడి ఓ మహిళ కన్నుమూసింది. ఆమె భర్త అంతకు ముందు కొన్నేళ్ల కిందటే చనిపోగా.. వాళ్లకు సంతానం లేదని తెలుస్తోంది. పిల్లలు లేకపోవడంతో బంధువుల పిల్లలను ఆ దంపతులు ఆప్యాయంగా చూసుకునేవాళ్లు. ఈ క్రమంలో.. వాళ్ల ఆస్తి మీద ఆ బంధువులకు దుర్బుద్ధి పుట్టినట్లుంది. ఆమె బావ కొడుకులు ఆమె మృతదేహన్ని శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. కాస్త దూరం వెళ్లాక.. ఆమె మృతదేహాన్ని కారు నుంచి బయటకు లాగి, ఓ లాయర్ సమక్షంలో వీలునామా కాగితాల మీద ఆమె వేలిముద్రలు తీసుకున్నారు. ఆమె పేరిట ఉన్న ఓ పెద్ద దుకాణం, ఇంటిని తమ పేరిట మార్చేసేందుకు అలా డాక్యుమెంటరీని ఫోర్జరీ చేసే యత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆమె దూరపు బంధువైన ఓ వ్యక్తికి, ఆ వేలిముద్ర పై అనుమానం కలిగింది. ఎందుకంటే ఆమె చదువుకుంది, సంతకం చేయగలదు కాబట్టి. అయితే ఆధారాలు లేకపోవడంతో.. నిర్ధారించుకోలేకపోయాడు. కానీ, ఆయన అనుమానం నిజమేనే విషయం ఇప్పుడు బయటపడింది. ఆస్తుల పంపకాల్లో తేడాలు రావడంతో.. వాళ్లలో ఒకరు ఆ వీడియో బయటపెట్టాడు. ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. 2021, మే 8వ తేదీన కమలా దేవి అనే మహిళ మరణించగా.. ఆమె బంధువులు చేసిన పని తాజాగా ఓ వీడియో ద్వారా నెట్లో వైరల్ అవుతోంది. దీంతో ఆ బంధువు శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు వీడియోపై దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో పాకిస్తాన్లోది అంటూ ప్రచారం జరిగినా.. చివరకు మన దేశంలోనిదేనని ఆగ్రా పోలీసులు ధృవీకరించారు. Video of man taking thumb impression of deceased woman lying in car goes viral. pic.twitter.com/mZjaz2BvFE — Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) April 10, 2023 Disclaimer: ఈ వీడియో కేవలం విషయం తెలియజేయడానికే.. ఎవరినీ ఇబ్బందిపెట్టడానికి కాదు -
ఈనెల 18న అమిత్ షాతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ
-
కాసేపట్లో నరసాపురం చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్
-
ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం జగన్
-
ఏపీ మంత్రి అంబటి రాంబాబు పోలవరం పర్యటన
-
మంచి మాట: మన ఆలోచనలే మనం
మనిషిని మనిషిగా నిలబెట్టగల్గినవి ఆలోచనలే. మన సంకల్ప వికల్పాలకు మన మనస్సే ఆధారం. అది సాత్వికమైతే మన ఆలోచన ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. రాజసమైతే తమకనుకూలంగా ఉంటుంది. తామసికమైతే ఇతరుల విషయంలో ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే మనస్సు మీద అదుపు ఉండాలని చెప్తారు. మనస్సు వశంలో ఉన్నప్పుడే, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు అదుపులో ఉంటాయి. ఎప్పుడైతే మనస్సుతో పాటు ఇతర ఇంద్రియాల మీద పట్టు సాధించగల్గుతాడో, అప్పుడే మనిషి ఒక చక్కని ఆలోచనాపరుడిగా నిలబడగల్గుతాడు. ఆలోచించే దానికంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఒక్కోసారి మనం మన స్థాయి కంటే మించిపోతామో ఏమో అనిపిస్తుంది. జీవితం ఒక పద్ధతిలో సాగాలంటే అందుకు మన ఆలోచనా సరళి దోహదకారి అవుతుంది. అసలు ఆలోచించడ మెందుకనే వారు కూడా ఉండవచ్చు. కానీ ఆలోచించకుండా ఏ మనిషీ ఉండజాలడు. మన సంకల్పం సక్రమ స్థితిలో ఆవిర్భవించినప్పుడు, మన ఆలోచన చక్కగా కొనసాగుతుంది. ఎప్పుడైతే మన ఆలోచన సరిగా సాగుతుందో అప్పుడు ఏ విషయంలోనైనా ఒక నిర్ణయానికి రాగలుగుతాం. సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు ఒకచోట చెప్పిన మాట ఆలోచనాత్మకమైంది. ‘‘ఎదుటి వారిని విమర్శించే ముందు మనం వారి స్థానంలో ఉండి ఆలోచించాలి’’ అనడంలో మనల్ని మనం చక్కదిద్దుకునే ఏర్పాటు మాత్రమే కాదు, ఎదుటి వారి దృష్టిలో పలుచన కాని వారమై కూడా ఉండాలన్న ఉపదేశం తేటతెల్లమవుతుంది. సంకల్పించడం, ఆలోచించడం అనేవి మనిషికి గొప్ప వరాలు. వాటిని సాధించాలంటే జీవితాన్ని క్రమశిక్షణ మార్గంలో నడిపించాలి. ఈ క్రమశిక్షణ పుట్టుకతోనే రావాలని అనుకుంటారు కాని అది ఒకరిని ఆదర్శంగా తీసుకున్నపుడే సాధ్యమవుతుంది. ఆ ఒక్కరు తల్లిదండ్రులలో ఒకరు కావచ్చు, గురువు కావచ్చు, స్నేహితుడు కూడా కావచ్చు. క్రమశిక్షణతో కూడిన ఆలోచన మనిషిని మహోన్నత శిఖరాలకు అధిరోహింపజేస్తుంది. ఒక సదాలోచన బుద్ధున్ని సత్యాన్వేషకున్ని చేసింది. ఒక సదాలోచన అంబేద్కరును రాజ్యాంగ నిర్మాతను చేసింది. ఒక సదాలోచన వివేకానందుని సన్యాసిని చేసింది. ఒక సదాలోచన దయానందుణ్ణి మనిషిని చేసింది. ఆలోచనకు ప్రతిరూపంగానే మనిషి భాసిస్తాడు. కనుకనే మనిషిని మేధావి అని పిలుస్తాం. ‘హెయిన్’ అనే పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రవేత్త ‘‘మంచి ఆలోచనలు చేసేవారే మంచి పనులు చేస్తుంటారు’’ అని సెలవిచ్చాడు. ఇది ముమ్మాటికీ నిజం. మంచి ఆలోచన మంచి పనికి దారి తీస్తుంది. మంచిపని మంచి ఫలితాన్ని ఇస్తుంది. ‘‘జీవితంలో గొప్పగా ఎదగాలంటే సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోవా’’ లన్న బెన్నిసన్ మాటలు గమనింపదగ్గవి. ఉన్నతమైన ఆలోచనలే ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయి. గొప్ప పనులు చేయాలంటే మొదట గొప్పగా ఆలోచించక తప్పదు. చరిత్రలో నిలబడ్డ మహా పురుషులందరూ గొప్పగా ఆలోచించినవారే. మంచి స్వభావం మనిషికి అలంకారమైనప్పుడు మంచి ఆలోచన అతనికి కిరీటంగా భాసిస్తుంది. ‘యద్భావం తద్భవతి’ అనే మాట ఒకటుంది. ఏది అనుకుంటే అది అవుతుందని దాని అర్థం. నిజానికి అందరు అనుకున్నది అవుతుందా? ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో సంకల్పించి, కార్య రంగంలోకి దూకుతారో వారికే విజయం సంప్రాప్తమవుతుంది. కొందరు అదేపనిగా ఆలోచిస్తుంటారు. ప్రతి దానికి ఆందోళన చెందుతుంటారు. మనస్సు కకావికలం కాగా, విచారానికి లోనవుతారు. కాని జరిగిన వాటిని గూర్చి, జరగబోయే వాటిని గూర్చి పండితులు ఆలోచించరు. లోకంలో జరిగినవి, జరగబోయేవి మనల్ని ప్రభావితుల్ని చేస్తాయి. కాని బుద్ధిశాలురు జరుగుతున్న విషయాలను మాత్రమే పట్టించుకుంటారు. వారు వర్తమానంలో జీవిస్తారు. వాస్ తవికతను ఆవిష్కరిస్తారు. పరిస్థితులను బట్టి వ్యవహరిస్తారు. కాని సామాన్యులు తద్భిన్నంగా ఆలోచిస్తూ జీవితాలను దుఃఖమయం చేసుకుంటారు. మనస్సును నిగ్రహించుకున్నప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి. అందుకే మన పెద్దలు ఆలోచనల్ని గుర్రాలతోను, మనస్సును పగ్గాలతోను పోల్చి చెప్పారు. అప్పుడు శరీరం రథంగాను, బుద్ధి సారధి గాను మారిపోయి, మనిషి అనుకున్న గమ్యం చేరడానికి వీలు కలుగుతుంది. మనిషిని గమ్యం వైపు ప్రయాణింపజేసే ఆలోచనలే నిజమైన ఆలోచనలు. అందుకు మొదట మనిషి లక్ష్య శుద్ధి కల్గిన వాడు కావాలి. ఆ లక్ష్యాన్ని చేరడానికి జీవితంలో, అతనికి ఆలోచనల కంటే మించి సాయపడేవి మరేవీ ఉండవని గట్టిగా చెప్పవచ్చు. – ఆచార్య మసన చెన్నప్ప -
మంచి మాట: మీ చిత్తం ఎలాంటిది?
కొంతమంది ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది, కాని కొందరు ఏది అనుకొంటే అదే జరుగుతుంది. దీనికి మూలకారణం ఆలోచనలే. అవే సానుకూల ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు. ఈ రెండింటికి మూలం చిత్తం. జ్ఞానాన్ని భద్రపరిచే స్థానాన్నే చిత్తం అంటారు. చిత్తంలో ఉన్న చెడు ఆలోచనలు మంచి ఆలోచనలుగా మారాలి. అప్పుడే మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. కర్మ చే యించేది మనస్సు, మనస్సుని నియంత్రించేది బుద్ధి. అహంకారం అంటే ప్రకృతి సిద్ధమైన... తన చుట్టూ వున్న పరిస్థితులను తనకు అనుకూలంగా సృష్టించుకోవాలనుకోవటమే. దీనినే మన పెద్దలు ఏమైంది ఇతనికి నిన్నటివరకు బాగానే ఉన్నాడు కదా, ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారాడు అనీ లేదా ఇంతలోనే ఇతనిలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది అనే వారు. దీనికి కారణం చిత్తం నుండి కర్మ ఆ సమయానికి ఆలా పనిచేయడమే. జీవికి వచ్చిపోయే జబ్బులు కూడా కొన్ని చిత్తానికి సంబంధించినవే, మనసు అనియంత్రిత అవయవాలను నియంత్రిస్తుంది. ఇది కలుషితమైతే దీనికి సంబంధించిన గుండె, మూత్రపిండాలు, కాలేయం, పేగులు మొదలైన అవయవాల పై ప్రభావం ఉంటుంది. నియంత్రించే వ్యవస్థ మొత్తం మెదడులో ఉంటుంది. మెదడులో ఏ అవయవానికి సంబంధించిన వ్యవస్థ చెడితే ఆ అవయవం పనిచేయదు. మెదడులో వున్న ఈ వ్యవస్థ సరికావాలంటే మనస్సులో ప్రక్షాళన జరగాలి. అందుకే ఈ మధ్యన వైద్యులు ప్రతి జబ్బుకు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి లేదా ధ్యానం చెయ్యండి అని విరివిగా చెబుతున్నారు. మరి అవయవాలకు వచ్చే జబ్బుకు మనస్సుకు సంబంధించిన ధ్యానాలు ఎందుకు అంటే అన్నిటికి మూలం మనసే కనుక. మనసనేది ఆలోచనల ప్రవాహం. కోరికలు, వాంఛలూ ఆలోచనలతో సంక్రమించేవే. అంత వరకూ అనుభవంలోకి రాని దాన్ని అనుభవించాలనుకోవడం కోరిక. అదే అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనుకోవడం వాంఛ. మనసు అల్లకల్లోలమైనప్పుడు మనం ఊపిరి వేగంగా తీసుకుంటాం. శ్వాసప్రక్రియలోక్రమబద్ధత ఉండదు. మనసును శాంత పరచడానికి శ్వాసను క్రమబద్ధం చేయడం ఒక పద్ధతి. నిండుగా గాలిని పీల్చి వదలడాన్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే నిశ్చలమైన మానసిక స్థితిని పొందవచ్చు. ప్రాణశక్తి మీద పట్టు సాధించడం కోసం ఊపిరిని నియంత్రించడమే ప్రాణాయామం. కోరికలు, వాంఛల నుంచి మనసును అధిగమించి స్వతంత్రంగా, వ్యక్తిగా ఉండగలిగే వారే యోగి. మనసును అధిగమించడమంటే దాన్ని నొక్కిపెట్టి ఉంచడం, నియంత్రించడం కాదు. మన ప్రవర్తనలో మార్పు చేసుకోవాలి. ఎదుటి వారి విజయానికి అసూయ చెందకుండా, అపజయాన్ని హేళన చేయకుండా ఉండాలి. విజయం, అపజయం, ఒకటి ఒకరు పొందితే. ఇంకొకరు కోల్పోతున్నారు, ఇంకొకరు కోల్పోతే, అది ఇంకెవరికో దక్కుతుంది. సుఖం, దుఃఖం. డబ్బు, ఆస్తి, అంతస్తులు అన్నీ నేడు నాది నాది అనుకున్నవి నిన్న వేరొకరివి, రేపు ఇంకెవరివో. అంటే ఏది ఎవరికి శాశ్వతం కాదు. నాది, నాకు అనే సుడిగుండాలలో ఇరుక్కొని మనసు పాడుచేసుకోవడమే సకల జబ్బులకు మూలం. ఈ సూత్రం అర్థం చేసుకొంటేనే ప్రశాంతత. ఏ ఇద్దరి మనస్సు, జీవన విధానం ఒకలాగే ఉండదు. కాని అందుకు విరుద్ధంగా తనకు అనుకూలంగా ఉండాలనుకోవడమే అహంకారం. ఈ అహంకారాన్ని మార్చుకొంటే చిత్తంలో వున్న చెడు కర్మలు అన్నీ మంచి కర్మలుగా మారి మనిషి జీవన విధానం మొత్తం మారిపోతుంది. అందుకే వెయ్యిమందిని వెయ్యిసార్లు యుద్ధంలో ఓడించిన వాడికన్నా తన మనసును జయించిన వాడే పరాక్రమవంతుడు’ అంటాడు గౌతమ బుద్ధుడు. మనస్సు అంటే సంకల్ప, వికల్పాల కలయిక నీరు నిర్మలంగా ఉన్నప్పుడు అందులో మన ప్రతిబింబం కనిపిస్తుంది. అందులో వేరే ఏమి కలిపినా నీరు కలుషితం అవుతుంది. ప్రతిబింబం అగోచరమౌతుంది. అలానే మనస్సులో మొదట చెడు ఆలోచనలు తరిమేయడానికి మంచి ఆలోచనలు చేయాలి. క్రమంగా మంచి ఆలోచనలూ తగ్గించాలి. అలా తగ్గించగా మనసు నిర్మలం అవుతుంది. –భువనగిరి కిషన్ యోగి -
ఆస్తి హక్కు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: ఆస్తి హక్కుకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వీలునామా రాయకుండా ఒక వ్యక్తి మరణిస్తే.. అతని స్వార్జితం, వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్లో.. అతని కుమార్తెలకు వారసత్వ హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో మరణించిన వ్యక్తి సోదరుని పిల్లలకు కాకుండా సొంత కుమార్తెకే తొలి హక్కు ఉంటుందని కీలక తీర్పు ఇచ్చింది గురువారం. హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. హిందూ మహిళ, భర్త చనిపోయిన వాళ్ల ఆస్తి హక్కుకు సంబంధించి గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి వీలురాయకుండా చనిపోతే అతని ఆస్తిలో కూతుళ్లకు హక్కు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. ఒకవేళ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమెకు తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిపై.. తండ్రి వారసులు అందరికీ సమాన హక్కు ఉంటుంది. అదే మహిళకు భర్త, అత్త, మామల ద్వారా వచ్చిన ఆస్తులపై వీలునామా లేకపోతే.. భర్త వారసులకు హక్కులు లభిస్తాయి అని ధర్మాసనం పేర్కొంది. ప్రతీకాత్మక చిత్రం మద్రాసు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ఆ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే.. సొంత కుమార్తెకు ఆస్తులపై హక్కు ఉంటుందా? లేదంటే అతని సోదరుని పిల్లలకు హక్కు ఉంటుందా? అన్న సందిగ్ధాన్ని కోర్టు పరిష్కరిస్తూ పై తీర్పును వెలువరించింది. తమిళనాడుకు చెందిన ఈ కేసుకు సంబంధించి మార్చి 1, 1994లో ట్రయల్ కోర్టు తీర్పు ఇవ్వగా.. ఈ తీర్పును హైకోర్టు సైతం సమర్థించింది. ఇక ఆర్డర్ డేట్ 21, 2009న జారీ చేసింది హైకోర్టు. ఇప్పుడు ఆ తీర్పును పక్కనపెడుతూ సుప్రీంకోర్టు తీర్పు కీలక వెలువరించింది. జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కృష్ణ మురారి ఆధ్వర్యంలోని బెంచ్.. ఈ తీర్పు కోసం 51 పేజీల తీర్పు కాపీని సిద్ధం చేయడం విశేషం. చదవండి: ఎన్నికల్లో సమోసా-చాయ్ నుంచి బీఎండబ్ల్యూ వరకు.. -
‘ప్రిన్స్ ఫిలిప్ వీలునామాను మరో 90 ఏళ్లు తెరవకూడదు’
లండన్: బ్రిటీష్ రాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు చెందిన వీలునామాను మరో 90 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచాలంటూ గురువారం లండన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్వీన్ ఎలిజబెత్ హుందాతనానికి సూచకంగా ఆ వీలునామాను తెరవరాదు అని హైకోర్టు తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 99 ఏళ్ల వయసులో ప్రిన్స్ ఫిలిప్ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రాచరిక కుటుంబంలో ఎవరైనా సీనియర్ సభ్యులు మరణిస్తే, వారికి చెందిన వీలునామాపై హైకోర్టులో ఉన్న ఫ్యామిలీ డివిజన్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని శతాబ్ధాల నుంచి ఈ ఆచారం కొనసాగుతున్నది. (చదవండి: ప్రిన్స్ ఫిలిప్ బర్త్‌డేకి మామిడి పండ్లు) ప్రస్తుతం ఫ్యామిలీ డివిజన్ కోర్టు అధ్యక్షుడిగా ఉన్న సర్ ఆండ్రూ మెక్ ఫార్లేన్ .. ప్రిన్స్ ఫిలిప్ వీలునామాపై తీర్పును ప్రకటించారు. ఫిలిప్ వీలునామాను సీలు చేసి, 90 ఏళ్లు తర్వాత దాన్ని తెరవాలంటూ మెక్‌ఫార్లేన్ తన తీర్పులో వెల్లడించారు. అంతేకాక కోర్టు ఫైల్లో ఉంచే నిమిత్తం వీలునామా కాపీని కూడా తీయడానికి వీలులేదని తెలిపారు. ఇక ప్రిన్స్ ఫిలిప్ తన వీలునామాలో ఏం రాశారో ఎవరికీ తెలియదని జడ్జి తెలిపారు. చదవండి: బ్రిటన్ మహారాణి కన్నుమూస్తే...! -
అదృష్టం అంటే ఈ కుక్కదే.. రూ.36 కోట్ల ఆస్తి
వాషింగ్టన్/టేన్నసీ: సాధారణంగా మనుషుల కన్నా జంతువులకు విశ్వాసం, ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. వాటి పట్ల కాస్త ఆదరణ చూపిస్తే చాలు.. జీవితాంతం మనల్ని అంటి పెట్టుకుని ఉంటాయి. కుక్కల్లో ఈ విశ్వాసం పాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది పెంపుడు జంతువుగా కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఎందుకంటే అవి మన నుంచి ప్రేమను తప్ప ఇంకేం ఆశించవు. మరి కొందరైతే కుటుంబ సభ్యులతో సమానంగా వీటిని చూసుకోవడమే కాక.. ఏకంగా వాటికి ఆస్తిలో వాటా కూడా ఇస్తారు. తాజాగా ఇలాంటి సంఘటన అమెరికాలోని టేన్నసీలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన వీలునామాలో పెంపుడు కుక్క పేర మీద 5 మిలియన్ డాలర్ల ఆస్తి రాశాడు. మన కరెన్సీలో చెప్పాలంటే 36,29,55,250 రూపాయలు. వివరాలు.. టేన్నసీకి చెందిన బిల్ డోరిస్(84) అనే వ్యక్తి గత ఎనిమిదేళ్లుగా లులు అనే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ట్రావేలింగ్ హాబీ కల డోరీస్ తరచుగా ప్రయాణాలు చేసేవాడు. ఆ సమయంలో పెంపుడు కుక్క లులుని తన స్నేహితుడు మార్ట్ బర్టన్ వద్ద వదిలేసి వెళ్లేవాడు. ఈ క్రమంలో గతేడాది డోరిస్ మరణించాడు. అప్పటి నుంచి లులు బాధ్యతని మార్టనే తీసుకున్నాడు. ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం డోరిస్ లాయర్ ఆయన చనిపోవడానికి ముందు రాసిన వీలునామాను మార్ట్‌కి అందించాడు. దానిలో డోరిస్ తన పెంపుడు కుక్క లులు పేరిట 5 మిలియన్ డాలర్ల ఆస్తి రాశాడు. ఈ మొత్తాన్ని లులు సంరక్షణకు, దాని అవసరాలు తీర్చడం కోసం వాడాలని కోరాడు. ఇక లులు బాధ్యతని తన స్నేహితుడు మార్ట్ తీసుకోవాల్సిందిగా వీల్లులో అభ్యర్థించాడు డోరిస్. లులు పేరు మీద ఉన్న ఆస్తికి అతను ట్రస్టీగా ఉంటాడని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా మార్ట్ మాట్లాడుతూ.. ‘‘డోరిస్ రాసిన వీలునామా చూసి నేను ఆశ్చర్యపోయాను. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. డోరిస్, లులు ఎంతో క్లోజ్‌గా ఉండేవాళ్లు. తన బిడ్డలానే చూసేవాడు’’ అని తెలిపారు. చదవండి: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కుక్క! వాలెంటైన్స్ డే: ఫ్రీగా విడాకులు ఇప్పిస్తాం -
‘విల్లు’ ఎక్కుపెట్టారా..?
‘విల్లు’ (వీలునామా) ప్రాధాన్యం తెలిసిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి ఎంతో మందిని బలితీసుకుంటున్న విపత్కర పరిస్థితుల్లో ‘వీలునామా’కు ప్రాధాన్యం ఎంతో ఉంది. తమ ఆస్తులను తదనంతరం తమ వారికి న్యాయబద్ధంగా పంచడమే విల్లులోని ముఖ్య లక్ష్యం. దీనివల్ల ఆస్తుల కోసం వారసులు గొడవపడాల్సిన అవసరం ఏర్పడదు. అవి వారసులకు సులభంగా బదిలీ అవుతాయి. ఇటీవలి కాలంలో వీలునామా పట్ల అవగాహన పెరుగుతోంది. దీనికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలుసుకుంటున్నారు. విల్లును డ్రాఫ్ట్ చేయించేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ వీలునామా గురించి సరైన అవగాహన ఉన్నది కొద్ది మందికే అన్నది వాస్తవం. మరణానంతరం ఆస్తుల పంపకం విషయమై ఎంతో సాయపడే విల్లు గురించి, అందులోని సౌకర్యాల గురించి, విల్లు రాసే విషయంలో తప్పులకు అవకాశం ఇవ్వకుండా ఎలా వ్యవహరించాలన్నది అవగాహన కల్పించే కథనమే ఇది.. వీలునామా అంటే..? ‘వీలునామా’ అంటే చట్టపరమైన డాక్యుమెంట్. ఒక వ్యక్తి తన మరణం తర్వాత తన వారికి ఆస్తులను ఏ విధంగా పంపిణీ చేయాలన్న ధ్రువీకరణ. ‘‘విల్లుకు ఓ నిర్దిష్ట రూపం అంటూ లేదు. ఓ సాధారణ తెల్లని పేపర్‌పై పెన్నుతో స్పష్టంగా రాసి సంతకం చేసినా అది విల్లుగా మారుతుంది. దీనికి స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవక్కర్లేదు’’అని ‘ఇండియా లా పార్ట్నర్స్’ మేనేజింగ్ పార్ట్నర్ గోపికా పంత్ తెలిపారు. అయితే అంత సులభమే అయినా కానీ అవగాహన లేకపోతే తప్పులకు ఆస్కారం ఏర్పడుతుంది. ‘‘ఏదైనా ఒక్క తప్పు చోటు చేసుకుంటే వీలునామా లక్ష్యమే నీరుగారిపోతుంది. మీ వారసుల గుర్తింపును స్పష్టంగా పేర్కొనాలి. ఏ ఆస్తులను ఇవ్వాలనుకున్నదీ వివరంగా రాయాలి’’ అని సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్నర్ అయిన రిషబ్ ష్రాఫ్ తెలిపారు. ఏమేమి ఉండాలి? వీలునామాలో నిర్దేశించిన విధంగా ఆస్తుల పంపిణీని చూసే వ్యక్తి పేరును కూడా అందులోనే పేర్కొనాల్సి ఉంటుంది. తన ఆకాంక్షలకు అనుగుణంగా ఆస్తులను వారసుల మధ్య పరిష్కరించే బాధ్యతలను నిర్వహించే సామర్థ్యాలు ఉన్నవారిని ఇందుకోసం ఎంచుకోవాలి. ఆస్తుల వివరాలతోపాటు, వాటిని ఏ రీతిలో పంచాలన్న వివరాలనూ విల్లులో పేర్కొనాలని పంత్ సూచించారు. ఒకవేళ తగినంత అనుభవం లేని లేదా పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తిని నియమించుకుంటే అది సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. ‘‘విల్లు రాయడానికి ముందే ఆ విల్లు అమలు బాధ్యతలను చూసే వ్యక్తి విషయమై చర్చించడం మంచిది. జీవిత భాగస్వామి లేదా పెద్ద కుమారుడు లేదా కుమార్తె సాధారణ ఆప్షన్ అవుతుంది’’ అని రిషబ్ ష్రాఫ్ పేర్కొన్నారు. ప్రతీ కుటుంబానికి, పరిస్థితులనేవి భిన్నంగా ఉండొచ్చన్నారు. వీలునామా రాసే వ్యక్తి (టెస్టేటర్) పూర్తి ఆరోగ్యంతో, మానసిక ఆరోగ్యం కూడా సరిగ్గానే ఉండాలన్న నియమాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. స్వచ్ఛందంగా, ఎవరి బలవంతం లేకుండా విల్లును రాస్తున్నట్టు కూడా అందులో పేర్కొనాలి. రాసిన విల్లును ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది స్వతంత్ర వ్యక్తులు ధ్రువీకరించడం (అటెస్టేషన్) తప్పనిసరి. అప్పుడే దానికి విలువ చేకూరుతుంది. వీలునామాలో ఆస్తులకు లబ్ధిదారులుగా ఉన్నవారు విల్లు నిర్వాహకులుగానూ ఉండొచ్చని పంత్ తెలిపారు. కాకపోతే వారసుల సాక్ష్యాన్ని (విట్నెస్) తీసుకోవడం లోపంగా పంత్ పేర్కొన్నారు. వారసులను సాక్షులుగా పేర్కొంటే ఉద్దేశం నెరవేరదన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ‘‘వీలునామాలో ‘రెసిడ్యుయరీ క్లాజ్’ అన్నది తప్పకుండా ఉండాలి. విల్లును రాసే నాటికి తన ఆస్తుల్లో కొన్నింటికి వారసులుగా ప్రత్యేకంగా ఎవరినీ సూచించలేకుంటే ఆ వివరాలను ఇందులో పొందుపరుస్తారు. ఈ భాగంలోనే ఆయా ఆస్తులకు ఒక వారసుడిని పేర్కొనాల్సి ఉంటుంది. మిగిలిన వారసుల అభీష్టానికి అనుగుణంగా వీటి అమలుపై నిర్ణయం తీసుకోవాలి’’అని పంత్ వివరించారు. వివాదాలకు ఆస్కారం వీలునామా స్పష్టంగా లేకపోతే వివాదాలు మొదలవుతాయి. సంరక్షకుణ్ణి నియమించకుండా ఆస్తులను మైనర్‌కు ఇవ్వాలని రాయడం వల్ల సదరు వ్యక్తి మేజర్ అయ్యే వరకు అమలు ఆగిపోవడం తరచుగా కనిపించే అంశమని ‘ఇండియా లా పార్ట్నర్స్’ మేనేజింగ్ పార్ట్నర్ గోపికా పంత్ పేర్కొన్నారు. అలాగే, వీలునామా రాసిన తర్వాత కాలంలో.. కొత్తగా సమకూర్చుకునే ఆస్తుల వివరాలను అప్డేట్ చేయకపోవడమూ కనిపించే అంశమని తెలిపారు. ‘‘ఇటీవలే ఓ వ్యక్తి విల్లు రాస్తూ అప్పటికి తన పేరు మీదున్న అన్ని ఆస్తుల వివరాలను పేర్కొన్నారు. ఆ తర్వాత తాను సమకూర్చుకున్న షేర్లు, బాండ్లను ఎవరికి ఇవ్వాలనుకున్నదీ వారసులకు తెలియజేశారు కానీ.. ఆ విషయాన్ని విల్లులో అప్డేట్ చేయకుండా మరణించారు. దీనివల్ల విల్లులో పేర్కొనని ఆస్తులను వారసులు సమానంగా పంచుకోవాల్సి వచ్చింది. పైగా ఆ ఆస్తులను తమ మధ్య సమానంగా పంచుకునేందుకు కోర్టు ఫీజులు, న్యాయ చార్జీల రూపంలో అదనపు ఖర్చుతోపాటు, సమయం కూడా వెచ్చించాల్సి వచ్చింది’’ అని పంత్ వివరించారు. విల్లును సవరించడం విల్లును రాసిన తర్వాతి కాలంలో ఆస్తుల పరంగా మార్పులు చోటు చేసుకున్నప్పటికీ.. ఆ వివరాలను తిరిగి విల్లులో పొందుపరచడం అన్నది చాలా మంది చేయడం లేదు. ఎలా చేయాలన్న సందేహమే ఇందుకు కారణం. ‘‘వీలునామాకు స్వల్ప మార్పులు అవసరమనిపిస్తే దాన్ని కోడిసిల్ (అనుబంధం) రూపంలో సవరణ చేసుకోవచ్చు. దాంతో అది విల్లులో ఒక భాగంగా మారిపోతుంది. ఒకవేళ గతంలో రాసిన వీలునామాలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలనుకుంటే.. అప్పుడు సవరణలు కంటే కూడా తాజాగా విల్లును రూపొందించుకోవడం వల్ల గందరగోళానికి అవకాశం ఉండదు’’ అని పంత్ వివరించారు. ఆస్తుల విలువ తరిగిపోయే కేసుల్లో వీలునామా సవరణ ఎంతో కీలకమవుతుందన్నారు. ‘‘ఒకవేళ ఇద్దరు లబ్ధిదారుల మధ్య ఆస్తులు సమానంగా పంపకం చేయాలని వీలునామా రాసినట్టయితే.. అందులో ఒక వ్యక్తికి చెందాల్సిన ఆర్థిక ఆస్తుల విలువ గణనీయంగా తరిగిపోతే.. అటువంటి సందర్భాల్లో ఆ మేరకు పరిహారం లభించేలా పంపకాలను నిర్దేశించాలి’’ అని కార్వీ ప్రైవేటు వెల్త్ ప్రొడక్ట్స్ హెడ్ శాంతను అవస్తి సూచించారు. ముఖ్యంగా కరోనా వంటి అసాధారణ పరిస్థితులు తలెత్తితే ఎలా వ్యవహరించాలన్నది వీలునామాలో పేర్కొనడం అవసరమని అభిప్రాయపడ్డారు. -
అందుకే కోట్ల ఆస్తి ఆ ఏనుగులకు రాశా!
పాట్నా : తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు ఏనుగుల పేరిట ఐదు కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని రాసేశాడో వ్యక్తి. ఈ సంఘటన బిహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫుల్వారీషరీఫ్, జానిపుర్ గ్రామానికి చెందిన అక్తర్ ఇమామ్‌కి చిన్నప్పటినుంచి ఏనుగులంటే ప్రాణం. అందుకే 12 ఏళ్ల వయసునుంచే వాటిని సంరక్షించటం మొదలు పెట్టాడు. 15 ఏళ్ల క్రితం ‘ఐరావత్’ పేరిట ఓ ఎన్జీఓ సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం అతడి దగ్గర మోతీ, రాణి అనే రెండు ఏనుగులు ఉన్నాయి. వాటి పేర దాదాపు ఐదు కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని వీలునామా రాసేశారు ఇమామ్. వాటికి ఎలాంటి హానీ కలగకుండా ప్రాణపదంగా చూసుకుంటున్నారు. ( సింహం ఘటనపై దేశాధ్యక్షుడి ఆగ్రహం! ) ఇమామ్ మాట్లాడుతూ.. ‘‘ నేను ఏనుగుల పేరిట కోట్ల ఆస్తి రాయటం పిచ్చి నిర్ణయం కాదు. మోతీ,రాణిలు నా ప్రాణాలు కాపాడాయి. అవే నా నిజమైన కుటుంబం. వాటిని సంరక్షించటం నా కెంతో ఇష్టం. నా ప్రాణాలకు ప్రస్తుతం ప్రమాదం ఉంది. వేటగాళ్లు, ఏనుగుల స్వగ్లర్ల నుంచి ముప్పు ఉంది. అందుకే నా ఆస్తిని వాటి పేరిట రాసేశాను. నేను చనిపోయినా అవి సంతోషంగా బ్రతుకుతాయి. అవి చనిపోయిన తర్వాత నా కుటుంబానికి కూడా ఆ ఆస్తి చెందదు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్జీఓకు బదిలీ అవుతుంది. నేను ఇదివరకే నాకు చెందిన పెద్దల ఆస్తిలో నా అక్కాచెల్లెళ్లకు, మాజీ భార్యకు, ముగ్గురు కుమారులకు వాటా పంచాను’’ అన్నారు. ( ఏనుగు మృతి: ప్రమాదవశాత్తూ జరిగిందేమో! ) అలా నా ప్రాణాలు కాపాడాయి కొన్ని సంవత్సరాల క్రితం ఓ పనిమీద ఆరా సిటీకి వెళ్లాను. మోతీని కూడా వెంటతీసుకెళ్లాను. అర్థరాత్రి నేను గదిలో నిద్రలో ఉండగా మోతీ అరుపులు వినిపించాయి. వెంటనే కిటికీలోంచి బయటకు చూశాను. సంకెళ్లు తెంచుకున్న మోతీ తుపాకులతో ఉన్న దుండగులను తరుముతోంది. -
వీలునామా సిద్ధం చేసుకున్న హార్దిక్
అహ్మదాబాద్: పటేళ్లకు రిజర్వేషన్లతోపాటు రైతు రుణమాఫీ చేయాలంటూ పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ చేస్తున్న అమరణ నిరాహార దీక్షకు ఆదివారంతో 9రోజులు పూర్తయ్యాయి. అతని ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలోనే హార్దిక్ తన ఆస్తులను పంచుతూ వీలునామా రాయడం సంచలనం సృష్టిస్తోంది. హార్దిక్ ఖాతాలో రూ.50 వేలున్నాయి. ఇందులో తల్లిదండ్రులకు 20వేలు, పంజ్రపోల్ గ్రామంలో ఆవులకు షెడ్ కోసం రూ.30వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. ‘తన జీవితగాథపై వస్తున్న పుస్తకం హూ టుక్ మై జాబ్‌పై వచ్చే రాయల్టీ, ఇన్సూరెన్స్ డబ్బులు, తన కారు అమ్మగా వచ్చిన మొత్తాన్ని తల్లిదండ్రులు, చెల్లెలితోపాటు మూడేళ్ల క్రితం పటీదార్ ఉద్యమంలో చనిపోయిన 14 మందికి పటేళ్లకు సమానంగా పంచాలని హార్దిక్ పేర్కొన్నారు’ అని పటీదార్ సంఘం అధికార ప్రతినిధి మనోజ్ పనారా వెల్లడించారు. ఒకవేళ ఈ దీక్షలో తను చనిపోతే.. కళ్లను దానం చేయాలని సూచించారు. వీలునామాలో పేర్కొన్న వివరాల ప్రకారం హార్దిక్ ఆస్తిలో 15%తల్లిదండ్రులకు, 15% చెల్లెలికి మిగిలిన 70% 14 మంది పటీదార్లకు చెందుతుంది. -
జెరెమి బెంథాం.. ప్రజెంట్ సార్..
ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ లండన్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది.. ఇలాంటి ముఖ్యమైన మీటింగ్‌లకు ఎవరు అటెండ్ అయినా.. కాకున్నా ‘ఈయన’ తప్పనిసరిగా హాజరవుతాడు. ఫొటోలో ఉన్నవాళ్లలో కాస్త తేడాగా కనిపిస్తున్నాడే.. ఆ ఆయనే.. టోపీ పెట్టుకుని.. సరిగ్గా గుర్తుపట్టేశారే.. మనోడు కాస్త ఓల్డ్ ఫ్యాషన్డ్ లెండి.. అందుకే అప్పటి కాలం దుస్తులు.. అయితే.. మీటింగ్‌కు ఠంచనుగా వస్తాడన్న మాటే గానీ.. ఒక్క ముక్క మాట్లాడడు.. ఎవరేమన్నా బదులివ్వడు.. ముఖ్యమైన నిర్ణయాలపై జరిగే ఓటింగ్‌లోనూ పాల్గొనడు.. ఎందుకంటారా? ఎందుకంటే.. మనోడు బతికిలేడు కాబట్టి.. చచ్చి ఇప్పటికే 186 ఏళ్లు గడిచిపోయాయి కాబట్టి.. జెరెమి బెంథాం.. 18వ శతాబ్దపు ప్రముఖ తత్వవేత్త, సామాజిక సంస్కరణల ఉద్యమకారుడు.. అప్పట్లో ఈయనకు చాలా పేరుండేది. భావప్రకటన హక్కు, వ్యక్తిగత, ఆర్థిక స్వాతంత్య్రం, మహిళలకు సమాన హక్కులు, బానిసత్వం రద్దు ఇలా చాలా వాటిపై తన గళాన్ని గట్టిగా వినిపించడమే కాకుండా.. వాటి కోసం పోరాడేవాడు. అంతేనా.. వన్యప్రాణులకు హక్కులుంటాయని వాదించిన తొలితరం ఉద్యమకారుల్లో జెరెమి ఒకడు. మేధావిగా కీర్తి గడించాడు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. 1832లో మరణించాడు. అయితే.. చనిపోయే ముందు అతడో చిత్రమైన వీలునామా రాశాడు.. ఏమిటా వీలునామా? జెరెమి నాస్తికుడు.. పునర్జన్మలు వంటివి నమ్మడు. దీంతో ఖననం చేయొద్దని చెప్పేశాడు. తన మృతదేహం కూడా సమాజానికి ఉపయోగపడాలని భావించి.. చనిపోయిన తర్వాత దాన్ని పరిశోధనల నిమిత్తం వాడుకోవచ్చని చెప్పాడు. అయితే.. తన శరీరాన్ని కోశాక.. అందులోని అస్థిపంజరాన్ని తీసి.. దానికి తానెప్పుడూ ధరించే దుస్తులు వేసి.. తాను కూర్చునే కుర్చీలోనే కూర్చోబెట్టాలని కోరా డు. తన తలను మాత్రం ప్రత్యేక రసాయనాలతో సంరక్షించి.. దానికి తగిలించాలని చెప్పాడు. అయితే.. ఆ సందర్భంగా జరిగిన కొన్ని తప్పిదాల వల్ల దాన్ని సరిగా సంరక్షించడం వీలు కాలేదు. దీంతో మైనంతో అతడి తలను తయారుచేసి పెట్టారు. అదెలా ఉన్నా.. ఎండుగడ్డితో నింపిన ఆ బొమ్మలో ఉన్న అస్థిపంజరం మాత్రం అప్పటి జెరెమి బెంథాందే కావడం గమనార్హం. స్టోర్ రూమ్‌లో ఉన్న తల ఇంతటితో మనోడి వీలునామా ఆగిందా లేదే.. ఇంకా ఉంది.. అదేంటంటే.. తన మిత్రులు, శిష్యులు నిర్వహించే ముఖ్యమైన పార్టీలు, సమావేశాలకు తనను కూడా తీసుకెళ్లాలని షరతు పెట్టాడు. దీంతో కాలేజీలో జరిగే ప్రతి సమావేశానికి ‘అతడు’ హాజరవుతున్నాడనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే.. కాలేజీ వాళ్లు దీన్ని ఖండిస్తున్నారు. ‘యూనివర్సిటీ కాలేజ్ లండన్ 100, 150వ వార్షికోత్సవాలప్పుడు జరిగిన ముఖ్యమైన కౌన్సిల్ సమావేశాలకు మాత్రమే అతడు ‘వచ్చాడు’. చివరి సారిగా 2013లో వర్సిటీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి రిటైర్మెంట్ సందర్భంగా జరిగిన భేటీకి హాజరయ్యాడు’ అని వర్సిటీ ప్రతినిధి తెలిపారు. మిగతా టైములో జెరెమి కాలేజ్‌లో ఉన్న ఓ చెక్క బీరువాలో ఉంటాడు. ముఖ్యమైన భేటీ ఉంటే.. కాలేజీ సిబ్బంది వచ్చి అతడిని తీసుకెళ్తారు. ఆ మధ్య వరకూ అతడి ఒరిజినల్ తల అతడి కాళ్ల వద్దే ఉండేది. అయితే.. కాలేజీలోని పెంకి కుర్రాళ్లు.. దాన్ని దొంగిలించి.. తిరిగి ఇవ్వడానికి డబ్బులివ్వాలంటూ వర్సిటీ వాళ్లనే బెదిరించేసరికి.. జెరెమి తలను జాగ్రత్తగా స్టోర్ రూంలో దాచిపెట్టారట. ప్రస్తుతం మనోడు.. కాలేజీలోని ఆ చెక్క బీరువాలోనే చెక్క భజన చేస్తున్నాడు.. మరో మీటింగ్‌కు వెళ్లడానికి వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు.. – సాక్షి సెంట్రల్ డెస్క్.. -
అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా...
యాదగిరిగుట్ట(ఆలేరు) : వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అమ్మమ్మ ఇంటికి బయల్దేరిన ఓబాలిక మృత్యువు ఒడిలోకి వెళ్లింది. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామంలో శుక్రవారం ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, పోలీసులు కథనం ప్రకారం... వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన కామిటికార్ మమత, నర్సోజీ దంపతుల కూతురు సోని(15) ఇటీవల పదోతరగతి పూర్తిచేసింది. శుక్రవారం మృగశిర, రెండో శనివారం, ఆదివారం వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో చొల్లేరులో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. మేనమామ ప్రకాశ్‌కు ఫోన్‌చేసి వస్తున్నానని చెప్పడంతో రమ్మన్నాడు. దీంతో సోని గురువారం మధ్యాహ్నం వరంగల్ నుంచి వచ్చే పుష్పుల్ రైలు ఎక్కి వంగపల్లి రైల్వేస్టేషన్లో 4గంటలకు దిగింది. వెంటనే మేనమామకు తన సెల్ నుంచి కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో వంగపల్లి నుంచి మర్రిగూడెం వరకు ఆటోలో వెళ్లి, గ్రామానికి కాలినడకన బయల్దేరింది. గ్రామానికి వాగులో నుంచి పిల్లబాటలో నడుస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వాగులో సుమారు 10 ఫీట్ల లోతు ఉన్న గుంతలో సోని పడిపోయింది. రాత్రంతా వెతుకులాట.. బాలిక రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో సోని అమ్మమ్మ రాధాబాయ్, తాత నర్సోజీ తన కొడుకు ప్రకాష్‌కు సమాచారం అందించారు. దీంతో ప్రకాష్ తన సెల్‌ఫోన్ నుంచి సోనికి పలుమార్లు ఫోన్‌చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో చొల్లేరు, మర్రిగూడెం, వంగపల్లి రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో రాత్రంతా వెతికాదు. ఎక్కడా కనిపించకపోవడంతో సోని తల్లిదండ్రులకు ఫోన్‌చేశాడు. అక్కడ కూడా లేదని చెప్పడంతో పలు ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేదు. రైతు చూడడంతో.. గ్రామానికి చెందిన రైతు గంధమల్ల గాలయ్య శుక్రవారం ఉదయం 11గంటల ప్రాంతంలో తన వ్యవసాయ బావి వద్దకు వాగు గుండా ఉన్న పిల్లబాటలో నుంచి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే బాట పక్కనున్న గుంతలో బాలిక శవం తేలి కనిపించగా గ్రామస్తులకు తెలియజేశాడు. అక్కడికి వెళ్లిన ప్రకాష్ తన మేనకోడలే అని గుర్తించాడు. మేనమామ, మనమరాలిని చూసి అమ్మమ్మ, తాతయ్య కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులతో పాటు యాదగిరిగుట్ట పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై–3 సాయినాథ్ వివరాలు సేకరించి, శవ పంచనామా చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమాస్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సోని మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు -
ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ ఉండాల్సిందే
న్యుఢిల్లీ: 2017,జూలై 1నుంచి ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు ఆధార్ కార్డు తప్పనిసరి అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్( సీబీడీటీ) శనివారం మరోసారి తేల్చి చెప్పింది. అయితే దేశ అత్యున్నత కోర్టు ఇచ్చిన పాక్షిక ఉపశమనం నేపథ్యంలో ఆధార్ కార్డు లేని వారి పాన్ కార్డులు రద్దు చేయబోమని సీబీడీటీ స్పష్టం చేసింది. ఇంతవరకూ ఆధార్ లేనివారు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయవచ్చన్న సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ అత్యున్నత బాడీ ఈ వివరణ ఇచ్చింది. పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. అయితే ఇప్పటివరకు ఆధార్ లేనివారికి, దాని కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఆ కార్డు పొందేవరకు మినహాయింపునిస్తూ శుక్రవారం పాక్షిక స్టే ఇచ్చింది. వ్యక్తిగత గోప్యత అంశంపై రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునేవరకు ఈ మినహాయింపు ఉంటుందని పేర్కొంది. అయితే ఇప్పటికే ఆధార్ ఉన్నవారు మాత్రం పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్)కు అనుసంధానం చేసుకోవాలని చెప్పింది. అలాగే ఆధార్ కోసం దరఖాస్తు చేసి ఇంకా పొందని వారికి పాన్‌కార్డుతో అనుసంధానం నుంచి మినహాయింపుతోపాటు, వారి పాన్‌కార్డుల్ని చెల్లనివిగా ప్రకటించకూడదని ఆదేశించింది. పాన్ జారీ, ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుకు ఆధార్ లింకును ఈ ఏడాది జూలై 1 నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదాయ పన్ను(ఐటీ) చట్టంలో సెక్షన్ 139ఏఏను తీసుకురావడం తెలిసిందే.