వాషింగ్టన్/టేన్నసీ: సాధారణంగా మనుషుల కన్నా జంతువులకు విశ్వాసం, ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. వాటి పట్ల కాస్త ఆదరణ చూపిస్తే చాలు.. జీవితాంతం మనల్ని అంటి పెట్టుకుని ఉంటాయి. కుక్కల్లో ఈ విశ్వాసం పాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది పెంపుడు జంతువుగా కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఎందుకంటే అవి మన నుంచి ప్రేమను తప్ప ఇంకేం ఆశించవు. మరి కొందరైతే కుటుంబ సభ్యులతో సమానంగా వీటిని చూసుకోవడమే కాక.. ఏకంగా వాటికి ఆస్తిలో వాటా కూడా ఇస్తారు. తాజాగా ఇలాంటి సంఘటన అమెరికాలోని టేన్నసీలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన వీలునామాలో పెంపుడు కుక్క పేర మీద 5 మిలియన్ డాలర్ల ఆస్తి రాశాడు. మన కరెన్సీలో చెప్పాలంటే 36,29,55,250 రూపాయలు.
వివరాలు.. టేన్నసీకి చెందిన బిల్ డోరిస్(84) అనే వ్యక్తి గత ఎనిమిదేళ్లుగా లులు అనే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ట్రావేలింగ్ హాబీ కల డోరీస్ తరచుగా ప్రయాణాలు చేసేవాడు. ఆ సమయంలో పెంపుడు కుక్క లులుని తన స్నేహితుడు మార్ట్ బర్టన్ వద్ద వదిలేసి వెళ్లేవాడు. ఈ క్రమంలో గతేడాది డోరిస్ మరణించాడు. అప్పటి నుంచి లులు బాధ్యతని మార్టనే తీసుకున్నాడు. ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం డోరిస్ లాయర్ ఆయన చనిపోవడానికి ముందు రాసిన వీలునామాను మార్ట్‌కి అందించాడు. దానిలో డోరిస్ తన పెంపుడు కుక్క లులు పేరిట 5 మిలియన్ డాలర్ల ఆస్తి రాశాడు.
ఈ మొత్తాన్ని లులు సంరక్షణకు, దాని అవసరాలు తీర్చడం కోసం వాడాలని కోరాడు. ఇక లులు బాధ్యతని తన స్నేహితుడు మార్ట్ తీసుకోవాల్సిందిగా వీల్లులో అభ్యర్థించాడు డోరిస్. లులు పేరు మీద ఉన్న ఆస్తికి అతను ట్రస్టీగా ఉంటాడని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా మార్ట్ మాట్లాడుతూ.. ‘‘డోరిస్ రాసిన వీలునామా చూసి నేను ఆశ్చర్యపోయాను. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. డోరిస్, లులు ఎంతో క్లోజ్‌గా ఉండేవాళ్లు. తన బిడ్డలానే చూసేవాడు’’ అని తెలిపారు.
చదవండి: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కుక్క!
వాలెంటైన్స్ డే: ఫ్రీగా విడాకులు ఇప్పిస్తాం
Comments
Please login to add a commentAdd a comment