లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఓటింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మొదటి దశలో బీహార్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు (నవాడ, జముయి, ఔరంగాబాద్, గయ) ఓటింగ్ జరగనుంది. మరోవైపు బీహార్‌లో విచిత్రమైన పేర్లు కలిగిన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ పార్టీల పేర్లు అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి. ఈ జాబితాలో ఆల్ హింద్ ఫార్వర్డ్ బ్లాక్ (రివల్యూషనరీ), స్మార్ట్ పార్టీ, లాగ్ పార్టీ, న్యూమరికల్ పార్టనర్‌షిప్ పార్టీ మొదలైనవి ఉన్నాయి. ప్రముఖ నేత చిరాగ్ పాశ్వాన్ బావమరిది గౌతమ్ పాశ్వాన్ సమజ్దార్ పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేశారు. భారతీయ ఏక్తా పార్టీ నుంచి అనిల్ చౌదరి, భారతీయ లోక్ చేతన పార్టీ నుంచి గుడియా దేవి, రాష్ట్రీయ జన సంభవ పార్టీ నుంచి శ్రవణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో ఎన్నికల సంఘం రద్దు చేసింది.
బీహార్‌లోని గయ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు విచిత్రమైన పేర్లు కలిగిన మూడు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో భారతీయ లోక్ చేతన పార్టీకి చెందిన శివశంకర్ పోటీకి దిగారు. డెమోక్రటిక్ సమాజ్ వాదీ పార్టీ నుంచి ధీరేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఔరంగాబాద్ లోక్‌సభ స్థానం నుండి లాగ్ పార్టీకి చెందిన అజిత్ శర్మ నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానం నుంచి జనజాగరణ్ పార్టీకి చెందిన శంభు ఠాకూర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే వీరి నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment