Jamui
-
ఎన్నికల బరిలో విచిత్ర పార్టీలు!
లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఓటింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మొదటి దశలో బీహార్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు (నవాడ, జముయి, ఔరంగాబాద్, గయ) ఓటింగ్ జరగనుంది. మరోవైపు బీహార్‌లో విచిత్రమైన పేర్లు కలిగిన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ పార్టీల పేర్లు అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి. ఈ జాబితాలో ఆల్ హింద్ ఫార్వర్డ్ బ్లాక్ (రివల్యూషనరీ), స్మార్ట్ పార్టీ, లాగ్ పార్టీ, న్యూమరికల్ పార్టనర్షిప్ పార్టీ మొదలైనవి ఉన్నాయి. ప్రముఖ నేత చిరాగ్ పాశ్వాన్ బావమరిది గౌతమ్ పాశ్వాన్ సమజ్దార్ పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేశారు. భారతీయ ఏక్తా పార్టీ నుంచి అనిల్ చౌదరి, భారతీయ లోక్ చేతన పార్టీ నుంచి గుడియా దేవి, రాష్ట్రీయ జన సంభవ పార్టీ నుంచి శ్రవణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో ఎన్నికల సంఘం రద్దు చేసింది. బీహార్‌లోని గయ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు విచిత్రమైన పేర్లు కలిగిన మూడు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో భారతీయ లోక్ చేతన పార్టీకి చెందిన శివశంకర్ పోటీకి దిగారు. డెమోక్రటిక్ సమాజ్ వాదీ పార్టీ నుంచి ధీరేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఔరంగాబాద్ లోక్‌సభ స్థానం నుండి లాగ్ పార్టీకి చెందిన అజిత్ శర్మ నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానం నుంచి జనజాగరణ్ పార్టీకి చెందిన శంభు ఠాకూర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే వీరి నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
PM Narendra Modi: అవినీతిపరులు ఒక్కటవుతున్నారు
జమూయి/కూచ్‌బెహార్: అవినీతి కేసుల్లో ఇరుక్కున్నవారంతా మోదీపై యుద్ధం పేరిట ఒక్కటవుతున్నారని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆ కూటమిలో ఉన్న భాగస్వాములంతా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నవారేనని గుర్తుచేశారు. అవినీతిపరులను జైలుకు పంపించాలా? వద్దా? అని ప్రశ్నించారు. తాను అవినీతి నిర్మూలన గురించి మాట్లాడుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం మోదీని ఓడించాలని ప్రజలకు పిలుపునిస్తున్నాయని తప్పుపట్టారు. గురువారం బిహార్‌లోని జమూయి జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. మన దేశానికి ముప్పుగా మారిన సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి దాడులు చేస్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. చిన్నదేశాల నుంచి ముష్కరులు వచి్చపడుతున్నా చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఇతర దేశాల జోక్యాన్ని అనుమతించారని మండిపడ్డారు. దీనివల్ల భారత్‌కు బలహీన దేశమన్న చెడ్డపేరు వచి్చందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాను సులువుగా టార్గెట్ చేయొచ్చన్న అభిప్రాయం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకం వల్ల ప్రపంచం దృష్టిలో భారత్ పేద దేశంగా ముద్రపడిందని అన్నారు. యూపీఏ ప్రభుత్వ పాలనలో 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసులో అమెరికా జోక్యాన్ని అనుమతించడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. సీఏఏపై విపక్షాల తప్పుడు ప్రచారం పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. భరతమాతపై విశ్వాసం ఉన్నవారికి భారత పౌరసత్వం కల్పిస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. ఆయన పశి్చమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. అవినీతిపరులను కాపాడేందుకు ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని విమర్శించారు. -
రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో
ప్రభుత్వ ఆపీస్లో పై అధికారి తలబిరుసుతనంతో తన కింద పనిచేసిన వాళ్లపై చేయిచేసుకోవడం వంటి పలు ఘటనలు గురించి విన్నాం. ఇటీవలే ఒక నర్సు ఆలస్యంగా వచ్చినందుకు ఒక ఆరోగ్యాధికారి దాడి చేసేందుకు ప్రయత్నించిన వీడియోలను చూశాం. లక్షల్లోనూ లేదా కోట్ల ఆస్తి గురించి దెబ్బలాడుకున్నా ఓ అర్థం ఉంటుంది. కానీ కేవలం రూ 500 కోసం కొట్టుకోవడం గురించి విన్నారా. పైగా ఆపేందుకు ప్రయత్నించిన కూడా తగ్గేదే లే అన్నట్టుగా ఘోరంగా కొట్టుకున్నారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే....బీహార్‌లో జాముయ్ జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్‌లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు ఒకరినోకరు జుట్టుపట్టుకుని లాక్కుంటూ దారుణంగా కొట్టుకున్నారు. ఆఖరికి ఒక వ్యక్తి జోక్యం చేసుకుని ఆపేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ ఇద్దరూ చేతులతోనూ, చెప్పులతోను ఘోరంగా కొట్టుకున్నారు. అయితే ఆశా వర్కర్ రింటూ కుమారి బీసీజీ వ్యాక్సిన్ షాట్ కోసం ఆక్సిలరీ నర్సు మిడ్వైఫ్(ఏఎన్ఎం) రంజన కుమారి వద్దకు నవజాత శిశువును తీసుకెళ్లినప్పుడే ఈ వివాదం తలెత్తింది. అయితే వ్యాక్సిన్ వేసేందుకు ఆ ఆక్సిలరీ నర్సు రూ 500 డిమాండ్ చేయడంతో ఈ గోడవ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్లైన్ వైరల్‌గా మారింది. దీంతో ఆస్పత్రి ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఆ కార్యకర్తలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. ये दृश्य @NitishKumar के स्वास्थ्य विभाग की असलियत की कहानी बयान कर रहा हैं जहां एक टीका के बदले 500 घूस की माँग पर एएनएम और आशा सेविका ऐसे उलझ गयी @ndtvindia @Anurag_Dwary @mangalpandeybjp @PratyayaIAS pic.twitter.com/98JrknbpMk — manish (@manishndtv) January 24, 2022 (చదవండి: లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు!) -
జమూయీ.. గెలుపెవరిదోయి?
బిహార్‌లోని జమూయీ లోక్‌సభ స్థానంలో 11 శాతంగా ఉన్న మహా దళితులు, అదే సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీలు ఎటు మొగ్గితే విజయం అటువైపే అనేది విశ్లేషకుల అంచనా. అయితే ఈసారి ఈ రెండు సామాజిక వర్గాలనూ ప్రభావితం చేసేందుకు అన్ని పార్టీలూ తీవ్రంగా యత్నిస్తున్నాయి. అందులో భాగంగానే జమూయీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నరేంద్రమోదీ పర్యటించి, కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏ మేలూ చేయలేదనీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ని అవమానించిందనీ మాట్లాడారు. ఇది ప్రధానంగా అక్కడ మహా దళితుల ఓట్లను దృష్టిలో పెట్టుకొని ప్రస్తావించినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ కూటమికే అనుకూలం.. ఎన్డీయే పార్టీల పొత్తులో భాగంగా ఈ స్థానం రామ్‌విలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ఖాతాలోకి వెళ్లింది. ఈ స్థానం నుంచి పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ని అభ్యర్థిగా ప్రకటించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చిరాగ్ ఆర్జేడీకి చెందిన సుధాన్షు కుమార్ భాస్కర్ని ఓడించారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీకి చెందిన భూదేవ్ చౌధరీని ముఖాముఖి ఢీకొంటున్నారు. ఈ నియోజకవర్గంలో 90 శాతం గ్రామీణ ప్రాంతాల జనాభా ఉండగా, పట్టణ ప్రజలు 10 శాతంగా ఉన్నారు. ఇందులో ఎస్సీలు 17 శాతం, ఎస్టీలు 3 శాతం ఉన్నారు. బిహార్‌లోని ఆర్జేడీ–కాంగ్రెస్ మహా కూటమిలో ఆర్ఎల్ఎస్పీ కూడా భాగస్వామిగా ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థిపై 11 శాతం ఓట్ల ఆధిక్యంతో చిరాగ్ పాశ్వాన్ విజయం సాధించారు. ఆర్జేడీకి 25.71 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన జేడీయూ 25.60 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. అయితే ఈసారి ఎన్నికల్లో జేడీయూ ఎల్జేపీకి మద్దతివ్వడంతో ఓట్ల శాతం గణనీయంగా పెరగవచ్చునని భావిస్తున్నారు. కాంగ్రెస్–ఆర్జేడీల మద్దతు ఆర్ఎల్ఎస్పీకి ఉన్నప్పటికీ, జేడీయూ, ఎల్జేపీ, బీజేపీ కూటమికి 30 శాతం ఓట్లు అ«ధికంగా రావొచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఎన్సీపీ బీఎస్పీ అభ్యర్థులను రంగంలోకి దించినప్పటికీ వారి ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. ఆ రెండు వర్గాల మొగ్గును బట్టే ఫలితం 2014 ఎన్నికల్లో ఎల్జేపీకి చెందిన చిరాగ్ పాశ్వాన్ 85 వేల ఓట్ల మెజారిటీతో ఇక్కడి నుంచి గెలుపు కైవసం చేసుకున్నారు. మహా దళిత్ జనాభా 11 శాతంపైగా ఉన్న ఏడు జిల్లాల్లో జమూయీ ఒకటి. అదే సంఖ్యలో ఉన్న ముస్లింలు, మహా దళితులు కలిసి ఫలితాలను ఎటువైపైనా మార్చగలిగే స్థితిలో ఉన్నారు. 2008 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం జమూయీ స్థానానికి మూడోసారి ఎన్నికలు జరగనున్నాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థి భూదేవ్ చౌధరి, ఆర్జేడీ అభ్యర్థి శ్యాం రజక్‌పై 29,797 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఈసారి భూదేవ్ చౌధరి ఆర్ఎల్ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జమూయీ లోక్‌సభా నియోజకవర్గ పరిధి జామూయీ, ముంగేర్, షేక్ పురా మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 14,04,016 కాగా మహిళలు 6,51,501, పురుషులు 7,52,515 మంది ఉన్నారు. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన నావ్డా, గయ, ఔరంగాబాద్‌తో పాటు జమూయీ నియోజకవర్గంలో మొదటి దశలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. జమూయీ లోక్‌సభ నియోజకవర్గంలో తారాపూర్, షేక్‌పురా, సికింద్రా, జమూయీ, చకాయి, జన్హాతో కలిపి మొత్తం 6 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2014 ఎన్నికల్లో ఓట్ల శాతం ఎల్జేపీ : 36.8% ఆర్జేడీ : 25.7% జేడీయూ : 25.6% -
అసభ్య వీడియో తీసి చివరికిలా..
వాడు చేసింది ముమ్మాటికి నేరమే. ఆధారాలు రుజువైతే తక్కువలో తక్కువ మూడేళ్లు కారాగార శిక్ష పడుతుంది. కానీ జడ్జిగారి సూచన మేరకు 'రహస్య వీడియో' ప్రేమికుడు తన ప్రేయసిని వివాహం చేసుకున్నాడు. సంకెళ్లున్న చేతులతోనే తాళికట్టి మళ్లీ జైలుకెళ్లాడు. అసలేం జరిగిందంటే.. బిహార్‌లోని జముయికి చెందిన దిగ్విజయ్ కుమార్ పాశ్వాన్ అనే యువకుడికి, అదే ఊళ్లో ఉండే పూజ అనే యువతికి మధ్య నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఒకదశలో పెళ్లిచేసుకుందామనుకున్న వాళ్లు ఏవో అవాంతరాలొచ్చి ఆగిపోయారు. కాగా, గత వారం ప్రేమికులిద్దరూ తగువులాడుకున్నారు. ఒకరినొకరు తీవ్రంగా దూషించుకుని, విడిపోయారు. పూజపై కక్ష కట్టిన దిగ్విజయ్.. ఆమెకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆనోటా ఈనోటా వీడియోల విషయం తెలుసుకున్న పూజ.. మాజీ ప్రేమికుడిపై పోలీసులకు ఫిర్యాదుచేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దిగ్విజయ్ ని అరెస్టు చేసి జముయి సివిల్ కోర్టులో ప్రవేశపెట్టారు. బాధితురాలు, నిందితుడి మధ్య నాలుగేళ్లుగా సాగిన ప్రేమ వ్యవహారం గురించి లాయర్ల ద్వారా తెలుసుకున్న జడ్జి గారు.. 'ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో' అని దిగ్విజయ్ కి సూచించారు. అందుకతను సరే అనడం, పూజ కూడా అంగీకారం తెలపడంతో శుక్రవారం ఓ ఆలయంలో వీరి వివాహం జరిగింది. చేతికి సంకెళ్లతోనే మూడు ముళ్లూ వేసిన దిగ్విజయ్ ని పోలీసులు మళ్లీ రిమాండ్ కు తరలించారు. పూజ తన అత్తారింటికి వెళ్లింది.