మరణించిన మహిళ.. ఎన్నికల్లో గెలిచింది! | Dead Woman Elected As Panchayat Samiti Member In Bihar | Sakshi
Sakshi News home page

మరణించిన మహిళ.. ఎన్నికల్లో గెలిచింది!

Published Fri, Jun 24 2016 4:52 PM | Last Updated on Wed, Sep 5 2018 3:33 PM

Dead Woman Elected As Panchayat Samiti Member In Bihar

పట్నా: ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం మరణించిన మహిళ.. పంచాయతీ ఎన్నికల్లో గెలిచింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె పంచాయతీ సమితి సభ్యురాలుగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. ఈ విస్తుపోయే ఘటన బిహార్లో వెలుగుచూసింది.

బిహార్లోని సీతామర్తి జిల్లాకు చెందిన మిత్లేష్ దేవి అనే మహిళను తొమ్మిదేళ్ల క్రితం ఆమె భర్త సికందర్ ముఖియా హత్య చేశాడు. పోలీసుల రికార్డుల ప్రకారం అప్పటి నుంచి సికందర్ పరారీలో ఉన్నాడు. అయితే అతను స్వేచ్ఛగా బయటతిరుగుతూ గుడియా దేవి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల జరిగిన టికౌలీ పంచాయతీ ఎన్నికల్లో సికందర్ తన రెండో భార్య గుడియాను మొదటి భార్య మిత్లేష్ దేవి పేరుతో నామినేషన్ వేయించాడు. అంతేగాక గుడియాను మొదటి భార్య మిత్లేష్ దేవిగా కోర్టులో హాజరుపరిచి.. తాను బతికేఉన్నానని, తన భర్తను నిర్దోషిగా ప్రకటించాలని చెప్పించేందుకు పథకం వేశాడు. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement