ప్రభుత్వ ఆపీస్‌లో పై అధికారి తలబిరుసుతనంతో తన కింద పనిచేసిన వాళ్లపై చేయిచేసుకోవడం వంటి పలు ఘటనలు గురించి విన్నాం. ఇటీవలే ఒక నర్సు ఆలస్యంగా వచ్చినందుకు ఒక ఆరోగ్యాధికారి దాడి చేసేందుకు ప్రయత్నించిన వీడియోలను చూశాం. లక్షల్లోనూ లేదా కోట్ల ఆస్తి గురించి దెబ్బలాడుకున్నా ఓ అర్థం ఉంటుంది. కానీ కేవలం రూ 500 కోసం కొట్టుకోవడం గురించి విన్నారా. పైగా ఆపేందుకు ప్రయత్నించిన కూడా తగ్గేదే లే అన్నట్టుగా ఘోరంగా కొట్టుకున్నారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.
అసలు విషయంలోకెళ్తే....బీహార్‌లో జాముయ్ జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్‌లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు ఒకరినోకరు జుట్టుపట్టుకుని లాక్కుంటూ దారుణంగా కొట్టుకున్నారు. ఆఖరికి ఒక వ్యక్తి జోక్యం చేసుకుని ఆపేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ ఇద్దరూ చేతులతోనూ, చెప్పులతోను ఘోరంగా కొట్టుకున్నారు.
అయితే ఆశా వర్కర్ రింటూ కుమారి బీసీజీ వ్యాక్సిన్ షాట్ కోసం ఆక్సిలరీ నర్సు మిడ్‌వైఫ్(ఏఎన్‌ఎం) రంజన కుమారి వద్దకు నవజాత శిశువును తీసుకెళ్లినప్పుడే ఈ వివాదం తలెత్తింది. అయితే వ్యాక్సిన్ వేసేందుకు ఆ ఆక్సిలరీ నర్సు రూ 500 డిమాండ్ చేయడంతో ఈ గోడవ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్‌లైన్ వైరల్‌గా మారింది. దీంతో ఆస్పత్రి ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఆ కార్యకర్తలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు.
ये दृश्य @NitishKumar के स्वास्थ्य विभाग की असलियत की कहानी बयान कर रहा हैं जहां एक टीका के बदले 500 घूस की माँग पर एएनएम और आशा सेविका ऐसे उलझ गयी @ndtvindia @Anurag_Dwary @mangalpandeybjp @PratyayaIAS pic.twitter.com/98JrknbpMk
— manish (@manishndtv) January 24, 2022
(చదవండి: లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు!)
Comments
Please login to add a commentAdd a comment