Ex-Italian PM Leaves Over Rs 900 Crore To 33-Year-Old Girlfriend In His Will - Sakshi
Sakshi News home page

మూడేళ్ల పరిచయానికి రూ.900 కోట్లు ఇచ్చేశాడు..!

Published Mon, Jul 10 2023 1:44 PM | Last Updated on Mon, Jul 10 2023 1:58 PM

Ex Italian PM Leaves Over 900 Crore To 33 Year Old Girlfriend In His Will - Sakshi

బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీ గత నెలలో మరణించిన సంగతి తెలిసిందే. చనిపోయే ముందు ఆయన తన గార్ల్‌ఫ్రెండ్‌ మార్టా ఫాసినా(33)కి రూ.900 కోట్ల రూపాయలను ఇచ్చారు. ఈ మేరకు ఆస్పత్రి బెడ్‌పైనే వీలునామా రాసి సంతకం చేశారు. బ్రిటన్‌కు మూడు సార్లు ప్రధానిగా ఉన్న ఆయన ఆస్తి మొత్తం ఆరు బిలియన్లకు పైనే ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది.

మార్టా ఫాసినాతో బెర్లుస్కోనికి 2020 నుంచి గత మూడేళ్లుగా పరిచయం ఏర్పడింది. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఫాసినా ఇటలీ పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు. బెర్లుస్కోనీ స్థాపించిన ఫోర్జా ఇటాలియా పార్టీలో  సభ్యురాలుగా కూడా ఉన్నారు. ఇరువురి మధ్య స్నేహం తర్వాత మరింత దగ్గరయ్యారు. 

అయితే.. బెర్లుస్కోనీ వ‍్యాపారాన్ని ఆయన ఇద్దరు పిల్లలు మెరీనా, పీర్ సిల్వియోలు చూసుకుంటున్నారు. వ‍్యాపార వాటాలో 53 శాతం కుటుంబంపై ఉంది. వీలునామాలో తన సోదరుడు పాలోకు 100 మీలియన్ల యూరోలను కేటాయించారు బెర్లుస్కోనీ. మాఫియాతో సహవాసం చేసి, జైలు శిక్ష అనుభవించిన తన పార్టీ మాజీ సెనేటర్ మార్సెల్లో డెల్ ఉట్రీకి 30 మీలియన్ల యూరోలను ఇచ్చారు.

ఉన్న ఆస్తిలో పిల్లలు మెరీనా, పియర్ సిల్వియోలకు సమాన భాగాలుగా పంచి  ఇస్తున్నట్లు వీలునామా రాసిన బెర్లుస్కోనీ.. మిగిలిన ఆస్థిని ఐదుగురు పిల్లలు మెరీనా, పీర్ సిల్వియో, బార్బరా, ఎలియోనోరా, లుయిగికి సమాన భాగాలుగా ఇస్తున్నట్లు రాశారు. మార్టా ఫాసినాను అధికారికంగా పెళ్లి చేసుకోకున్నప్పటికీ వీలునామాలో మాత్రం భార్యగా పేర్కొని ఆస్తిని కేటాయించారు. 

ల్యుకేమియాతో బాధపడుతున్న బెర్లుస్కోనీ 86 ఏళ్ల వయసులో జూన్‌ 12న మరణించారు. వ్యాపార వేత్తగా, ప్రధానిగా రాణించిన ఆయనపై పలు కేసులు కూడా ఉన్నాయి. పన్నుల ఎగవేతకు సంబంధించిన కేసులో ఆరేళ్ల పాటు రాజకీయం నుంచి నిషేధానికి కూడా గురయ్యారు.

ఇదీ చదవండి: దయా హృదయం-మహా ఖరీదు.. అస్థికలు భద్రపరిచేందుకు అద్దె రూ.63 లక్షలు, ఫ్యామిలీ ప్యాక్‌ కూడా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement