బీహార్‌లో లోక్‌సభ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
లోక్‌సభ ఎన్నికల సన్నాహాల పరిశీలనకు బీహార్‌కు వచ్చిన ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం ఇక్కడి ఏర్పాట్లను సమీక్షించింది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల అధికారులు సమావేశమయ్యారు. బీహార్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.64 కోట్లని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా ఈసారి 9.26 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారని వెల్లడించారు.
బీహార్‌లో 100 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 21 వేలకు పైగా ఉందని రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా చూసేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందన్నారు. ఈసారి అభ్యర్థులకు ప్రచారానికి ఐదు వాహనాలకు బదులు 14 వాహనాల వినియోగానికి అనుమతిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. దేశంలో 18వ లోక్‌సభకు ఎంపీలను ఎన్నుకునేందుకు మరికొద్ది వారాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించింది.
Live from 2 pm today : Press Conference at Patna by Election Commission after Review of Poll-preparedness of #Bihar & #Jharkhand for #GeneralElection2024 https://t.co/G33lHSAJxg
— Spokesperson ECI (@SpokespersonECI) February 21, 2024
Comments
Please login to add a commentAdd a comment