వీలునామాలో ఆస్తులను పంచిన రతన్ టాటా
ముంబై: పారిశ్రామికవేత్త రతన్ టాటా తన దాతృత్వాన్ని చనిపోయాక కూడా చాటుకున్నారు. తన రూ.10 వేల కోట్ల ఆస్తుల్లో తోబుట్టువులకే కాదు, పెంపుడు శునకం టిటో, పనిమనిషి సుబ్బయ్య, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు కూడా వాటాలు పంచుతూ వీలునామా రాశారు. టాటా గ్రూప్ చైర్మన్ మాతృసంస్థ టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఈ నెల 9వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే.
తనకెంతో ప్రీతిపాత్రమైన జర్మన్ షెపర్డ్ శునకం టిటో సంరక్షణ బాధ్యతలను జీవితకాలం పాటు వంట మనిషి రజన్ షా చూసుకోవాలని కోరారు. ఆస్తుల్లో సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరీమణులు షిరీన్, డియానా జీజాభాయ్‌లకు కొంత కేటాయించారు. టాటా సన్స్‌లో వాటాను రతన్ టాటా ధార్మిక ఫౌండేషన్‌కు బదిలీ చేయాలని కోరారు. విల్లుపై బాంబే హైకోర్టు విచారణ జరపనుందని అధికారులు తెలిపారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు చెందిన గుడ్‌ఫెలోస్‌లో పెట్టిన పెట్టుబడిని వదిలేయాలని, విదేశాల్లో చదువుకునేందుకు నాయుడుకిచ్చిన రుణం మాఫీ చేయాలని వీలునామాలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment