సైదాపురం పీహెచ్‌సీ ఎదుట మృతుని బంధువుల ఆందోళన
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సకాలంలో వైద్య సేవలు అందక నెల్లూరు జిల్లా సైదాపురంలో ఆదివారం ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆగ్రహించిన ప్రజలు పీహెచ్‌సీ ఎదుట ధర్నాకు దిగారు. సైదాపురం దళితవాడకు చెందిన మల్లారపు వీరరాఘవయ్య (49) ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం అతడి నోట్లో నుంచి నురుగు రావడంతో సమీపంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు.
అక్కడ కేవలం స్టాఫ్ నర్సు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రథమ చికిత్స కూడా చేయకుండానే గూడూరు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సలహా ఇవ్వడంతో గూడూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు దళితవాడకు చెందిన యువత పీహెచ్‌సీకి చేరుకుని ధర్నాకు దిగారు.
కనీస వైద్య సేవలు అందకపోవడం వల్లే వీరరాఘవయ్య మృతి చెందాడని వాపోయారు. వివిధ పార్టీల నేతలు ఆందోళనకారులకు మద్దతు ప్రకటించారు. ఉన్నతాధికారులు వచ్చేంత వరకు ఆందోళన విరమించమని భీషి్మంచుకు కూర్చున్నారు. ఎస్‌ఐ డీఎస్ విజయ్‌కుమార్ అక్కడకు చేరుకుని సమగ్ర విచారణ జరిపారు. ఇక్కడి పరిస్థితిని రాపూరు సీఐ విజయకృష్ణకు వివరించారు. అక్కడి నుంచే సీఐ ఆందోళనకారులను శాంతింపజేశారు.
– సైదాపురం
Comments
Please login to add a commentAdd a comment