చిన్ని బాపూ.. అదిరెను గెటప్పు..
గుంటూరు డెస్క్: పంచె కట్టు, చేతిలో కర్ర, ముక్కుపై జారిపోతున్న కళ్లజోడు, చూపులో గాంభీర్యంతో ఈ బుడతడు ఎంత చక్కగా మహాత్మాగాంధీ వేషధారణలో ఇమిడిపోయాడో కదూ... మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆదివారం మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ నేతృత్వంలో నగరంలో విద్యార్థులు, స్వాతంత్య్ర సమరయోధులతో ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా కన్న స్కూల్ విద్యార్థి అక్మల్ గాంధీజీ వేషధారణతో వచ్చి ఇలా బాపూ ఒడిలో కూర్చుని అందరినీ ఆకట్టుకున్నాడు. – ఫొటో: రూబెన్ బెసాలియేల్