
వైద్యుల కోసం నిరీక్షిస్తున్న చంటిపిల్లల తల్లులు
మొయినాబాద్(చేవెళ్ల) : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. సరిపడా సిబ్బంది లేకపోగా ఉన్న సిబ్బంది సైతం సమయపాలన పాటించకపోవడంతో ఆస్పత్రికి వచ్చినవారు ఇబ్బందులు పడుతున్నారు. మొయినాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం ఉదయం 8 గంటలకు సుమారు 50 మందికి పైగా చంటిపిల్లల తల్లులు ఆస్పత్రికి వచ్చారు.
అప్పటికే సిబ్బంది ఎవరూ లేకపోవడంతో అక్కడే కూర్చున్నారు. ఉదయం 8 గంటలకే ఆస్పత్రికి రావాల్సిన వైద్య సిబ్బంది తీరిగ్గా 12.30 గంటలకు వచ్చి అప్పడు టీకాలు వేయడం మొదలు పెట్టారు. అప్పటి వరకు చిన్న పిల్లలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment