Gadse
-
మహాత్ముని వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు?
బ్రిటీష్‌వారి బానిసత్వం నుండి దేశానికి విముక్తి కల్పించడంలో మహాత్మా గాంధీ ఎనలేని కృషి చేశారు. భారతదేశ స్వాతంత్ర్యం, అభివృద్ధి, శ్రేయస్సు కోసం మహాత్ముడు తన జీవితాన్ని త్యాగం చేశారు. 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని కాల్చి చంపాడు. గాంధీజీ త్యాగాన్ని స్మరించుకునేందుకు ప్రతీ ఏటా జనవరి 30న అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. గాంధీ వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక జీవితం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి శాంతి, అహింస, సామరస్య మార్గాన్ని చూపింది. అది.. 1948, జనవరి 30నాటి సాయంత్రం వేళ.. మహాత్మా గాంధీ ఢిల్లీలోని బిర్లా భవన్లో జరిగే ప్రార్థనా సమావేశంలో ప్రసంగించబోతున్నారు. సరిగ్గా అదే సమయంలో సాయంత్రం 5:17 గంటల ప్రాంతంలో నాథూరామ్ గాడ్సే .. మహాత్మాగాంధీపై కాల్పులు జరిపాడు. గాంధీజీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బాపూజీ మరణానంతరం, ఆయన వర్ధంతి (జనవరి 30)ని ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అమరవీరుల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి కూడా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటుంది. జనవరి 30న అమరవీరుల దినోత్సవం సందర్భంగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, త్రివిధ దళాల ఆర్మీ చీఫ్‌లు రాజ్‌ఘాట్‌లోని మహాత్ముని సమాధి వద్ద ఆయనకు నివాళులు అర్పిస్తారు. అలాగే అమరవీరులందరినీ స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలలో మహాత్మా గాంధీని గుర్తుచేసుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈరోజు మహాత్ముడు మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు, గురుతులు మనందరి మదిలో సజీవంగా నిలిచి ఉన్నాయి. గాంధీజీ చెప్పిన పరిశుభ్రత మంత్రం నేడు ప్రతి ఒక్కరికీ చేరింది. బాపూజీ త్యాగాన్ని భారతదేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. -
గాడ్సే మూవీ పబ్లిక్ టాక్
-
గాంధీజీ సూపర్‌స్టార్: కమల్
సాక్షి, చెన్నై : గాంధీజీని సూపర్‌స్టార్ అంటూ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ అభివర్ణించారు. ఆదివారం చెన్నైలో పార్తీబన్ దర్శకత్వం వహించిన సినిమా ‘ఒత్త సెరుప్పు’(ఒకటే చెప్పు) విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చదవండి : హిందూ ఉగ్రవాదంపై కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు ‘గాంధీజీ సూపర్‌స్టార్. గాంధీజీ రైలులో ఉండి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఒక చెప్పు జారిపోయింది. దీంతో గాంధీజీ చెప్పుల జత ఉంటేనే కదా ఎవరికైనా ఉపయోగపడతాయి..అంటూ రెండో చెప్పునూ తీసి బయటకు విసిరేశారు’ అని తెలిపారు. ‘నా హీరో మహాత్మాగాంధీ. ఆయన ఎన్నటికీ మారరు. అలాగే, విలన్‌ను హీరోగా అంగీకరించను’ అంటూ గాడ్సేనుద్దేశించి అన్నారు. ‘స్వతంత్ర భారతావనిలో తొలి తీవ్రవాది హిందువు.. అతడే నాథూరాం గాడ్సే’ అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదమవడం తెల్సిందే. -
గాడ్సేపై వ్యాఖ్యలను సమర్థించుకున్న కమల్‌హాసన్
-
గాడ్సేకి అటూ ఇటూ
-
‘గాడ్సే కాకపోతే నేను గాంధీని చంపేదాన్ని’
అలహాబాద్ : ‘ఒకవేళ గాడ్సే, మహాత్మ గాంధీని చంపకపోయి ఉంటే నేనే ఆ పని చేసి ఉండేదాన్ని’ అంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త పూజా శకున్ పాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల భారత్ హిందూ మహాసభ(ఏబీహెచ్‌ఎమ్) అధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా మీరట్‌లో ఏర్పాటు చేసిన హిందూ కోర్టు ప్రథమ జడ్జీగా పూజా శకున్ పాండే నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘నేను, ఏబీహెచ్‌ఎమ్ నాథురాం గాడ్సే చేసిన పనిని కీర్తిస్తున్నాను. అంతేకాక నేటి కాలంలో కూడా విభజనను సమర్ధించే గాంధీలు ఉంటే, వారిని వ్యతిరేకించే గాడ్సేలు కూడా ఉంటారు. ఒక వేళ గాడ్సే గాంధీని చంపకపోతే నేనే ఆ పని చేసేదాన్ని’ అని ప్రకటించారు. గత కొంత కాలంగా ఏబీహెచ్‌ఎమ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. కేరళ వరదల నేపథ్యంలో వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న వారిలో గొడ్డు మాంసం తినే వారు ఉంటే వారికి సాయం చేయొద్దంటూ ఏబీహెబ్ఎమ్ నాయకుడు చక్రపాణి మహరాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరిన్ని హిందూ కోర్టులు: ఏబీహెచ్‌ఎమ్ మీరట్‌లో తొలి హిందూ కోర్టును ఏర్పాటు చేసిన ఏబీహెచ్‌ఎమ్ త్వరలోనే దేశ వ్యాప్తంగా మరిన్ని హిందూ కోర్టులను ఏర్పాటు చేస్తానని ప్రకటించింది. ఈ హిందూ కోర్టు భూ తగదాలు, ఆస్తి లావాదేవీలు, విడాకుల వంటి అంశాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తుందని ఏబీహెచ్‌ఎమ్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ శర్మ తెలిపారు. అంతేకాక ఈ ఏడాది అక్టోబర్ 2న ఈ హిందూ కోర్టుకు సంబంధించిన నియమ నిబంధనలను, కార్యకలాపాల వివరాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఇదిలావుండగా హిందూ కోర్టు ఏర్పాటు విషయంపై అలహబాద్ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాక ఈ కోర్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమర్పించాలని నోటీసులు కూడా జారీ చేసింది. -
ఓ మహాత్మా! ఓ మహర్షి!!
సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ ఈ రోజు అంటే, 1948, జనవరి 30వ తేదీన నాథూరామ్ గాడ్సే అనే ఆరెస్సెస్ కార్యకర్త హత్య చేశారనే వార్తను ఆకాశవాణిలో ప్రకటించినప్పుడు అప్పటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆకాశవాణిలో మాట్లాడుతూ ‘మన జీవితాల నుంచి ఓ దివ్య జ్యోతి వెళ్లిపోయింది. అంతటా చీకట్లు కమ్ముకున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఫిబ్రవరి 2వ తేదీన రాజ్యాంగ పరిషత్‌లో నెహ్రూ, గాంధీ గురించి అద్భుతంగా మాట్లాడారు. ‘ఆయన జీవితానికి ఓ పిచ్చోడు ముగింపు పలికాడు. ఇంతటి ఘోరానికి పాల్పడ్డ ఆ వ్యక్తిని నేను పిచ్చోడనే సంబోధిస్తా. గత కొన్ని ఏళ్లుగా, నెలలుగా దేశంలో విషం వ్యాపించింది. అది ప్రజల మెదళ్లను కూడా ప్రభావితం చేస్తోంది. ఆ విషాన్ని మనం ఎదుర్కోవాల్సిందే. దాన్ని నామరూపాలు లేకుండా చేయాల్సిందే. పిచ్చిగానో, చెడుగానో దాన్ని అంతం చేయాలనుకోవడం పొరపాటు. మనల్ని వీడిపోయిన మన ప్రియతమ టీచరు దాన్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పాడో, అచ్చం అలాగే ఎదుర్కోవాలి’..........ఆకాశవాణిలో నెహ్రూ. ‘పోయిన ప్రముఖులకు నివాళి అర్పించడం సభలో ఆనవాయితో కావచ్చు. ఈ సందర్భంగా ఈ సభలో నేనుగానీ, ఇతరులుగానీ ఎక్కువ మాట్లాడటం సబబు కాకపోవచ్చు. నేను మాత్రం ఓ వ్యక్తిగా, ప్రభుత్వాధినేతగా సిగ్గుపడుతున్నాను. అమూల్యమైన సంపదను పరిరక్షించుకోవడంలో మనం విఫలమయ్యాం. గత కొన్ని నెలలుగా అనేక మంది అమాయకులు, మహిళలు, పిల్లలను రక్షించుకోవడంలో విఫలమవుతూ వస్తున్నాం. ఈ రోజు ఎంతో గొప్ప వ్యక్తిని రక్షించుకోలేకపోయామంటే అంతకన్నా సిగ్గుచేటు మనకు మరోటి లేదు. ఓ భారతీయుడు ఆయనపైకి చెయ్యెత్తినందుకు ఓ భారతీయుడిలా నేను సిగ్గుపడుతున్నాను. ఓ హిందువు ఆ పని చేసినందుకు ఓ హిందువుగా నేను సిగ్గుపడుతున్నాను. నిజంగా ఆ మహానుభావుడు ఎంతో బాధ పడి ఉంటారు. ఆయన బోధనా మార్గంలో నడవాల్సిన ఈ తరమే విఫలమైనందుకు ఆయన బాధ పడి ఉంటారు. ఆయన చూపిన మార్గాన్ని కాదని మరో మార్గాన మనం నడుస్తున్నందుకు ఆయన బాధ పడి ఉంటారు. ఆయన చేతులు పట్టుకున్న పిల్లాడి చేతులే ఆయన్ని పంపించినందుకు ఆయన బాధ పడి ఉంటారు.’ రాజ్యాంగ పరిషత్’ సభలో జవహర్ లాల్ నెహ్రూ చేసిన ప్రసంగంలోని ఓ భాగాన్ని గాంధీకి నివాళిగా ఇక్కడ ఇస్తున్నాం. -
బాలకృష్ణ సరసన త్రిష!
-
బాలకృష్ణ సరసన త్రిష!
హీరో నందమూరి బాలకృష్ణ అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయ రంగంలో మంచి జోరుమీదున్నారు. 'లెజెండ్' సినిమాతో సూపర్‌హిట్‌ని సొంతం చేసుకున్న బాలయ్య, ఆ వెంటనే ప్రత్యక్ష రాజకీయాలలో అడుగుపెట్టి హిందూపురం శాసనసభ స్థానం నుంచి కూడా గెలుపొందారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించినా బాలయ్యకు సినిమా రంగాన్ని వదిలిపెట్టే ఉద్దేశం మాత్రంలేదు. ఈ విధంగా వరుస విజయాలు సొంతం చేసుకున్న బాలయ్య అదే జోరు మీద కొత్త దర్శకుడు సత్యదేవ దర్శకత్వంలో తన కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది బాలయ్య 98వ చిత్రం. ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష హీరోయిన్గా నటించబోతోంది. తొలిసారిగా త్రిష బాలకృష్ణతో నటించనుంది. ప్రముఖ వ్యాపారవేత్త రుద్రపతి రమణరావు నిర్మాతగా భారా బడ్జెట్‌తో యువ దర్శకుడు సత్యదేవ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతోంది. ఈ సినిమాలో త్రిష నటించడం ఖరారైన తరువాత, బాలకృష్ణతో నటించడం తనకెంతో సంతోషంగా ఉందని ఆమె ట్విట్ చేశారు. అంతేకాకుండా బాలయ్య సరసన తొలిసారిగా నటించడం తనకు ఆనందం కలిగిస్తోందని తెలిపారు. ఈ సినిమాలో త్రిషతోపాటు మరో హీరోయిన్గా అంజలి నటిస్తోంది. పూర్తి యాక్షన్, ఎంటర్టైనర్ అయిన ఈ చిత్రం షూటింగ్ తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజు జూన్ 2న లాంచనంగా ప్రారంభమవుతుంది. బాలకృష్ణ చాలా పవర్ఫుల్ పాత్ర పోషించే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మాత్రం తన పుట్టిన రోజు జూన్ పది నుంచి మొదలు పెడతారు. ఈ చిత్రానికి 'గాడ్సే' అనే పేరు ఖరారు చేసినట్లు సినీవర్గాల సమాచారం. మణిశర్మ సంగీతం అందిస్తారు.