గాంధీజీ సూపర్‌స్టార్‌: కమల్‌  | Kamal Haasan Calls Mahatma Gandhi Is A Superstar | Sakshi
Sakshi News home page

గాంధీజీ సూపర్‌స్టార్‌: కమల్‌ 

Published Mon, May 20 2019 9:55 AM | Last Updated on Mon, May 20 2019 9:55 AM

Kamal Haasan Calls Mahatma Gandhi Is A Superstar - Sakshi

సాక్షి, చెన్నై : గాంధీజీని సూపర్‌స్టార్‌ అంటూ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌(ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్‌ అభివర్ణించారు. ఆదివారం చెన్నైలో పార్తీబన్‌ దర్శకత్వం వహించిన సినిమా ‘ఒత్త సెరుప్పు’(ఒకటే చెప్పు) విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

చదవండి : హిందూ ఉగ్రవాదంపై కమల్‌హాసన్‌ సంచలన వ్యాఖ్యలు

‘గాంధీజీ సూపర్‌స్టార్‌. గాంధీజీ రైలులో ఉండి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఒక చెప్పు జారిపోయింది. దీంతో గాంధీజీ చెప్పుల జత ఉంటేనే కదా ఎవరికైనా ఉపయోగపడతాయి..అంటూ రెండో చెప్పునూ తీసి బయటకు విసిరేశారు’ అని తెలిపారు. ‘నా హీరో మహాత్మాగాంధీ. ఆయన ఎన్నటికీ మారరు. అలాగే, విలన్‌ను హీరోగా అంగీకరించను’ అంటూ గాడ్సేనుద్దేశించి అన్నారు. ‘స్వతంత్ర భారతావనిలో తొలి తీవ్రవాది హిందువు.. అతడే నాథూరాం గాడ్సే’ అంటూ కమల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదమవడం తెల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement