దేశవ్యాప్తంగా నేడు (అక్టోబర్ 2) గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. పలు పాఠశాలల్లో గాంధీజీని గుర్తుచేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం గాంధీజీ వినియోగించిన వస్తువులకు సంబంధించిన వేలం వివరాలను తెలుసుకుందాం. నాటి రోజుల్లో గాంధీ వినియోగించిన పలు వస్తువులు అత్యధిక ధరలకు వేలంలో అమ్ముడయ్యాయి. గతంలో నిర్వహించిన ఈ వేలంలో గాంధీజీ రాసిన వీలునామా అత్యధిక ధరకు అమ్ముడయ్యింది. ఈ వేలంలో గాంధీజీ వినియోగించిన బ్రౌన్ స్లిప్పర్, లెదర్ బ్యాగ్ కూడా అమ్ముడయ్యాయి. ఈ రెండింటికీ కొనుగోలుదారులు అధిక ధరలను చెల్లించారు.
మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో రాసిన రెండు పేజీల వీలునామా పత్రం అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఈ వీలునామా పత్రం వేలంలో 55 వేల పౌండ్లకు విక్రయమయ్యింది. ఇది ఇప్పటి మన కరెన్సీలో రూ. 55 లక్షల కంటే అధికం. దీని వేలం కోసం ప్రారంభమైన బిడ్డింగ్ 30 నుండి 40 వేల పౌండ్లతో ప్రారంభం కావడం విశేషం. అయితే ఈ వీలునామాను ఎవరు కొనుగోలు చేశారనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.
అదే వేలంలో గాంధీజీ వినియోగించిన బ్రౌన్ లెదర్ స్లిప్పర్ కూడా అమ్ముడుపోయింది. దీని కోసం కొనుగోలుదారులు 19000 పౌండ్లు చెల్లించారు. దీన్ని భారత రూపాయిల్లోకి మార్చినట్లయితే దాదాపు రూ.19 లక్షలు అవుతుంది. బీబీసీలో ప్రచురితమైన నివేదిక ప్రకారం గాంధీ ముంబైలోని జుహు బీచ్ సమీపంలోని ఒక ఇంట్లో 1917 నుండి 1934 వరకు నివసించారు. అక్కడే గాంధీ వినియోగించిన చెప్పులు లభ్యమయ్యాయి.
ఇది కూడా చదవండి: స్వాతంత్ర్యం వచ్చాక మహాత్మాగాంధీ ఏం చేశారు?
Comments
Please login to add a commentAdd a comment