అసభ్య వీడియో తీసి చివరికిలా.. | judge asks 'obscene video' accused to marry the same girl: Bihar | Sakshi

అసభ్య వీడియో తీసి చివరికిలా..

Published Sun, Aug 21 2016 7:48 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

అసభ్య వీడియో తీసి చివరికిలా..

అసభ్య వీడియో తీసి చివరికిలా..

వాడు చేసింది ముమ్మాటికి నేరమే. ఆధారాలు రుజువైతే తక్కువలో తక్కువ మూడేళ్లు కారాగార శిక్ష పడుతుంది. కానీ జడ్జిగారి సూచన మేరకు 'రహస్య వీడియో' ప్రేమికుడు తన ప్రేయసిని..

వాడు చేసింది ముమ్మాటికి నేరమే. ఆధారాలు రుజువైతే తక్కువలో తక్కువ మూడేళ్లు కారాగార శిక్ష పడుతుంది. కానీ జడ్జిగారి సూచన మేరకు 'రహస్య వీడియో' ప్రేమికుడు తన ప్రేయసిని వివాహం చేసుకున్నాడు. సంకెళ్లున్న చేతులతోనే తాళికట్టి మళ్లీ జైలుకెళ్లాడు. అసలేం జరిగిందంటే..

బిహార్లోని జముయికి చెందిన దిగ్విజయ్ కుమార్ పాశ్వాన్ అనే యువకుడికి, అదే ఊళ్లో ఉండే పూజ అనే యువతికి మధ్య నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఒకదశలో పెళ్లిచేసుకుందామనుకున్న వాళ్లు ఏవో అవాంతరాలొచ్చి ఆగిపోయారు. కాగా, గత వారం ప్రేమికులిద్దరూ తగువులాడుకున్నారు. ఒకరినొకరు తీవ్రంగా దూషించుకుని, విడిపోయారు.

పూజపై కక్ష కట్టిన దిగ్విజయ్.. ఆమెకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆనోటా ఈనోటా వీడియోల విషయం తెలుసుకున్న పూజ.. మాజీ ప్రేమికుడిపై పోలీసులకు ఫిర్యాదుచేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దిగ్విజయ్ ని అరెస్టు చేసి జముయి సివిల్ కోర్టులో ప్రవేశపెట్టారు. బాధితురాలు,  నిందితుడి మధ్య నాలుగేళ్లుగా సాగిన ప్రేమ వ్యవహారం గురించి లాయర్ల ద్వారా తెలుసుకున్న జడ్జి గారు.. 'ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో' అని దిగ్విజయ్ కి సూచించారు. అందుకతను సరే అనడం, పూజ కూడా అంగీకారం తెలపడంతో శుక్రవారం ఓ ఆలయంలో వీరి వివాహం జరిగింది. చేతికి సంకెళ్లతోనే మూడు ముళ్లూ వేసిన దిగ్విజయ్ ని పోలీసులు మళ్లీ రిమాండ్ కు తరలించారు. పూజ తన అత్తారింటికి వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement