Primary Health Centre
-
వైద్య సేవలందక వ్యక్తి మృతి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సకాలంలో వైద్య సేవలు అందక నెల్లూరు జిల్లా సైదాపురంలో ఆదివారం ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆగ్రహించిన ప్రజలు పీహెచ్సీ ఎదుట ధర్నాకు దిగారు. సైదాపురం దళితవాడకు చెందిన మల్లారపు వీరరాఘవయ్య (49) ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం అతడి నోట్లో నుంచి నురుగు రావడంతో సమీపంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ కేవలం స్టాఫ్ నర్సు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రథమ చికిత్స కూడా చేయకుండానే గూడూరు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సలహా ఇవ్వడంతో గూడూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు దళితవాడకు చెందిన యువత పీహెచ్‌సీకి చేరుకుని ధర్నాకు దిగారు. కనీస వైద్య సేవలు అందకపోవడం వల్లే వీరరాఘవయ్య మృతి చెందాడని వాపోయారు. వివిధ పార్టీల నేతలు ఆందోళనకారులకు మద్దతు ప్రకటించారు. ఉన్నతాధికారులు వచ్చేంత వరకు ఆందోళన విరమించమని భీషి్మంచుకు కూర్చున్నారు. ఎస్ఐ డీఎస్ విజయ్‌కుమార్ అక్కడకు చేరుకుని సమగ్ర విచారణ జరిపారు. ఇక్కడి పరిస్థితిని రాపూరు సీఐ విజయకృష్ణకు వివరించారు. అక్కడి నుంచే సీఐ ఆందోళనకారులను శాంతింపజేశారు. – సైదాపురం -
బైక్ హెల్మెట్ ధరించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. ఎందుకంటే..
భువనేశ్వర్: ఒడిశాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డాక్టర్ హెల్మెట్ ధరించి పేషేంట్లకు ట్రీట్మెంట్ ఇస్తూ కనిపించారు. అంతకుముందు రోజున ఆ హాస్పిటల్ పైకప్పు నుండి పెళ్లలు ఊడి పడటమే అందుక్కారణమని చెబుతున్నారు అక్కడి సిబ్బంది. ఒడిశా బాలంగిర్ జిల్లా దండముండ హాస్పిటల్లో స్లాబు పెచ్చులు పెచ్చులుగా ఊడి కింద పడుతోంది. ఇదే ఆసుపత్రిలో కాంపౌండరుగా పనిచేస్తోన్న సుమంత నాయక్ సోమవారం పెద్ద ప్రమాదం నుండే తప్పించుకున్నాడు. ఖప్రాకోల్ బ్లాకులో విధులు నిర్వర్తిస్తుండగా తన పక్కన హఠాత్తుగా పైనుండి పెచ్చులు ఊడి పడ్డాయని తెలిపాడు. మెడికల్ వార్డులో తనతోపాటు మరికొంతమంది పేషేంట్లు ఉండగా ఈ సంఘటన జరిగిందని అదృష్టవశాత్తు తమకు ఏమీ కాలేదని, అందుకే బైక్ హెల్మెట్ ధరించే డ్యూటీకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అతడిలాగే ఆసుపత్రి సిబ్బందిలో చాలా మంది భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. వారితోపాటే ఈ డాక్టర్ కూడా హెల్మెట్ ధరించుకుని పేషేంట్లకు ట్రీట్మెంట్ చేస్తూ దర్శనమిచ్చారు. ఆయన కూర్చున్న పైభాగంలో కూడా స్లాబు పెచ్చు ఊడిపోయిన దృశ్యం వీడియోలో చూడవచ్చు. ఇక్కడే ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తోన్న బాలకృష్ణ పురోహిత్ మాట్లాడుతూ.. సరైన మెయింటెనెన్స్ లేక బిల్డింగ్ శిథిలావస్థకు వచ్చిందని పై అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని, ఇదే నిర్లక్ష్యం కొనసాగితే రాను రాను మరింత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. ఇక్కడి సిబ్బంది మాట్లాడుతూ ఐదేళ్ల క్రితమే నిర్మించిన అవుట్ పేషేంట్ వార్డులో పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. నాసిరకమైన నిర్మాణం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇది కూడా చదవండి: అజిత్ పవార్ కట్టప్ప - శరద్ పవార్ బాహుబలి As seen in the infrastructural realities of rural #Odisha A doctor is shown treating patients inside a medical facility in Bolangir while donning a helmet out of fear of falling concrete from the floor. Numerous issues need to be brought up, but because to babus' carelessness,… pic.twitter.com/sA40Wc3Q1q — Sashmita Behera (@incsashmita) July 6, 2023 -
వాట్సాప్ కాల్ సాయంతో ప్రసవం
శ్రీనగర్: నొప్పులతో విలవిల్లాడుతున్న గర్భిణికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) సిబ్బంది వాట్సాప్ కాల్ సాయంతో సురక్షితంగా ప్రసవం చేసిన సంఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగింది. కుప్వారా జిల్లాలోని కెరాన్ పీహెచ్‌సీకి నెలలు నిండి, నొప్పులు మొదలైన గర్భిణిని కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి తీసుకొచ్చారు. ఎక్లామ్‌ప్సియా, ఎపిసియోటోమీతో బాధపడుతున్న ఆమెకు ప్రసవం జరగడం కష్టతరంగా మారింది. తీవ్రంగా మంచు కురుస్తుండడంతో హెలికాప్టర్లో జిల్లా ఆసుపత్రికి తరలించడం వీలు కాలేదు. దీంతో కెరాన్ పీహెచ్సీ డాక్టర్లు క్రాల్పొరాలోని జిల్లా ఉప ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. ఆఆసుపత్రి వైద్యుడు డాక్టర్ పర్వేజ్ వాట్సాప్ కాల్లో సూచనలు ఇస్తుండగా, కెరాన్ పీహెచ్సీ వైద్యులు మహిళకు విజయవంతంగా ప్రసవం చేశారు. ఆడ శిశువు జన్మించిందని, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. -
వైద్యరంగంలో సత్ఫలితాలిస్తున్న నాడు-నేడు పనులు
-
పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్‌సీల్లో చికిత్స
సాక్షి, హైదరాబాద్: సాధారణ చికిత్సలకే పరిమితమయ్యే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో ఆరోగ్యశ్రీ కింద క్రిటికల్ కేర్, గ్యాస్ట్రో, గుండె, కేన్సర్ వంటి పెద్ద జబ్బులకు కూడా చికిత్సలు చేస్తున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే ఉండే పీహెచ్‌సీల్లో, కొన్నిచోట్ల పీజీ కోర్సు పూర్తయిన స్పెషలిస్ట్ వైద్యులు ఉండటంతో పెద్ద జబ్బులకు చికిత్సలు చేయడం సాధ్యమవుతోందని వైద్య వర్గాలు అంటున్నాయి. అంతేకాక చిన్నచిన్న జబ్బులకు పెద్దాసుపత్రులకు వెళ్లకుండా స్థానికంగానే వాటిని నయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పీహెచ్సీలలో ఆరోగ్యశ్రీ కింద సేవలు ప్రారంభించిన రెండున్నర నెలల కాలంలోనే వేలాది మంది చికిత్సలు పొందారు. వీటిల్లో వైద్య సేవలన్నీ ఉచితమే అయినా, ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించడం వల్ల డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. దీంతో వైద్య సిబ్బంది రోగులకు సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. పెద్ద ఆసుపత్రులపై తగ్గిన భారం.. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఈ ఎనిమిదేళ్లలో రూ.5,817 కోట్లు కేటాయించింది. 2014 నుంచి ఇప్పటి వరకు 13.31 లక్షల మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలు పొందారు. అందులో అత్యధికంగా 2015–16లో 1.88 లక్షల మంది పేదలు ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల వైద్య సేవలు పొందారు. అలాగే ఇదే కాలంలో ఉద్యోగులు, జర్నలిస్ట్‌ల ఆరోగ్య పథకం కింద 3.31 లక్షల మంది చికిత్సలు పొందగా, అందుకోసం ప్రభుత్వం రూ.1,346 కోట్లు ఖర్చు చేసింది. ఇంత ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా చికిత్సకు అవకాశం ఉన్నా పైస్థాయి ఆసుపత్రికి రిఫర్ చేయకుండా కట్టడి చేయడం, వైద్య సేవలను వికేంద్రీకరించడం వల్ల పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాక ఆరోగ్యశ్రీ సేవలను ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించడం వల్ల ప్రైవేట్‌లో అనవసర చికిత్సలకు బ్రేక్ వేసినట్లు అవుతుందని చెపుతున్నారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సదుపాయాన్ని అడ్డంపెట్టుకుని అనవసర చికిత్సలు చేస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రెండున్నర నెలల్లో 9,292 చికిత్సలు ఈ ఏడాది మే నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అంటే దాదాపు రెండున్నర నెలల కాలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల చికిత్సలు చేశారు. ఈ కాలంలో ఆరోగ్యశ్రీ కింద మొత్తం 9,292 వైద్య చికిత్సలు అందించగా, అందులో అత్యధికంగా జనరల్ మెడిసిన్‌కు సంబంధించి 6,492 చికిత్సలు చేశారు. 2,077 గ్యాస్ట్రిక్ సంబంధిత జబ్బులకు చికిత్సలు చేశారు. అలాగే 233 జనరల్ సర్జరీలు జరిగాయి. 195 ఎండోక్రైనాలజీకి చెందిన చికిత్సలు జరిగాయి. ఇవిగాక ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించామని వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది. అందులో భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పీహెచ్‌సీల్లో మూడు గుండె సంబంధిత చికిత్సలు జరిగాయి. క్రిటికల్ కేర్‌కు సంబంధించి మేడ్చల్ జిల్లాలో 12, నిర్మల్ జిల్లాలో రెండు, రంగారెడ్డి జిల్లాలో నాలుగు చికిత్సలు చేశారు. డెర్మటాలజీకి సంబంధించి వివిధ జిల్లాల్లో 9 చికిత్సలు జరిగాయి. అలాగే ఆయా జిల్లాల్లో 10 ఈఎన్టీ సర్జరీలు, 41 ప్రసూతి చికిత్సలు, 76 ఇన్ఫెక్షన్ వ్యాధులకు వైద్యం, రెండు కేన్సర్ చికిత్సలు కూడా జరిగాయి. కిడ్నీ వైద్యం కూడా 9 చోట్ల చేశారు. మూడు న్యూరాలజీ, 13 ఆర్థోపెడిక్ సర్జరీలు, 54 పీడియాట్రిక్ చికిత్సలు, 8 ఫల్మనరీ, ఒక తలసేమియా, 5 పాలీ ట్రామా చికిత్సలు జరగడం గమనార్హం. కాగా, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నచోట్ల మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. (క్లిక్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి.. మరో అరుదైన ఘనత) -
తోపుడు బండిపై ఆసుపత్రికి గర్భిణి.. తీరా వెళ్లాక ట్విస్ట్!
భోపాల్: తన గర్భిణీ భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఓ వ్యక్తి. అంబులెన్స్ రాకపోవటంతో తోపుడు బండిపై స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు లేరు. కనీసం నర్సులు సైతం లేకపోవటంతో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక సంఘటన మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని రానేహ్ ప్రాంతానికి చెందిన కైలాస్ అహిర్వార్ అనే వ్యక్తి భార్య కాజల్ నిండు గర్భిణీ. ఆమెకు మంగళవారం పురిటి నొప్పులు రావడం వల్ల కైలాస్.. అంబులెన్స్‌కు కాల్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అంబులెన్స్రాలేదు. దీంతో చేసేదేం లేక తోపుడు బండిపై ఆమెను పడుకోబెట్టి కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక ఆస్పత్రిలో వైద్యుడు, నర్స్ అందుబాటులో లేరు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండగా.. అక్కడే ఉన్న కొందరు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ రాగా హాటా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. చివరకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా మెడికల్ఆఫీసర్ఆర్పీ కోరి సమగ్ర విచారణ చేపడతామని చెప్పారు. Husband of a pregnant woman carried her to hospital on a push-cart for want of ambulance in Damoh, Kailash Ahirwal reached the local government-run Arogya Kendra after 2 kms journey, there was no doctor or nurse there, he alleged @ndtv @ndtvindia pic.twitter.com/cXj94L5oX5 — Anurag Dwary (@Anurag_Dwary) August 31, 2022 ఇదీ చదవండి: ఇదెక్కడి న్యాయం.. ఆ వార్త రాసిన జర్నలిస్టులపై ఐటీ యాక్ట్ కింద కేసులా? -
Adilabad: అవార్డులు అందని ద్రాక్షేనా?
ఈ చిత్రంలో కనిపిస్తోంది బజార్హత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. చూడటానికి భవనం ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకు తగ్గట్టే నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కాయకల్ప అవార్డు వరుసగా మూడు సంవత్సరాలు అందుకుంది. నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్స్ అవార్డు కూడా దక్కింది. అయితే ఈసారి మాత్రం ఈ అవార్డుకు పోటీ పడటంలో వెనుకబడింది. దీనికి ప్రహరీ నిర్మాణం లేకపోవడం, స్వచ్ఛభారత్‌లో కొన్ని అంశాల్లో వెనుకబడడంతో ఈ పరిస్థితి ఉంది. ఈ చిత్రంలో కనిపిస్తోంది తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఆవరణలో ఈ ఫ్లోరింగ్ మొత్తం పగిలిపోయి ఉంది. భవనంలో విద్యుత్ వైరింగ్ సరిగ్గా లేదు. 1956లో ఈ పీహెచ్సీ ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాణాలు మెరుగుపర్చే చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. అలా జరిగితేనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఆస్పత్రులకు నిధులు వస్తాయి. మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయి. సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులను అందుకోవడంలో వెనుకంజలో ఉన్నాయి. ప్రమాణాలను అందుకోలేక పోతున్నాయి. ఒకవేళ వసతులను మె రుగుపర్చుకుంటూపోతే అధిక పాయింట్స్ సాధించడం ద్వారా ప్రత్యేక నిధులు పొందే అవకాశం ఉంటుంది. కాయకల్ప ప్రమాణాలు అందుకుంటే రూ. 2లక్షల నిధులు ఇవ్వనున్నారు. వీటి ఆధారంగా మ రిన్ని వసతులు మెరుగుపర్చుకొని జాతీయ ప్రమాణాలు అందుకుంటే నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్స్ అవార్డు అందుకుంటాయి. మూడేళ్లపాటు ఒక్కో సంవత్సరం రూ.3 లక్షలు అందుతాయి. కొన్నింటికే అవార్డులు.. జిల్లా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలను విడివిడిగా పరిగణలోకి తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రమాణాలను అంచనా వేసి అవార్డులు ఇస్తున్నాయి. జిల్లాలో మొత్తం 22 పీహెచ్‌సీలు, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. 5 పీహెచ్‌సీలు, 2 అర్బన్ హెల్త్ సెంటర్లు మాత్రమే కాయకల్పకు మొదట ఎంపికై ఆ తర్వాత ప్రమాణాలను దాటుకుని నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్స్‌ను అందుకోవడం ద్వారా వరుసగా మూడేళ్లు రూ.3 లక్షల చొప్పున అందుకున్నాయి. అయితే బజార్హత్నూర్ పీహెచ్‌సీకి సంబంధించి ప్రహరీ నిర్మాణం లేకపోవడం, స్వచ్ఛభారత్ అంశాల్లో పాయింట్లు తగ్గడంతో మరోసారి జాతీయ అవార్డు వస్తుందో? రాదోనని అక్కడి జెడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య ఇటీవల జెడ్పీ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా జిల్లాలోని మిగితా ఆరోగ్య కేంద్రాలు ఈ ప్రమాణాలను అందుకునేందుకు పోటీ పడకపోవడం చోద్యంగా కనిపిస్తోంది. ఆస్పత్రిలో లైటింగ్, వెయిటింగ్, బాహ్య, అంతర్గత నిర్వహణ సరిగ్గా ఉండాలి. రోగులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలి. విధులు సక్రమంగా నిర్వహించాలి వంటి అంశాలు ప్రమాణాలుగా ఉన్నాయి. ప్రధానంగా ఆస్పత్రి స్వరూపం ఆకర్షణీయంగా ఉండాలి. ఆ పరిసరాల్లో పశువుల సంచారం లేకుండా చూడాలి. గార్డెనింగ్ నిర్వహణ చేయాలి. ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేవని జెడ్పీ సమావేశంలో ప్రస్తావనకు తీసుకురావడం పట్ల ఎమ్మెల్యేలు ఆక్షేపణ వ్యక్తం చేశారు. ప్రధానంగా ప్రతి పీహెచ్సీలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిరంతరంగా నిర్వహిస్తే అక్కడే సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఈ పదిహేను రోజుల్లో అన్ని పీహెచ్‌సీల సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం జరుగుతుందని, తద్వారా సదుపాయాలు మెరుగవుతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాయకల్ప ప్రమాణాల్లో వెనుకంజ బజార్హత్నూర్ పీహెచ్‌సీకి వరుసగా మూడేళ్లపాటు కాయకల్ప అవార్డు దక్కింది. ఈసారి పాయింట్స్‌లో వెనుకబడింది. ప్రహరీ నిర్మాణం లేకపోవడం, అక్కడ ఆక్రమణలు చోటు చేసుకోవడం, ఇతరత్రా అంశాల పరంగా సరైన పాయింట్స్ రాలేదు. ఈ సమస్యలను పరిష్కరించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. – మల్లెపూల నర్సయ్య, జెడ్పీటీసీ, బజార్హత్నూర్ జాతీయ ప్రమాణాలు అందుకునేందుకు కృషి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు మెరుగుపర్చడం ద్వారా కాయకల్ప అవార్డుతో పాటు జాతీయ ప్రమాణాలు కూడా అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. జిల్లాలో ఇప్పటికే ఏడు ఆస్పత్రులకు జాతీయ అవార్డు అందడం జరిగింది. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్ఓ, ఆదిలాబాద్ -
రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో
ప్రభుత్వ ఆపీస్లో పై అధికారి తలబిరుసుతనంతో తన కింద పనిచేసిన వాళ్లపై చేయిచేసుకోవడం వంటి పలు ఘటనలు గురించి విన్నాం. ఇటీవలే ఒక నర్సు ఆలస్యంగా వచ్చినందుకు ఒక ఆరోగ్యాధికారి దాడి చేసేందుకు ప్రయత్నించిన వీడియోలను చూశాం. లక్షల్లోనూ లేదా కోట్ల ఆస్తి గురించి దెబ్బలాడుకున్నా ఓ అర్థం ఉంటుంది. కానీ కేవలం రూ 500 కోసం కొట్టుకోవడం గురించి విన్నారా. పైగా ఆపేందుకు ప్రయత్నించిన కూడా తగ్గేదే లే అన్నట్టుగా ఘోరంగా కొట్టుకున్నారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే....బీహార్‌లో జాముయ్ జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్‌లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు ఒకరినోకరు జుట్టుపట్టుకుని లాక్కుంటూ దారుణంగా కొట్టుకున్నారు. ఆఖరికి ఒక వ్యక్తి జోక్యం చేసుకుని ఆపేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ ఇద్దరూ చేతులతోనూ, చెప్పులతోను ఘోరంగా కొట్టుకున్నారు. అయితే ఆశా వర్కర్ రింటూ కుమారి బీసీజీ వ్యాక్సిన్ షాట్ కోసం ఆక్సిలరీ నర్సు మిడ్వైఫ్(ఏఎన్ఎం) రంజన కుమారి వద్దకు నవజాత శిశువును తీసుకెళ్లినప్పుడే ఈ వివాదం తలెత్తింది. అయితే వ్యాక్సిన్ వేసేందుకు ఆ ఆక్సిలరీ నర్సు రూ 500 డిమాండ్ చేయడంతో ఈ గోడవ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్లైన్ వైరల్‌గా మారింది. దీంతో ఆస్పత్రి ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఆ కార్యకర్తలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. ये दृश्य @NitishKumar के स्वास्थ्य विभाग की असलियत की कहानी बयान कर रहा हैं जहां एक टीका के बदले 500 घूस की माँग पर एएनएम और आशा सेविका ऐसे उलझ गयी @ndtvindia @Anurag_Dwary @mangalpandeybjp @PratyayaIAS pic.twitter.com/98JrknbpMk — manish (@manishndtv) January 24, 2022 (చదవండి: లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు!) -
ప్రధానోపాధ్యాయుడి కీచక బుద్ధి.. వ్యాక్సినేషన్ వేయడానికి వచ్చిన నర్స్పై..
బెంగళూరు: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్లు వేసుకునే విధంగా.. ఆయా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా వ్యాక్సిన్ వేయడానికి వచ్చిన హెల్త్ సెంటర్ ఉద్యోగిని పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమానుషంగా ప్రవర్తించి.. అశ్లీల సందేశాలను పంపించాడు. బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన బెళగావిలోని దేగాం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉద్యోగిని గత రెండు వారాలుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ లు వేస్తుంది. ఈ క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్ చావలాగి .. మహిళా ఉద్యోగి సెల్‌ఫోన్ నంబర్‌ను సంపాదించాడు. ఆ తర్వాత.. ప్రతిరోజు ఆమెతో అసభ్యంగా మాట్లాడేవాడు. అంతటితో ఆగకుండా.. అశ్లీల సందేశాలు, ఫోటోలు పంపుతూ తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధించసాగాడు. దీంతో ఆమె అతనికి ప్రవర్తన మార్చుకోవాలని కోరింది. అయినప్పటికి అతగాడు తన వక్రబుధ్ది మార్చుకోలేదు. దీంతో విసిగిపోయిన ఆమె బంధువులు, స్నేహితులకు వేధింపుల విషయాన్ని చెప్పింది. ఈ క్రమంలో వారంతా కలిసి గడిచిన బుధవారం (ఆగస్టు4) ప్రధానోపాధ్యాయుడి ఛాంబర్‌కు చేరుకుని ఆ కీచకుడిని గదిలో బంధించారు. ఆ తర్వాత అతడికి దేహశుద్ధి చేశారు. అయితే, తాజాగా ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని సస్పెండ్ చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. కాగా, బాధితురాలు సురేష్ చావలాగిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆస్పత్రిలో నరకయాతన; టార్చిలైటు వెలుతురులో డెలివరీ
మణికొండ: ప్రభుత్వ ఆస్పత్రులను అధునాతనంగా తీర్చిదిద్దుతాం.. ప్రైవేటుకు దీటుగా సేవలందించేలా చర్యలు తీసుకుంటాం.. ఇవీ ప్రభుత్వ పెద్దల ఊకదంపుడు ఉపన్యాసాలు.. వాస్తవానికి వచ్చే సరికి ఇందుకు భిన్నంగా ఉంది. రాష్ట్ర రాజధానికి ఆనుకునే ఉన్న గండిపేట మండలం నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండటంతో చీకట్లోనే డెలివరీ(కాన్పులు)లు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యుత్ సరఫరాకు అంతారాయం కలిగితే తక్షణ అవసరంగా ఏర్పాటు చేసిన ఇన్వర్టర్లు మరమ్మతులకు గురికావటంతో దాన్ని పట్టించుకోవటం లేదని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో డెలివరీల కోసం వస్తున్న మహిళలు గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భంలో నరకయాతన అనుభవిస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి రోజుల వయసు ఉన్న పిల్లలు సైతం ఉక్కపోతను భరించలేక తీవ్రంగా ఏడుస్తున్నారు. ఇన్వర్టర్ మరమ్మతులకు అవసరమైన నిధులు అందుబాటులో లేకపోవటంతోనే దాన్ని పక్కన పడేసినట్టు సిబ్బంది పేర్కొంటున్నారు. శనివారం డెలివరీ నిమిత్తం వచ్చిన ఓ మహిళ బంధువులు సెల్‌ఫోన్ టార్చిలైటు వెలుతురులో డెలివరీ చేస్తున్న సిబ్బంది ఫొటోలను తీసి స్థానిక విలేకరులకు పంపారు. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ రాష్ట్ర రాజధాని పక్కనే ఇలా ఉంటే మారుమూల ప్రాంతాలలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వారు వాపోయారు. మరమ్మతులు చేయిస్తాం గతంలో ఇన్వర్టర్ను మరమ్మతు చేయించినా తిరిగి అదే పరిస్థితికి వచ్చింది. మరమ్మతులకు సంబంధించిన నిధులు రావటం లేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినపుడు మహిళలు ఇబ్బంది పడుతున్న విసయం వాస్తవమే. వెంటనే తన సొంత డబ్బుతోనైనా మరమ్మతులు చేయిస్తా. – పద్మ, మండల వైద్యాధికారి, గండిపేట మండలం -
మహిళకు రెండు డోసులు ఒకేసారి.. ఇదెలా సాధ్యం!
జైపూర్: కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్ ఉత్తమ మార్గమని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య కొన్ని రోజులు గ్యాప్ ఉండాలని కూడా పేర్కొంది. కోవాగ్జిన్ అయితే మూడు వారాలు.. కొవీషీల్డ్ అయితే 12-16 వారాల గ్యాప్ అవసరమని తెలిపింది. అయితే రాజస్తాన్‌లో ఒక మహిళ మాత్రం కరోనా వ్యాక్సిన్ రెండు డోసులను ఒకేసారి వేశారంటూ ఆరోపణలు చేసింది. దీంతో ఈ విషయం ఆసక్తికరంగా మారింది. మహిళ చేసిన ఆరోపణలను తోసిపుచ్చిన ఆసుపత్రి యాజమాన్యం ఆమెకు తొలి డోసు మాత్రమే వేశామని.. రూల్స్ ప్రకారం అలా సాధ్యం కాదని వివరణ ఇచ్చుకుంది. అయితే ఇందులో నిజమెంత అనేది ఇంకా క్లారిటీ లేదు. విషయంలోకి వెళితే.. చరణ్ శర్మ దంపతులు కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఉదయం 9గంటలకు దౌసాలోని నానగల్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు వచ్చారు. కాగా 11 గంటలకు దంపతులిద్దరికి వ్యాక్సిన్ వేసి పంపించారు. చరణ్ శర్మ పనిమీద వేరేచోటికి వెళ్లగా.. అతని భార్య ఇంటికి వెళ్లింది. చరణ్‌శర్మ పని ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత భార్యకు కాస్త జ్వరంగా ఉండడంతో అనుమానం వచ్చింది. ఏమైంది అని భార్యను అడగ్గా.. నాకు వ్యాక్సిన్ రెండు డోసులు వేశారని.. అందుకే ఇలా జరుగుతుందని చెప్పడంతో చరణ్ శర్మ ఆశ్చర్యపోయాడు. వెంటనే వ్యాక్సిన్ వేసుకున్న పీహెచ్సీ సెంటర్‌కు వెళ్లి ఆరా తీయగా.. మీ భార్యకు ఒకటే డోస్ వేశామని.. రెండు డోస్‌లు ఒకేసారి ఇవ్వడం కుదరదని.. అందుకు రూల్స్ కూడా లేవని అతని మాటలను కొట్టిపారేశారు. అయితే చరణ్ శర్మ మరో వైద్యుడిని కలిసి విషయం చెప్పగా .. దానిని ఖండించి చరణ్ శర్మకు పారాసిటమల్ మందులు ఇచ్చి పంపించాడు. కాగా ఈ విషయం చర్చనీయాంశంగా మారడంతో దౌసాచీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనీష్ చౌదరీ స్పందించారు. మహిళకు రెండు డోసులు ఇచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. తొలుత వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే రక్తం రావడంతో సిబ్బంది విరమించుకున్నారని, ఆ తర్వాత మరో ప్రాంతంలో టీకా వేశారని పేర్కొన్నారు. అయితే, సూదిని రెండుసార్లు పొడవడంతో తనకు రెండు డోసులు ఇచ్చినట్లుగా భావించి ఆమె భయపడుతోందని అన్నారు. అది నిజం కాదని డాక్టర్ మనీష్ చౌదరి స్పష్టం చేశారు. ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు వైద్య బృందాన్ని ఆమె గ్రామానికి పంపామని తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉన్నట్టు వైద్యులు గుర్తించారని పేర్కొన్నారు. ఆమెలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదన్నారు. అయితే ఇదే విషయంపై ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రమణ్ శర్మ మాట్లాడుతూ.. ఏకకాలంలో రెండు డోసులు తీసుకున్నా దుష్ప్రభావాలేమీ ఉండవని తెలిపారు. ఫేజ్ 2 ట్రయల్స్‌లో దీనిని పరీక్షించామని, ఇప్పటివరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని పేర్కొన్నారు. చదవండి: నిమ్స్‌లో వ్యాక్సిన్ పంపిణీలో అవకతవకలు మరోముప్పు.. కరోనా హైబ్రిడ్ -
కరోనా వ్యాక్సిన్ అనుకొని ఎత్తుకెళ్లారు.. ట్విస్ట్ ఏంటంటే
ముంబై: మహారాష్ట్రలోని థానేలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 300 వివిధ రకాల వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లారు. వారు ఎత్తుకెళ్లిన వాటిలో ఎక్కువ శాతం చిన్న పిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్లు ఉన్నట్లు తెలిసింది. కాగా అధికారులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తులు హెల్త్ సెంటర్లో యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ ఏమైనా ఉందేమోనని... ముఖ్యంగా కోవిషీల్డ్ దొంగలించడానికి చొరబడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనికి తోడు వ్యాక్సిన్స్‌పై ఉన్న సీరమ్ ఇన్స్టిట్యూట్ స్టిక్కర్లను తీసేసి అక్కడే వదిలేసి వెళ్లారు. కాగా వచ్చిన వ్యక్తులు ఎలాంటి ఆధారాలు ఉండకూదని సీసీ కెమెరాలతో పాటు మానిటర్‌ను తమ వెంట తీసుకెళ్లారు . కాగా సెక్షన్ 380, సెక్షన్ 427,సెక్షన్ 454 కింద ఆ వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈరోజు ఉదయం విధుల్లో చేరేందుకు వచ్చిన పీహెచ్సీ ఉద్యోగులు హెల్త్ సెంటర్లో ఫ్రిజ్ డోర్ పగులగొట్టి ఉండడం... వ్యాక్సిన్ ట్రేలు చెల్లాచెదరుగా పడి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. '' ఈరోజు ఉదయం రాగానే ఫ్రిజ్ డోర్ తాళం విరిగి ఉండడంతో వ్యాక్సిన్ స్టాక్‌ను తనిఖీ చేశాము. సాధారణంగా మాకు కోవిడ్-19 వ్యాక్సిన్లు వస్తుంటాయి. కానీ గత శుక్రవారం నుంచి మా హెల్త్ సెంటర్‌కు ఎలాంటి కరోనా వ్యాక్సిన్లు రాలేదు. ప్రస్తుతం చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్లు ఎక్కువగా ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ అని భావించి వాటిని ఎత్తుకెళ్లి ఉంటారు.పిల్లల వ్యాక్సిన్లలో అందుబాటులో ఉన్న 40 శాతం నిల్వలను ఎత్తుకెళ్లారు'' అని పీహెచ్సి వైద్య అధికారి డాక్టర్ దీపక్ చావా తెలిపారు. చదవండి: Covid-19: పుక్కిలించిన సెలైన్‌తో కరోనా టెస్ట్ -
వైద్యుల తొలగింపు: ఆస్పత్రికి గ్రామస్తుల తాళం
జయపురం: పదేళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించి కొత్తవారిని చేర్చుకున్నందుకు ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు, గ్రామస్తులు ఆగ్రహించి ప్రాథమిక వైద్య కేంద్రానికి బుధవారం తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. చివరికి ఎమ్మెల్యే హామీతో ఆందోళన విరమించారు. వివరాలిలా ఉన్నాయి. నవరంగపూర్ సమితి గుమగుడ గ్రామం పీహెచ్సీలో 10 సంవత్సరాలుగా నైట్ వాచ్‌మన్‌గా దుర్యోధన హరిజన్, స్వీపర్‌గా ధనమతి గౌడ పనిచేస్తున్నారు. వారిద్దరినీ తొలగించి కొత్త వారిని కాంట్రాక్టర్ ఆ పోస్టుల్లో నియమించాడు. కొత్తగా నియామకం పొందిన వారు హాస్పిటల్‌కు రావడంతో గ్రామ ప్రజల సహకారంతో బాధిత ఉద్యోగులు హాస్పిటల్ గేట్‌కు తాళాలు వేశారు. దీంతో డాక్టర్లు, సిబ్బంది లోపలే ఉండిపోయారు. ఆ సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి కారు ఆపి విషయం తెలుసుకున్నారు. వెంటనే నవరంగపూర్ వైధ్యాధికారులు, డీఆర్డీఏ పీడీతో ఫోన్లో విధుల నుంచి తొలగించిన వారిని మళ్లీ చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా ఉద్యోగాలలో చేర్చుకుంటామని బాధితులకు ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో గ్రామస్తులు హాస్పిటల్ తాళాలు తీశారు. -
నర్సు నిర్లక్ష్యం: ఫోన్ మాట్లాడుతూ రెండు సార్లు వ్యాక్సిన్
లక్నో: కరోనా వ్యాక్సిన్ వేయడంలో అలసత్వం వద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా కింది స్థాయి సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ నర్సు ఫోన్లో మాట్లాడుతూ ఓ మహిళలకు రెండు సార్లు కరోనా వ్యాక్సిన్ ఇచ్చింది. తప్పు చేసిందే గాక ఆమె దబాయింపుకు పాల్పడడం గమనార్హం. దీంతో టీకా వేసుకున్న మహిళ ఆందోళన చెందుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో చోటుచేసుకుంది. కాన్పూర్ దేహత్ జిల్లా అక్బర్పూర్ ప్రాంతానికి చెందిన మహిళ కమలేశ్ కుమారి (50) కరోనా టీకా వేసుకునేందుకు మర్హౌలీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్కడ ఏఎన్ఎం విధులు నిర్వహిస్తోంది. టీకాలు వేస్తున్న సందర్భంలో అర్చన ఫోన్లో మాట్లాడుతోంది. ఆ విధంగా ఫోన్లో మాట్లాడుతూనే ఆమెకు ఒకసారి టీకా వేసింది. అనంతరం ఆ ఫోన్లోనే మునిగి మరొకసారి కూడా వ్యాక్సిన్ వేసింది. దీంతో అర్చన తీరుపై కమలేశ్‌కుమారికి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకేసారి రెండు టీకాలు వేయడంపై నిలదీసింది. అయితే అర్చన తప్పు చేసిందే గాక ఆమెనే దబాయించి తిట్టి పోసింది. వెంటనే ఈ విషయాన్ని కమలేశ్ కుమారి తన కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. రెండు టీకాలు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై వైద్య అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కలెక్టర్, వైద్య ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చారు. విధుల్లో నిర్లక్క్ష్యం వహించిన అర్చనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఒకేసారి రెండు టీకాలు ఇవ్వడంతో తనకేమన్నా అవుతుందేమోనని కమలేశ్ కుమారి ఆందోళన చెందుతున్నారు. -
మీకు 45 ఏళ్లు దాటాయా.?
సాక్షి, హైదరాబాద్: రోజుకు లక్ష మందికి టీకా వేసే దిశగా వైద్య, ఆరోగ్య శాఖ కదిలింది. దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం లేకుండా 45 ఏళ్లు పైబడిన వారందరికీ వచ్చే నెల 1 నుంచి టీకా వేయాలని కేంద్రం నిర్ణయించడంతో రాష్ట్ర వైద్య వర్గాలు కసరత్తు ప్రారంభించాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) మొదలు వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా వేస్తారు. మరో వెయ్యి ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. మొత్తం రోజుకు లక్షకు తగ్గకుండా లబ్ధిదారులకు టీకా వేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45-59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం కొన్ని సవరణలు చేసి 45-59 ఏళ్ల వారిలో దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం లేకుండా వారందరికీ టీకాలు వేస్తారు. దీనివల్ల ఆ వయసు వారు వచ్చే నెల 1 నుంచి వైద్యుల నుంచి ఎలాంటి ధ్రువీకరణ పత్రం లేకుండానే, వారి వయసును తెలిపే గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుందని అధికారులు వెల్లడించారు. కరోనా విజృంభణతో వ్యాక్సినేషన్లో వేగం.. రాష్ట్రంలో కరోనా కేసులు ఐదారు నెలల తర్వాత మరింతగా విజృంభిస్తున్నాయి. మరి కొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వైపు ప్రజలు మాస్క్ ధరించడం, కరోనా జాగ్రత్తలు పాటించడంతోపాటు, అర్హులైన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్య వర్గాలు కోరుతున్నాయి. అందుకే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భావిస్తున్నారు. జనవరి 16 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 10 లక్షల మొదటి, రెండో డోసు టీకాలు మాత్రమే వేశారు. అయితే 45 ఏళ్లు పైబడిన వారందరూ కలిపితే రాష్ట్రంలో కోటి మంది అర్హులు ఉన్నారని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు లెక్కలు వేశాయి. మొదట వైద్య సిబ్బందికి, తర్వాత ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా వేశారు. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45–59 ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేస్తున్నారు. ఇప్పటివరకు 10.10 లక్షల వ్యాక్సిన్లు వేశారు. వాస్తవంగా ఈ నాలుగు కేటగిరీలు కలిపి రాష్ట్రంలో మొత్తం 60 లక్షల మందికి టీకా వేయాలని భావించారు. అందులో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు దాదాపు 6 లక్షలు కాగా, 10 లక్షల మంది 45-59 ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారు. 60 ఏళ్లు పైబడిన వారు 54 లక్షల మంది ఉన్నారు. వీరుకాక 45-59 ఏళ్ల మధ్య వయసున్న వారు సుమారు 30 లక్షల మంది ఉంటారని అంచనా. ఇలా మొత్తం కోటి మందికి టీకాలు వేయాల్సి ఉంది. టీకా వేగవంతం చేసేందుకు ప్రైవేటు ఆసుపత్రుల్లో 24 గంటల పాటు వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. 20 పడకలకు పైగా ఉన్న అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ జరగనున్నట్లు చెబుతున్నారు. -
ఆదివారం అంతే మరి!
సాక్షి, కొడవలూరు: మండల కేంద్రంలోని పీహెచ్సీ తలుపులు ఆదివారం తెరచుకోలేదు. ఫలితంగా కుక్క కాటుకు గురైన బాలుడితో సహా పలువురు రోగులకు ఇక్కట్లు తప్పలేదు. కొడవలూరు మండల కేంద్రంలో పీహెచ్‌సీకి రోజూ 20 నుంచి 30 మంది రోగులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకెళ్తుంటారు. ఏదైనా అత్యవసరమైనా ప్రాథమిక చికిత్సకు ఇక్కడకే వస్తారు. నిబంధనల ప్రకారం ఆదివారం కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సిబ్బంది విధులు నిర్వహించాలి. అయితే ఈ నిబంధనలు ఇక్కడ అమలు కావడంలేదు. తెరచుకోని పీహెచ్సీ ఆదివారం కూడా పీహెచ్సీలో మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక స్టాఫ్‌నర్స్, ఫార్మాసిస్ట్, ఆయాలు విధిగా ఉండాలి. ఆస్పతికి వచ్చే రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇవ్వాలి. ఆదివారం పీహెచ్‌సీకి సిబ్బంది రాకపోవడంతో పూర్తిగా మూత పడింది. ఫలితంగా అనేక మంది ఇబ్బంది పడ్డారు. పద్మనాభసత్రానికి చెందిన మూడేళ్ల బాలుడు రామలింగం మహేష్‌ను ఆదివారం కుక్క కరవడంతో వైద్యంకోసం తండ్రి సురేష్ ఉదయం 11 గంటలకు పీహెచ్‌సీకి వచ్చారు. పీహెచ్సీ తలుపులు తెరచుకోకపోవడంతోపాటు సమాధానం చెప్పేందుకు కూడా ఎవరూ లేరు. దీంతో నార్త్‌రాజుపాళెంలోని ప్రైవ్రేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. పాము కాటైనా పరిస్ధితి ఇంతేనా అంటూ బాలుడి తండ్రి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పలువురు వృద్ధులు పీహెచ్‌సీకి వచ్చి ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఎమ్మెల్యే హెచ్చరించినా.. విడవలూరు మండలం ఊటుకూరులో ఇటీవల బోరు బావిలో బాలుడు పడిపోగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి దగ్గరుండి బాలుడ్ని వెలికి తీయించి రామతీర్థం వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడిని కోవూరు ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. అప్పటికే బాలుడి పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అయినప్పటికీ వైద్య సిబ్బందిలో ఎలాంటి మార్పు రాలేదు. -
ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల సమస్య తీరేదెప్పుడో?
సాక్షి, డెంకాడ(శ్రీకాకుళం): గ్రామస్థాయిలో వైద్య సేవలకు కేంద్రాలుగా ఉండే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత గూడు కరువైంది. అద్దె కొంపల్లో చాలీ చాలని స్థలంలో కేంద్రాలను నడుపుతున్నారు. కొన్నింటికి సొంత భవనాలు ఉన్నా అవి శిథిలావస్థకు చేరాయి. దీంతో గ్రామీణప్రాంతీయులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు. ముఖ్యంగా గర్భిణులు బాలింతలకు వైద్య సేవలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గర్భిణులు, బాలింతలకు ప్రతీ వారం వైద్య పరీక్షలు చేసే సమయంలో, చంటి పిల్లలకు వ్యాకిన్ వేసే సమయంలో అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల భవనాలు నిర్మించి చాలా కాలం కావటంతో అవి శిథిల దశకు చేరుకున్నాయి. గ్రామాలు పీహెచ్‌సీలకు దూరంగా ఉంటాయి. దీంతో గ్రామస్థాయిలో రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఉండాల్సిన వసతి కూడా కరువైంది. వైద్య సిబ్బందికి కూడా అవస్థలు తప్పటం లేదు. డెంకాడ మండలం అక్కివరం, జొన్నాడ గ్రామాల్లో సబ్సెటర్ సెంటర్లకు సొంత భవనాలు ఉన్నాయి. వీటిలో జొన్నాడలో ఉన్న సబ్‌సెంటర్ భవనం శిథిల దశకు చేరింది. పూసపాటిరేగ మండలంలో ఉన్న రెండు భవనాలు కూడా పాడయ్యాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులకు నివేదించాం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత భవనాలు లేనివాటి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. ఆయా సబ్‌సెంటర్ల వారీగా వివరాలు ఇచ్చాం. దీనికి సంబంధించి స్థలం చూపితే మంజూరు చేస్తామంటున్నారు. – డాక్టర్ సత్యవాణి, డెంకాడ పీహెచ్సీ పంచాయతీ భవనంలోనే విధులు జొన్నాడలో సబ్‌సెంటర్ భవనం శిథిల దశకు చేరింది. పంచాయతీ భవనంలోనే వాక్సిన్లు వేస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో సా ధారణ పాలనాపరమైన పనులు ఉంటాయి. దీంతో ప్రజలు వస్తుంటారు. దీంతో గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. – కె.రమణి, జొన్నాడ -
మళ్లీ కూతురే..! బయటపడ్డ తండ్రి రాక్షసత్వం
సాక్షి, మహబూబాబాద్: మానవత్వం మంట గలిసింది. మహిళలు, శిశువులపై దేశవ్యాప్తంగా రోజురోజుకు అకృత్యాలు పెరిగిపోతుండగా.. మరోవైపు మగ సంతానం కోరుకుంటూ కసాయి తండ్రులు, కుటుంబ సభ్యులు ఆడశిశువు అని తెలియగానే పురిట్లోనే తమ బిడ్డను కడతేర్చుతున్నారు. భ్రూణహత్యలకూ పాల్పడుతున్నారు. తాజాగా.. మూడో కాన్పూలోనూ కూతురే పుట్టిందని ఓ తండ్రి మానవత్వాన్ని మరచి ప్రవర్తించాడు. అప్పుడే పుట్టిన బిడ్డను పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని నెల్లికుదురు మండలం మెతిరాజుపల్లిలో కట్టకాలువ తండాలో చోటుచేసుకుంది. వివరాలు.. కట్టకాలువ తండాకు చెందిన భానోత్ అనిత, ఈశ్వర్ దంపతులు. వారికి ఇద్దరు కూతుళ్లు. మూడో కాన్పులోనైనా కొడుకు పుడతాడని భావించారు. అనిత పురుడు కోసం వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం భర్తతో సహా వచ్చారు. అయితే, మూడో కాన్పులో సైతం కూతురు పుట్టడంతో.. ఈశ్వర్ తనకు కూతురు వద్దని చెప్పినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఎంత చెప్పినా వినకుండా ఆస్పత్రి నుంచి భార్య, అప్పుడే పుట్టిన పసికందును తీసుకొని సొంతూరుకు చేరుకున్న ఈశ్వర్ పసికందు ప్రాణాలు తీసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పీహెచ్సీలో సిబ్బంది కొరత
మొయినాబాద్(చేవెళ్ల) : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. సరిపడా సిబ్బంది లేకపోగా ఉన్న సిబ్బంది సైతం సమయపాలన పాటించకపోవడంతో ఆస్పత్రికి వచ్చినవారు ఇబ్బందులు పడుతున్నారు. మొయినాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం ఉదయం 8 గంటలకు సుమారు 50 మందికి పైగా చంటిపిల్లల తల్లులు ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే సిబ్బంది ఎవరూ లేకపోవడంతో అక్కడే కూర్చున్నారు. ఉదయం 8 గంటలకే ఆస్పత్రికి రావాల్సిన వైద్య సిబ్బంది తీరిగ్గా 12.30 గంటలకు వచ్చి అప్పడు టీకాలు వేయడం మొదలు పెట్టారు. అప్పటి వరకు చిన్న పిల్లలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దండిగా డబ్బు.. అయినా ఏపీలో జబ్బు!
రాష్ట్రంలో కుంటుబడుతున్న జాతీయ ఆరోగ్య పథకాలు రోగుల చికిత్స, ఔషధాలు, టీకాలకు రూ. వెయ్యి కోట్లకు పైగా ఇచ్చిన కేంద్రం కేంద్ర నిధులు దండిగా ఉన్నా ఖర్చుచేయని రాష్ట్రం రాష్ట్ర వాటా నిధులకూ దిక్కులేని వైనం ఖర్చు చేయని నిధులు రూ.249 కోట్లు.. మార్చి 31తో వెనక్కి! సంచార వైద్య యూనిట్లకు రూ.2.58 కోట్లున్నా.. ఒక్క రూపాయీ వెచ్చించని ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజారోగ్య పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బోధనాసుపత్రుల వరకు ఏ ఆస్పత్రిలోనూ రోగులకు సరైన వైద్యం అందడం లేదు. వివిధ ఆరోగ్య పథకాలకుగాను జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆయా నిధులను సరిగా వినియోగించలేదు. ఫలితంగా ప్రజారోగ్యం మూలనబడుతోంది. విభజనానంతరం ఏపీలో ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు పూర్తవుతున్నా.. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఏ ఒక్క పథకమూ అమలుకు నోచుకోలేదు. ఈ మిషన్ కింద 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.1,044 కోట్లు నిధులు అందాయి. దీనిలో 25 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా జోడించి మొత్తం 32 కేంద్ర ఆరోగ్య పథకాలను ప్రజలకు చేరువ చేయాల్సి ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం జోడించాల్సిన నిధులు ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో(అంటే.. ఈ ఏడాది మార్చి 31నాటికి) ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దాదాపు రూ.249 కోట్లను కేంద్రం వెనక్కి తీసుకునే పరిస్థితి ఏర్పడింది. మాతా శిశు సంరక్షణ ‘వధ’ రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ మరణాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం.. వాటికి తక్షణమే అడ్డుకట్ట వేయాలని సూచించింది. దీనికిగాను సుమారు రూ.400 కోట్లు కేటాయించింది. అయితే, గడిచిన 9 మాసాల్లో రూ.200 కోట్లను కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదు. ఇప్పటికీ ఏటా 600 మందికి పైగా తల్లులు మరణిస్తుంటే, 35 వేల మందికి పైగా శిశువులు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వరుసలో.. రాష్ట్రీయ బాల సురక్షా కార్యక్రమం, శిశు ఆరోగ్యం, పల్స్‌పోలియో, ప్రధాన ఆస్పత్రుల బలోపేతం, వైద్యసిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు వంటి పథకాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో కుంటుపడ్డాయి. డబ్బుండీ.. దరిద్రమే! # వివిధ జిల్లాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్మించాలని రూ.24 కోట్లు కేటాయిస్తే ఇప్పటి వరకూ స్థల సేకరణ కూడా చేయలేదు. దీనివల్ల మారుమూల గ్రామీణ ప్రజలకు వైద్యం గగనంగా మారింది. # అన్ని ఆస్పత్రుల్లోనూ డయాగ్నొస్టిక్స్(వైద్య పరీక్షలు) ఉచి తంగా చేసేందుకు రూ.60 కోట్లు కేటాయిస్తే ఇప్పటి వర కూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఇప్పటికీ అనేక ప్రాం తాల్లో ప్రభుత్వాసుపత్రులకు వెళ్లిన రోగులు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే రక్తపరీక్షలు చేయించుకుంటున్న పరిస్థితి ఉంది. # ఉచిత మందులకు రూ.60 కోట్లు కేటాయిస్తే.. 90 శాతం ఆస్పత్రుల్లో ఇప్పటికీ చిట్టీలు రాసి.. బయట కొనుగోలు చేయాలని సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాణాధార మందులైన కేన్సర్, హీమోఫీలియా వంటి జబ్బులకు సంబంధించిన ఔషధాలను కూడా బయటే కొనుక్కోవాలని రోగులకు సూచిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కనీసం 50 రకాల మందులతో పాటు 17 రకాల రక్తపరీక్షలు జరగాలి. కానీ అలా జరగడం లేదు. # సంచార వైద్య యూనిట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. ఫలితంగా రహదారి ప్రమాదాల్లో గాయపడుతున్న వారికి, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని వారికి వైద్యాన్ని చేరువ చేసి ప్రాణ నష్టాన్ని తగ్గించాలని కేంద్రం భావించింది. దీనికిగాను రూ. 2.58 కోట్లను రాష్ట్రానికి ఇచ్చింది. అయితే, దీనిలో రూ. ఒక్క రూపాయిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదు. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
సంగారెడ్డి అర్బన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు తప్పని సరిగా విధి నిర్వహణలో సమయ పాలన పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే మెడికల్ ఆఫీసర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా వైద్య సేవలందించేందుకు అందుబాటులో ఉండాలన్నారు. వైద్య వృత్తి చాలా పవిత్రమైందని, ఈ వృత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మెడికల్ ఆఫీసర్లపై ఉందని ఆయన తెలిపారు. వైద్యాధికారుల్ని బట్టి మిగిలిన సిబ్బంది కూడా సమయపాలన పాటిస్తారన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్ పేషంట్లకు చికిత్సలు అందించడం కోసం ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఆరోగ్య కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు రోగం నయం చేయడానికి మేమున్నామన్న నమ్మకాన్ని సిబ్బంది కలిగించాలని, వారిని అధైర్యపర్చరాదని సూచించారు. జిల్లాలో జ్వరాలతో ఏ ఒక్కరూ మరణించకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ప్రతీ కేసును డయగ్నైస్ చేయకుండా డెంగ్యూ, చికెన్‌గున్యా అని నిర్థారించవద్దని ఆయన మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. ప్రతి మెడికల్ ఆఫీసర్ పనిచే సే కేంద్ర స్థానంలోనే నివసించాలని అలా ఉండటం వల్ల తమ పరిధిలో గల రోగులకు ఏ సమయంలోనైనా వైద్యసేవలు అందించగలుగుతారన్నారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్య మెరుగుపర్చాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే మెడికల్ ఆఫీసర్లపై ఫిర్యాదులు వస్తున్నాయని ఇక ముందు అలాంటివి రాకుండా జాగ్రత్త వహించాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదనపు జే సీ మూర్తి, డీఎంఅండ్ హెచ్‌వో బాలాజీ పవార్, డీపీవో జగన్నాథ్‌రెడ్డి, డీసీహెచ్ఎస్ డా.నరేంద్ర బాబు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.