'చనిపోయిన' యువతి తిరిగొచ్చింది! | 'Dead' woman reappears | Sakshi
Sakshi News home page

'చనిపోయిన' యువతి తిరిగొచ్చింది!

Published Tue, Oct 28 2014 4:54 PM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

'చనిపోయిన' యువతి తిరిగొచ్చింది!

'చనిపోయిన' యువతి తిరిగొచ్చింది!

పుడుకొట్టై(తమిళనాడు): కొన్ని నెలల క్రితం ఓ యువతి మరణించిందనుకున్నారు. ఆ విషయాన్ని తల్లి దండ్రులు ధ్రువీకరించారు. దహన కాండ కార్యక్రమం కూడా పూర్తి చేశారు. అయితే ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ యువతి మళ్లీ ఇంటికి వచ్చింది. మరణించిన ఆ అమ్మాయి తిరిగి ఎలా వచ్చిందని తల్లి దండ్రులు కూడా ఆశ్చర్యానికి లోనైయ్యారు. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని నెలల క్రితం తమిళనాడు రాష్ట్రంలోని పుడుకొట్టైకి చెందిన విన్నీల(21) అనే యువతి అదృశ్యమైంది.  తనకు తల్లి దండ్రులు పెళ్లి చేయడం లేదని భావించిన ఆమె నిరాశకు గురై ఇంటి నుంచి పారిపోయింది. దీనిపై ఆ యువతి పేరెంట్స్ పోలీసుల్ని ఆశ్రయించడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఓ అమ్మాయి మృతదేహం లభించింది. విన్నీల కేసు దర్యాప్తు నేపథ్యంలోఆ విషయాన్ని ఆమె తల్లి దండ్రులకు తెలియజేశారు. అయితే ఇక్కడే వారుపాటు చేశారు. ఆ అమ్మాయిని తన కుమార్తెగా గుర్తించిన వారు ఆ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.

 

ఆ యువతి సోమవారం తిరిగి ఇంటికి రావడంతో ఆమె తల్లిదండ్రులు ఆశ్యర్యానికి గురైయ్యారు. తన తల్లిదండ్రులు పెళ్లి చేయని కారణంగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు ఆ యువతి పోలీసులకు తెలిపింది. ఆ యువతిని ముందు కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement