ఈయన మన గాంధీ తాత కాదు.. | Gandhi in karachi mobile market | Sakshi
Sakshi News home page

ఈయన మన గాంధీ తాత కాదు..

Published Tue, Dec 26 2017 8:06 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

 Gandhi in karachi mobile market - Sakshi

కరాచీ : మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారంటారు. అయితే ఈ ఫొటో చూస్తే మాత్రం ఈ మాట నిజమే అనిపిస్తోంది. ఈ ఫొటోలో ఉన్నది మన జాతిపిత మహాత్మా గాంధీ అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే ఈయన గాంధీని పోలిన ఓ పాకిస్థాన్‌ వృద్ధుడంటా.. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన అసిమ్‌ రజాక్‌ అనే వ్యక్తి తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశాడు.

‘భారత జాతిపిత కరాచీ మొబైల్‌ మార్కెట్‌లో కన్పించాడని’ ట్వీట్‌ చేశాడు. తలపై టోపీ, వంటిపై దుస్తులు తప్ప ముఖం, అద్దాలు చూస్తే ఈ పెద్దాయన అచ్చం గాంధీలా ఉన్నాడు కదా.! అయితే ఇది నిజంగా కరాచీ వ్యక్తికి చెందినదా లేదా అని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement