
సాక్షి ప్రతినిధి, చెన్నై: అనాథ శవాన్ని పిల్లి పీక్కుతింటున్నా పట్టించుకోని దారుణ సంఘటన కోయంబత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. కోయంబత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మహిళా వార్డులో ఒక మహిళా రోగి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మృతిచెందింది. అయితే మృతురాలి వివరాలు తెలియకపోవడంతో మార్చురీకి తరలించకుండా వార్డులో ఒక మూల నిర్లక్ష్యంగా నేలపై పడేశారు. ఆస్పత్రి పరిసరాల్లో తిరిగే పిల్లి శవం కాలి భాగాన్ని తినడం ప్రారంభించింది. పరిసరాల్లోని రోగులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఆందోళన చేపట్టారు. దీంతో శవాన్ని మార్చురీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment