Dead woman
-
పిల్లలు లేరు కదా అనుకుంటే.. బంధువులే రాబంధువులై..
Viral Video: మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోయాన్నదానికి నిదర్శనం ఈ ఘటన. మనిషి. మనీ షీగా మారిపోయిన ఉదంతం ఇది. చనిపోయిన వ్యక్తి నుంచి ఆస్తి కాజేసే ఉద్దేశంతో బంధువులు.. ఆ శవం చేత కాలి వీలునామా కాగితాలపై వేలిముద్ర వేయించారు. ఈ దుర్మార్గానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ కాగా.. పోలీసులు ఆ వీడియోపై స్పష్టత ఇచ్చారు. వయసు పైబడి ఓ మహిళ కన్నుమూసింది. ఆమె భర్త అంతకు ముందు కొన్నేళ్ల కిందటే చనిపోగా.. వాళ్లకు సంతానం లేదని తెలుస్తోంది. పిల్లలు లేకపోవడంతో బంధువుల పిల్లలను ఆ దంపతులు ఆప్యాయంగా చూసుకునేవాళ్లు. ఈ క్రమంలో.. వాళ్ల ఆస్తి మీద ఆ బంధువులకు దుర్బుద్ధి పుట్టినట్లుంది. ఆమె బావ కొడుకులు ఆమె మృతదేహన్ని శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. కాస్త దూరం వెళ్లాక.. ఆమె మృతదేహాన్ని కారు నుంచి బయటకు లాగి, ఓ లాయర్ సమక్షంలో వీలునామా కాగితాల మీద ఆమె వేలిముద్రలు తీసుకున్నారు. ఆమె పేరిట ఉన్న ఓ పెద్ద దుకాణం, ఇంటిని తమ పేరిట మార్చేసేందుకు అలా డాక్యుమెంటరీని ఫోర్జరీ చేసే యత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆమె దూరపు బంధువైన ఓ వ్యక్తికి, ఆ వేలిముద్ర పై అనుమానం కలిగింది. ఎందుకంటే ఆమె చదువుకుంది, సంతకం చేయగలదు కాబట్టి. అయితే ఆధారాలు లేకపోవడంతో.. నిర్ధారించుకోలేకపోయాడు. కానీ, ఆయన అనుమానం నిజమేనే విషయం ఇప్పుడు బయటపడింది. ఆస్తుల పంపకాల్లో తేడాలు రావడంతో.. వాళ్లలో ఒకరు ఆ వీడియో బయటపెట్టాడు. ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. 2021, మే 8వ తేదీన కమలా దేవి అనే మహిళ మరణించగా.. ఆమె బంధువులు చేసిన పని తాజాగా ఓ వీడియో ద్వారా నెట్లో వైరల్ అవుతోంది. దీంతో ఆ బంధువు శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు వీడియోపై దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో పాకిస్తాన్లోది అంటూ ప్రచారం జరిగినా.. చివరకు మన దేశంలోనిదేనని ఆగ్రా పోలీసులు ధృవీకరించారు. Video of man taking thumb impression of deceased woman lying in car goes viral. pic.twitter.com/mZjaz2BvFE — Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) April 10, 2023 Disclaimer: ఈ వీడియో కేవలం విషయం తెలియజేయడానికే.. ఎవరినీ ఇబ్బందిపెట్టడానికి కాదు -
మరణించిన మహిళ.. ఎన్నికల్లో గెలిచింది!
పట్నా: ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం మరణించిన మహిళ.. పంచాయతీ ఎన్నికల్లో గెలిచింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె పంచాయతీ సమితి సభ్యురాలుగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. ఈ విస్తుపోయే ఘటన బిహార్లో వెలుగుచూసింది. బిహార్లోని సీతామర్తి జిల్లాకు చెందిన మిత్లేష్ దేవి అనే మహిళను తొమ్మిదేళ్ల క్రితం ఆమె భర్త సికందర్ ముఖియా హత్య చేశాడు. పోలీసుల రికార్డుల ప్రకారం అప్పటి నుంచి సికందర్ పరారీలో ఉన్నాడు. అయితే అతను స్వేచ్ఛగా బయటతిరుగుతూ గుడియా దేవి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల జరిగిన టికౌలీ పంచాయతీ ఎన్నికల్లో సికందర్ తన రెండో భార్య గుడియాను మొదటి భార్య మిత్లేష్ దేవి పేరుతో నామినేషన్ వేయించాడు. అంతేగాక గుడియాను మొదటి భార్య మిత్లేష్ దేవిగా కోర్టులో హాజరుపరిచి.. తాను బతికేఉన్నానని, తన భర్తను నిర్దోషిగా ప్రకటించాలని చెప్పించేందుకు పథకం వేశాడు. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించారు. -
'చనిపోయిన' యువతి తిరిగొచ్చింది!
పుడుకొట్టై(తమిళనాడు): కొన్ని నెలల క్రితం ఓ యువతి మరణించిందనుకున్నారు. ఆ విషయాన్ని తల్లి దండ్రులు ధ్రువీకరించారు. దహన కాండ కార్యక్రమం కూడా పూర్తి చేశారు. అయితే ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ యువతి మళ్లీ ఇంటికి వచ్చింది. మరణించిన ఆ అమ్మాయి తిరిగి ఎలా వచ్చిందని తల్లి దండ్రులు కూడా ఆశ్చర్యానికి లోనైయ్యారు. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని నెలల క్రితం తమిళనాడు రాష్ట్రంలోని పుడుకొట్టైకి చెందిన విన్నీల(21) అనే యువతి అదృశ్యమైంది. తనకు తల్లి దండ్రులు పెళ్లి చేయడం లేదని భావించిన ఆమె నిరాశకు గురై ఇంటి నుంచి పారిపోయింది. దీనిపై ఆ యువతి పేరెంట్స్ పోలీసుల్ని ఆశ్రయించడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఓ అమ్మాయి మృతదేహం లభించింది. విన్నీల కేసు దర్యాప్తు నేపథ్యంలోఆ విషయాన్ని ఆమె తల్లి దండ్రులకు తెలియజేశారు. అయితే ఇక్కడే వారుపాటు చేశారు. ఆ అమ్మాయిని తన కుమార్తెగా గుర్తించిన వారు ఆ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ యువతి సోమవారం తిరిగి ఇంటికి రావడంతో ఆమె తల్లిదండ్రులు ఆశ్యర్యానికి గురైయ్యారు. తన తల్లిదండ్రులు పెళ్లి చేయని కారణంగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు ఆ యువతి పోలీసులకు తెలిపింది. ఆ యువతిని ముందు కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు.