గురువారం జముయి సభలో మోదీ, చిరాగ్ నవ్వులు
విపక్షాలపై మోదీ ధ్వజం
జమూయి/కూచ్‌బెహార్: అవినీతి కేసుల్లో ఇరుక్కున్నవారంతా మోదీపై యుద్ధం పేరిట ఒక్కటవుతున్నారని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆ కూటమిలో ఉన్న భాగస్వాములంతా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నవారేనని గుర్తుచేశారు. అవినీతిపరులను జైలుకు పంపించాలా? వద్దా? అని ప్రశ్నించారు. తాను అవినీతి నిర్మూలన గురించి మాట్లాడుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం మోదీని ఓడించాలని ప్రజలకు పిలుపునిస్తున్నాయని తప్పుపట్టారు.
గురువారం బిహార్‌లోని జమూయి జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. మన దేశానికి ముప్పుగా మారిన సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి దాడులు చేస్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. చిన్నదేశాల నుంచి ముష్కరులు వచి్చపడుతున్నా చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు.
ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఇతర దేశాల జోక్యాన్ని అనుమతించారని మండిపడ్డారు. దీనివల్ల భారత్‌కు బలహీన దేశమన్న చెడ్డపేరు వచి్చందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాను సులువుగా టార్గెట్ చేయొచ్చన్న అభిప్రాయం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకం వల్ల ప్రపంచం దృష్టిలో భారత్ పేద దేశంగా ముద్రపడిందని అన్నారు. యూపీఏ ప్రభుత్వ పాలనలో 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసులో అమెరికా జోక్యాన్ని అనుమతించడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
సీఏఏపై విపక్షాల తప్పుడు ప్రచారం
పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. భరతమాతపై విశ్వాసం ఉన్నవారికి భారత పౌరసత్వం కల్పిస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. ఆయన పశి్చమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. అవినీతిపరులను కాపాడేందుకు ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment