Mahatama Gandhi
-
మహాత్మా గాంధీ వీలునామా ఏ భాషలో రాశారు? ఎంతకు విక్రయమయ్యింది?
దేశవ్యాప్తంగా నేడు (అక్టోబర్ 2) గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. పలు పాఠశాలల్లో గాంధీజీని గుర్తుచేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం గాంధీజీ వినియోగించిన వస్తువులకు సంబంధించిన వేలం వివరాలను తెలుసుకుందాం. నాటి రోజుల్లో గాంధీ వినియోగించిన పలు వస్తువులు అత్యధిక ధరలకు వేలంలో అమ్ముడయ్యాయి. గతంలో నిర్వహించిన ఈ వేలంలో గాంధీజీ రాసిన వీలునామా అత్యధిక ధరకు అమ్ముడయ్యింది. ఈ వేలంలో గాంధీజీ వినియోగించిన బ్రౌన్ స్లిప్పర్, లెదర్ బ్యాగ్ కూడా అమ్ముడయ్యాయి. ఈ రెండింటికీ కొనుగోలుదారులు అధిక ధరలను చెల్లించారు. మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో రాసిన రెండు పేజీల వీలునామా పత్రం అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఈ వీలునామా పత్రం వేలంలో 55 వేల పౌండ్లకు విక్రయమయ్యింది. ఇది ఇప్పటి మన కరెన్సీలో రూ. 55 లక్షల కంటే అధికం. దీని వేలం కోసం ప్రారంభమైన బిడ్డింగ్ 30 నుండి 40 వేల పౌండ్లతో ప్రారంభం కావడం విశేషం. అయితే ఈ వీలునామాను ఎవరు కొనుగోలు చేశారనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అదే వేలంలో గాంధీజీ వినియోగించిన బ్రౌన్ లెదర్ స్లిప్పర్ కూడా అమ్ముడుపోయింది. దీని కోసం కొనుగోలుదారులు 19000 పౌండ్లు చెల్లించారు. దీన్ని భారత రూపాయిల్లోకి మార్చినట్లయితే దాదాపు రూ.19 లక్షలు అవుతుంది. బీబీసీలో ప్రచురితమైన నివేదిక ప్రకారం గాంధీ ముంబైలోని జుహు బీచ్ సమీపంలోని ఒక ఇంట్లో 1917 నుండి 1934 వరకు నివసించారు. అక్కడే గాంధీ వినియోగించిన చెప్పులు లభ్యమయ్యాయి. ఇది కూడా చదవండి: స్వాతంత్ర్యం వచ్చాక మహాత్మాగాంధీ ఏం చేశారు? -
ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు?
సత్యం, అహింసల మార్గాన్ని అనుసరించి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ. అక్టొబరు 2న జాతిపిత జన్మదినం. ప్రపంచంలోని చాలా మంది ప్రముఖులు నేటికీ గాంధీజీని తమ స్ఫూర్తిదాతగా భావిస్తారు. గాంధీజీలోని నాయకత్వ లక్షణాలు, అనుసరించిన విలువలు, ఆయన గుణగణాలు దేశాన్ని ఏకం చేయడానికి దోహదపడ్డాయి. బాపుజీ అనుసరించిన జీవన శైలిని నేటికీ విజయానికి ఉత్తమమైన మార్గంగా పరిగణిస్తారు. జాతిపిత జన్మదినోత్సవం సందర్భంగా ప్రతీఒక్కరికీ ఉపకరించే గాంధీజీ బోధనలలోని కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం. వ్యక్తి ఆలోచనలే అతనిని తీర్చిదిద్దుతాయి. అందుకే మనం ఏమనుకుంటామో అదే అవుతాం. మనం చేసే ఏ ఒక్క పని అయినా ఎవరికైనా సంతోషాన్ని కలిగించగలిగితే, అది వేలమంది తలలు వంచి చేసే ప్రార్థన కన్నా ఉత్తమమైనది. జీవితంలో చాలా సార్లు ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎదుటివారిని ప్రేమతో గెలిచే ప్రయత్నం చేయాలి. ఈ ప్రపంచంలో నిజమైన శాంతి నెలకొనాలంటే యుద్ధానికి వ్యతిరేకంగా నిజమైన పోరాటం జరగాలి. దీనిని మనం మన పిల్లలతోనే ప్రారంభించాలి. అప్పుడే నిజమైన శాంతి వర్ధిల్లుతుంది. ఈ భూమిపై ఎప్పటికీ జీవించాలి అన్నట్లుగా మీ జీవితాన్ని మలచుకోండి. బలం అనేది శారీరక సామర్థ్యాల నుండి కాదు.. అసమానమైన సంకల్ప శక్తి నుండి సమకూరుతుంది. కాబట్టి మీ సంకల్ప శక్తిని బలంగా ఉండనివ్వండి. ఎవరినైనా కోల్పోయే వరకు వారి ప్రాముఖ్యతను చాలామంది అర్థం చేసుకోలేరు. అందుకే ముందుగానే ఎదుటివారి ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఏదైనా పని చేసే ముందే దానిగురించి ఆలోచించండి. పని చేసిన తరువాత మీరు ఎంత ప్రయత్నించినా, మీ పనుల ఫలితాలు ఎలా ఉంటాయో ఎప్పటికీ తెలుసుకోలేరు. అందుకే మీరు చేసే పనిపైన మాత్రమే దృష్టి పెట్టండి. ఎవరైనా సరే ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవడం కంటే పెద్ద నష్టం మరొకటి లేదు. అందుకే మీ ఆత్మగౌరవాన్ని మీరే కాపాడుకోండి. ఇది కూడా చదవండి: త్వరలో ప్రతి రైలులో ‘పాతాళ గంగ’.. అడక్కుండానే వాడుక నీరు! -
మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకని కన్నుమూత
ముంబై: మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకని మంగళవారం ముంబైలో కన్నుమూశారు. 89 ఏళ్ల వయసున్న గోకని గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, రెండేళ్లుగా నిలబడలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారని మణి భవన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మేఘశ్యామ్ అజ్గాంకర్ తెలిపారు. గోకాని గాంధీ స్మారక్ నిధికి గతంలో ఛైర్‌పర్సన్‌గా పని చేశారు. గాంధీజీ స్థాపించిన వార్ధాలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో ఆమె తన బాల్యాన్ని గడిపింది. ముంబైలోని గాంధీ స్మారక్ నిధి అనేది మహాత్మా గాంధీ తన జీవితకాలంలో అనుసరించిన అనేక రకాల నిర్మాణాత్మక కార్యకలాపాలను నిర్వహించడంతో పాటు వాటిని ప్రోత్సహించే లక్ష్యంతో స్థాపించబడింది. 1955 అక్టోబర్ 2న మణి భవన్‌ను గాంధీ మెమోరియల్ సొసైటీకి అప్పగించడంతో స్మారక్ నిధి లాంఛనంగా పని చేయడం ప్రారంభించింది. గాంధీ స్మారక్ నిధి ముంబై, మణి భవన్ గాంధీ సంగ్రహాలయ అనే రెండు సంస్థలు మణి భవన్లో ఉన్నాయి. మణి భవన్ భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగింది. -
నోట్లపై గాంధీ బొమ్మ బదులు.. ఆర్బీఐ క్లారిటీ
ముంబై: కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీకి బదులుగా వేరే ముఖాలను చూడబోతున్నామంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. నోట్లపై గాంధీ ముఖం బదులు.. రవీంద్రనాథ్ ఠాగూర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఫొటోలతో కొత్త కరెన్సీ నోట్లను ముద్రించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ కథనాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పందించింది. సోమవారం మధ్యాహ్నం ఆర్బీఐ ఓ కీలక ప్రకటనను జారీ చేసింది. దీనికి సంబంధించి తమ వద్ద ఎలాంటి కొత్త ప్రతిపాదన లేదని ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ యోగేశ్ దయాళ్ ఆ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు ట్విటర్లోనూ ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చింది ఆర్బీఐ. RBI clarifies: No change in existing Currency and Banknoteshttps://t.co/OmjaKDEuat — ReserveBankOfIndia (@RBI) June 6, 2022 ఇదిలా ఉంటే.. కరెన్సీ నోట్లలో మరిన్ని మేర సెక్యూరిటీ ఫీచర్ల ఏర్పాటుకు సంబంధించి ఐఐటీ ఢిల్లీ రిటైర్డ్ ప్రొఫెసర్, ఎలక్ట్రోమాగ్నటిక్ ఇన్స్ట్రుమెంటేషన్ నిపుణుడు దిలీప్ సహానికి గాంధీ సహా ఠాగూర్,కలాం ఫొటోలను ఆర్బీఐ పంపిందని, కరెన్సీ నోట్లపై గాంధీ ఫొటో స్థానంలో ఠాగూర్, కలాం ఫొటోల ముద్రణకు సంబంధించి ఆయన నుంచి నివేదిక కోరిందని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో వాటిపై వివరణ ఇచ్చిన యోగేశ్ దయాళ్ ఆ వార్తలను ఖండించారు. -
మహాత్ముడికి ట్రంప్ నివాళి..
-
25 లక్షలు పలికిన గాంధీ పెయింటింగ్
ప్రధాని మోదీ అందుకున్న జ్ఞాపికల ప్రదర్శన, ఈ–వేలంలో గాంధీజీ చిత్రం అత్యధికంగా రూ.25 లక్షలు పలికింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ప్రదర్శన, ఈ–వేలం సెప్టెంబరు 14న ప్రారంభమై శుక్రవారంతో ముగిసింది. ఈ వేలం ద్వారా 2,772 జ్ఞాపికలు అమ్ముడయ్యాయి. ఇందులో అతి తక్కువగా గణేశ్ విగ్రహం రూ. 500, అత్యధికంగా గాంధీ పెయింటింగ్ రూ. 25లక్షలు పలికింది. ఈ సొమ్మును నమామి గంగా మిషన్‌కు ఇవ్వనున్నారు. -
నిన్నటి.. ఆ అడుగు జాడలు...
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాందీగాదక్షిణాఫ్రికా వెళ్లిన గాందీజీ... ఉద్యమకారుడిగా తిరిగి వచి్చన నాటి నుంచి వేసిన అడుగులు చరిత్ర గతినే మార్చేశాయి. ‘రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. చివరికి వారు ని్రష్కమించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. చంపారణ్లో రైతుల కోసం మొదలుపెట్టిన తొలి ఉద్యమం అనంతరకాలంలో ఎన్నో కీలక ఘట్టాలకు స్ఫూర్తినిచి్చంది. దేశానికి మహాత్ముణ్ణి అందించింది. బ్రిటిష్ పాలకులకు ఊపిరాడనీయకుండా చేసిన ఉద్యమాల పరంపర 1948 జనవరి 30న ఉన్మాది తూటాలకు గాంధీజీ నేలకొరిగే వరకూ సాగుతూనే ఉంది. ఆయన ప్రస్థానంలోని ముఖ్యమైన అడుగుల జాడలివి... జనవరి 9/1915 స్వదేశానికి మహాత్ముడు దక్షిణాఫ్రికాలో నాటల్ ఇండియన్ కాంగ్రెస్‌కు సారథ్యం వహించి వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపాక భారత్‌కు తిరిగొచి్చన రోజు. ఏప్రిల్ 17/1917 చంపారణ్ సత్యాగ్రహం బిహార్‌లోని చంపారణ్లో బార్లీ బదులు నీలిమందు తోటల్ని పెంచాలన్న బ్రిటిష్ పాలకుల హుకుంను నిరసిస్తూ రైతులకు మద్దతుగా గాంధీ తొలి సత్యాగ్రహం. అనంతరకాల సత్యాగ్రహ ఉద్యమాలకు ఇదే స్ఫూర్తి. మార్చి 18/1918 ఖేడా ఉద్యమం ఒకపక్క ప్లేగు వ్యాధి, మరోపక్క కరువు పీడిస్తున్న గుజరాత్‌లోని ఖేడాలో అధిక పన్నులకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం. లొంగివచ్చిన ప్రభుత్వం. ఏప్రిల్ 6 1919 రౌలట్ నిరసనోద్యమం జాతీయోద్యమంపై ఉక్కుపాదం మోపుతూ ప్రభుత్వానికి అసాధారణ అధికారాలు. నిరసనగా సత్యాగ్రహం.జలియన్‌వాలాబాగ్ మారణకాండ. వెయ్యిమంది మృతి. మార్చి 12/1930 ఉప్పు సత్యాగ్రహం జాతీయోద్యమాన్ని మలుపు తిప్పిన కీలక సత్యాగ్రహం. గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి 384 కిలోమీటర్ల దూరంలోని దండికి గాం«దీజీ ప్రారంభించిన పాదయాత్ర. యాత్ర చివరిలో ఉప్పుపై ప్రభుత్వం విధించిన ఆంక్షల ఉల్లంఘన. గాందీజీ, ఇతర నేతల అరెస్టు. మార్చి 5/1931 గాంధీ–ఇర్విన్ ఒడంబడిక భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్‌తో కుదిరిన ఒప్పందం పర్యవసానంగా కాంగ్రెస్ కార్యకలాపాలపై ఉన్న ఆంక్షలు, కార్యకర్తలపై సాధారణ కేసుల ఉపసంహరణ. దండి యాత్రలో పాల్గొన్న వారి విడుదల. 1934 కాంగ్రెస్‌కు రాజీనామా కాంగ్రెస్‌లో సహచర నేతలతో విభేదాలు. పారీ్టకి గాంధీ రాజీనామా. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గాంధీ దీక్ష చేపట్టాక పుణేలో దళితుల తరఫున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, అగ్రవర్ణాల తరఫున మదన్మోహన్ మాలవీయల మధ్య ఒప్పందం. అనంతరకాలంలో అగ్రవర్ణాలకు అనుకూలమంటూ వచి్చన నిందల పర్యవసానంగా పారీ్టకి రాజీనామా. 1937లో పార్టీ నేతల వినతితో తిరిగి చేరిక. ఆగస్టు 8 1942 క్విట్ ఇండియా ఉద్యమం భారత్‌కు అధినివేశ ప్రతిపత్తి ఇస్తామంటూ క్రిప్స్ రాయబారం. కాంగ్రెస్ తిరస్కరణ. స్వాతంత్య్రం తప్ప మరేదీ సమ్మతం కాదని తేల్చిచెప్పాక గాంధీతోపాటు పలువురు నేతల అరెస్టు. బ్రిటిష్ పాలకులు దేశం వదిలిపోవాలంటూ ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం. ఆగస్టు 15/1947 స్వాతంత్య్ర భానూదయం దేశాన్ని భారత్, పాకిస్తాన్‌లుగా విభజించి ఇరు దేశాలకూ స్వాతంత్య్రం ప్రకటిస్తూ ప్రకటన. జనవరి 30 /1948 మహాభి నిష్క్రమణం హిందువుల ప్రయోజనాలు దెబ్బతీస్తూ ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ప్రార్థనా సమావేశంలో ఉన్న గాం«దీజీని కాల్చి చంపిన దుండగుడు నాథూరాం వినాయక్ గాడ్సే. ►గాంధీజీకి తొలి సంతానంగా ఒక పాప పుట్టి మూడు నాలుగు రోజులకే చనిపోయింది. తాను చేసిన తప్పునకు దేవుడు విధించిన శిక్షగా భావించి దాన్ని అంగీకరించారు. ►నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న ఐదుగురు నేతలు– మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ (అమెరికా), నెల్సన్ మండేలా (దక్షిణాఫ్రికా), అడాల్ఫో పెరెజ్ ఎస్క్వవెల్(అర్జెంటీనా), దలైలామా (టిబెట్), ఆంగ్‌సాన్ సూకీ (మయన్మార్)– తమ మీద గాంధీజీ ప్రభావం ఉందని చెప్పుకున్నారు. ►రచయితలు, చింతనాపరులు జాన్ రస్కిన్ (బ్రిటన్), లియో టాల్‌స్టాయ్ (రష్యా), ఎడ్వర్డ్ కార్పెంటర్ (బ్రిటన్) రచనల వల్ల అమితంగా ప్రభావితం అయ్యారు గాంధీజీ. వాళ్లను తన గురుతుల్యులుగా పేర్కొన్నాడు. నేటికీ.. అవసరం ఆయన్ను జార్జి బెర్నార్డ్ షా హిమాలయాలతో సరిపోల్చాడు... మహామేధావి ఐన్స్టీన్కైతే ప్రపంచ రాజకీయవేత్తల్లో ఏకైక వివేకవంతుడిగా కనబడ్డాడు... మారి్టన్ లూథర్‌కింగ్‌కు ఆయన క్రీస్తు... బరాక్ ఒబామాకు నిజమైన హీరో... మొత్తంగా అందరికీ మహాత్ముడు! ఒక అమ్మ కడుపున జన్మించి మూడు యాభైలు గడిచినా ఇప్పటికీ దేశంలోనే కాదు ప్రపంచమంతటా ప్రభావం చూపుతున్నాడంటే ఆయన నిస్సందేహంగా అసాధారణ మానవుడు. అప్పుడు నెల్సన్ మండేలాకైనా, ఆ తర్వాత కాలంలో మారి్టన్ లూథర్కింగ్కైనా, పదేళ్ల కిందట అరబ్ ప్రపంచాన్ని చుట్టుముట్టి నియంతలను గడగడలాడించిన ‘జాస్మిన్ విప్లవానికైనా, ఇప్పుడు మనకళ్లముందు సాగుతున్న హాంకాంగ్ హక్కుల ఉద్యమానికైనా మహాత్ముడే వెలుగు కిరణాలు విరజిమ్మిన మార్తాండుడు. కాలావధులు దాటి నిరంతరాయంగా స్వేచ్ఛా పరిమళాలను వెదజల్లే బలమైన ప్రభావం. నిన్నమొన్న ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసిలో ఒక పాఠశాల కుర్రాడు ఆయుష్ చతుర్వేది చేసిన ఉద్వేగభరిత ప్రసంగం గాందీజీ వర్తమాన అవసరాన్ని నొక్కిచెప్పింది. బక్కపలచగా, ఒంటిపై అంగవస్త్రం తప్ప మరేమీ లేకుండా సర్వసంగ పరిత్యాగిలా కనబడే మహాత్మాగాం«దీలో ఏమిటింత గొప్పతనం? ఆయనంటే ఈనాటికీ ఎందుకింత ఆరాధన? ఇదేమిటి... మనమధ్య నుంచి ని్రష్కమించి ఏడు పదులు గడుస్తున్నా ఇంకా ఆయనను భిన్న కోణాల్లో దర్శిస్తూ, కొత్తకొత్తగా విశ్లేíÙçస్తూ, ఆయన మూర్తిమత్వాన్ని కళ్లకు కడుతూ ఏడాదికో, రెండేళ్లకో పుస్తకాలు వెలువడటమేమిటి? వింతగా లేదూ...?! ఆయనకంటే నాలుగైదేళ్ల తర్వాతే కావొచ్చుగానీ మన దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఆవిర్భవించాక గాం«దీజీ రాజకీయాలను, ఆయన ఉద్యమ నిర్వహణ తీరును కమ్యూనిస్టు పార్టీ పలు సందర్భాల్లో నిశితంగా విమర్శించింది. ఆయన వేస్తున్న అడుగులు సరికాదని హెచ్చరించింది. ఆ ఎత్తుగడలన్నీ సామ్రాజ్యవాదులకే అంతిమంగా ఉపయోగపడతాయన్నది. కానీ అది రష్యా తరహాలో ఇక్కడొక లెనిన్‌ను సృష్టించుకోలేకపోయింది. చైనాలో మావోలా విప్లవోద్యమ సారథికి పురుడు పోయలేకపోయింది. వియత్నాంలో వలే ఇక్కడ హోచిమిన్ జాడలేదు. దశాబ్దం క్రితం మన పొరుగునున్న నేపాల్ మాదిరి రాచరికాన్ని కూలదోసిన ‘ప్రచండ’ కూడా లేడు. కానీ గాంధీజీ అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ ఉన్నాడు, ఉంటాడు. ఐదు దశాబ్దాల క్రితం మార్క్సిస్టు దిగ్గజం నంబూద్రిపాద్ ఓ మాటన్నారు. భారత రాజకీయాల్లో గాంధీజీ పాత్రను సరిగా విశ్లేషించుకొని, సరైన మార్గాన్ని ఎంచుకోలేకపోవడమే కమ్యూనిస్టుల వైఫల్యానికి ప్రధాన కారణమని వివరించారు. గాం«దీజీ మూలాలు గ్రామీణ భారతంలో, అక్కడి జీవనంలో పెనవేసుకుపోయి ఉన్నాయన్నది నంబూద్రిపాద్ విశ్లేషణ. కనుకనే అప్పుడప్పుడూ వెనక్కి తగ్గినట్టు కనబడినా, ఎదురుదెబ్బలు తప్పకున్నా మొత్తంగా గాంధీజీ పురోగమనశీలిగా, లక్ష్య సాధకుడిగా రూపుదిద్దుకున్నాడని ఆయన వివరించారు.గాందీజీ ఉద్యమనాయకుడు మాత్రమే కాదు... ఆవిర్భవించబోయే రేపటి భారతానికి ముందే సిలబస్ తయారు చేసిన దార్శనికుడు. ఆయన ప్రవచించిన స్వదేశీ ఆర్థిక వ్యవస్థ, గ్రామ స్వరాజ్యం ఈనాటికీ శిరోధార్యాలు. ఆయన స్పృశించని అంశం లేదు. అందులో స్త్రీ, పురుష సమానత్వం, సంçస్కృతి చదువు, నిరాడంబరత, సత్యాహింసలు, ఆధ్యాత్మికత, నైతిక విలువలు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, కులమత వివక్షలు, భాష తదితరాలన్నీ ఉన్నాయి. ఆయన దృష్టికోణం నుంచి తప్పుకున్నదేదీ లేదు. సమస్త అంశాలూ ఆయన అధ్యయనం చేశాడు. సరైన దోవ ఏదో చెప్పాడు. అవతలివారి అభిప్రాయాలకు విలువనిచ్చాడు. ఒక్కోసారి వాటికి అనుగుణంగా తానూ మారాడు. అవతలివారి ఆచరణను చూశాడు. అందులో నేర్చుకోదగినవాటిని స్వీకరించాడు. స్వాతంత్య్రం సిద్ధించాక పాలకులు వాటిని విస్మరించి ఉండొచ్చు. కొన్నిటిని నామమాత్రంగా అమలు చేస్తూండొచ్చు. సమాజంలో చివరాఖరి సాధారణ మానవుడికి సైతం అభివృద్ధి ఫలాలు దక్కినప్పుడే అది నిజమైన స్వాతంత్య్రం అవుతుందని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు గాం«దీజీ. అన్నిటికన్నా పేదరికమే అత్యంత హీనమైన హింస అని చెప్పాడు. ‘మనకో, మనకు తెలిసినవారికో అనుకోనిది ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ అంతమాత్రాన మానవత్వంపై విశ్వాసం పోగొట్టుకోవద్దు’ అని హితవు చెప్పాడు. కొన్ని చుక్కల నీరు కల్మషమైతే సముద్రం చెడిపోయినట్టేనా అని ప్రశ్నించాడు. మన వ్యక్తిగత జీవితాన్ని, సామాజిక జీవితాన్ని, ప్రవర్తనను, చదువులను, కొలువులను, పాలననూ, పద్ధతులను గాంధీ కొలమానంలో ఎప్పటికప్పుడు చూసుకుంటేనే... చూసి సరిచేసుకుంటేనే ఈ దేశం సవ్యంగా మనుగడ సాగించగలదని పదేపదే రుజువవుతోంది. – డా. నాగసూరి వేణుగోపాల్ -
గాంధీజీ సూపర్‌స్టార్: కమల్
సాక్షి, చెన్నై : గాంధీజీని సూపర్‌స్టార్ అంటూ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ అభివర్ణించారు. ఆదివారం చెన్నైలో పార్తీబన్ దర్శకత్వం వహించిన సినిమా ‘ఒత్త సెరుప్పు’(ఒకటే చెప్పు) విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చదవండి : హిందూ ఉగ్రవాదంపై కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు ‘గాంధీజీ సూపర్‌స్టార్. గాంధీజీ రైలులో ఉండి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఒక చెప్పు జారిపోయింది. దీంతో గాంధీజీ చెప్పుల జత ఉంటేనే కదా ఎవరికైనా ఉపయోగపడతాయి..అంటూ రెండో చెప్పునూ తీసి బయటకు విసిరేశారు’ అని తెలిపారు. ‘నా హీరో మహాత్మాగాంధీ. ఆయన ఎన్నటికీ మారరు. అలాగే, విలన్‌ను హీరోగా అంగీకరించను’ అంటూ గాడ్సేనుద్దేశించి అన్నారు. ‘స్వతంత్ర భారతావనిలో తొలి తీవ్రవాది హిందువు.. అతడే నాథూరాం గాడ్సే’ అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదమవడం తెల్సిందే. -
గాంధీ శాంతి బహుమతి విజేతలు వీరే
న్యూఢిల్లీ: 2015 నుంచి 2018 వరకు నాలుగేళ్ల కాలానికి గాంధీ శాంతి బహుమతుల విజేతల పేర్లను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. చివరిగా 2014లో ఈ పురస్కారాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ప్రదానం చేశారు. 2015 నుంచి ఎవరికీ ఇవ్వలేదు. గాంధీ సిద్ధాంతాలు, పద్ధతుల ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పు కోసం కృషిచేసే వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులు ఇస్తారు. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో 2015 ఏడాది విజేతగా కన్యాకుమారికి చెందిన వివేకానంద కేంద్రను ఎంపిక చేశారు. పాకీ పని చేసే వారికి విముక్తి కల్పించినందుకు సులభ్ ఇంటర్నేషనల్‌కు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్నందుకు అక్షయపాత్ర ఫౌండేషన్‌కు కలిపి 2016 ఏడాదికి గాంధీ శాంతి అవార్డును ప్రకటించారు. 2017 ఏడాదికి ఏకై అభియాన్ ట్రస్ట్‌ను, 2018కి కుష్టు వ్యాధి నిర్మూలన కోసం డబ్ల్యూహెచ్‌వో సౌహార్ద్ర రాయబారిగా ఉన్న యోహీ ససకవాకు అవార్డులను ప్రకటించారు. ఈ బహుమతి కింద రూ.కోటితోపాటు ప్రశంసాపత్రం ఇస్తారు. -
ఈయన మన గాంధీ తాత కాదు..
కరాచీ : మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారంటారు. అయితే ఈ ఫొటో చూస్తే మాత్రం ఈ మాట నిజమే అనిపిస్తోంది. ఈ ఫొటోలో ఉన్నది మన జాతిపిత మహాత్మా గాంధీ అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే ఈయన గాంధీని పోలిన ఓ పాకిస్థాన్ వృద్ధుడంటా.. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన అసిమ్ రజాక్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ‘భారత జాతిపిత కరాచీ మొబైల్ మార్కెట్లో కన్పించాడని’ ట్వీట్ చేశాడు. తలపై టోపీ, వంటిపై దుస్తులు తప్ప ముఖం, అద్దాలు చూస్తే ఈ పెద్దాయన అచ్చం గాంధీలా ఉన్నాడు కదా.! అయితే ఇది నిజంగా కరాచీ వ్యక్తికి చెందినదా లేదా అని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. #MahatamaGandhi found in Karachi Mobile Market ;) #Gandhi #Indians #KulbhushanJadhav pic.twitter.com/pSIm68M8JV — ASIM RAZZAQ (@asimnoori) December 25, 2017 -
చిన్ని బాపూ.. అదిరెను గెటప్పు..
గుంటూరు డెస్క్: పంచె కట్టు, చేతిలో కర్ర, ముక్కుపై జారిపోతున్న కళ్లజోడు, చూపులో గాంభీర్యంతో ఈ బుడతడు ఎంత చక్కగా మహాత్మాగాంధీ వేషధారణలో ఇమిడిపోయాడో కదూ... మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆదివారం మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ నేతృత్వంలో నగరంలో విద్యార్థులు, స్వాతంత్య్ర సమరయోధులతో ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా కన్న స్కూల్ విద్యార్థి అక్మల్ గాంధీజీ వేషధారణతో వచ్చి ఇలా బాపూ ఒడిలో కూర్చుని అందరినీ ఆకట్టుకున్నాడు. – ఫొటో: రూబెన్ బెసాలియేల్ -
భారత్-దక్షిణాఫ్రికా సిరీస్‌కు ప్రత్యేక టాస్ కాయిన్
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ 146వ జయంతి సందర్భంగా భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్ కోసం బీసీసీఐ ప్రత్యేకంగా టాస్ కాయిన్‌ను రూపొందించింది. 20 గ్రాముల బరువు గల ఈ నాణెమును స్వచ్ఛమైన వెండితో బంగారు పూత పూసి తయారు చేయించారు. దీనిపై గాంధీ, దక్షిణాఫ్రికా నల్లసూరీడు నెల్సన్ మండేలా చిత్రాలను ముద్రించినట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలియజేసింది. నాణెం బొమ్మ భాగంపై గాంధీ, మండేలా చిత్రాలను, బొరుసు భాగంపై భారత్, క్రికెట్ సిరీస్ లోగోను ముద్రించారు. శుక్రవారం భారత్, దక్షిణాఫ్రికా ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభంకానుంది. రాత్రి 7 గంటల నుంచి ధర్మశాలలో ఇరు జట్ల మధ్య తొలి టి-20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత్, దక్షిణాఫ్రికా కెప్టెన్లు ధోనీ, డుప్లెసిస్లతో కలసి బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ టాస్ కాయిన్‌ను ఆవిష్కరిస్తారు. ఈ సిరీస్‌లో ప్రతీ మ్యాచ్‌కు ఇదే టాస్ కాయిన్‌ను ఉపయోగిస్తారు. గాంధీ గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఠాకూర్ చెప్పారు.