New Baby
-
చిమ్మచీకటి.. జోరు వర్షం.. పసికందును విసిరేసిన తల్లిదండ్రులు
భువనేశ్వర్: చిమ్మచీకటి.. జోరు వర్షంలో బస్తాలో చుట్టి, పసికందును విసిరేసిన తల్లిదండ్రుల కాఠిన్యానికి పిడుగులు కూడా మిన్నకుండిపోయాయి. జనం కంట కనిపించే వరకు మెరుపులే తోడుగా నిలిచి, ముక్కు పచ్చలారని చిన్నారిని కాపాడుకున్నాయి. మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన మానవత్వానికి మాయని మచ్చగా తారస పడింది. వివరాల్లోకి వెళ్లే శనివారం వేకువజామున మల్కన్‌గిరి తోలాసాహి(దిగువ వీధి) వైపు వెళ్తున్న స్థానికులకు ఏడుపు వినిపించడంతో వెళ్లి చూడగా, చెత్తకుప్ప వద్ద బియ్యం బస్తాలో చుట్టి ఉన్న పసికందు కనిపించింది. వెంటనే చైల్డ్‌లైన్ సిబ్బందికి సమాచారం అందించడంతో పాటు మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. బిడ్డ ఆరోగ్యంగానే ఉందని, పుట్టి ఒక రోజే కావస్తుందని తెలిపారు. ఆస్పత్రికి చేరుకున్న ఐఐసీ రీగాన్ కీండో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పసికందు తల్లిదండ్రుల వివరాలపై ఆరా తీస్తున్నారు. చదవండి విదేశీయుని వద్ద రూ.5000 చలానా వసూలు చేసిన పోలీసు.. రిసిప్ట్ ఇవ్వకుండానే.. వీడియో వైరల్.. -
వైరల్: ఊపిరి ఊది ప్రాణం పోసిన డాక్టరమ్మ
వైరల్: రాత రాసేది బ్రహ్మ.. ప్రాణం మోసేది అమ్మ.. మరి ఆ ప్రాణం నిలిపేది?.. ఇంకెవరు దైవంతో సమానమైన వైద్యులు. ఇక్కడో డాక్టరమ్మ అప్పుడే పుట్టిన ఓ బిడ్డకు ప్రాణదానం చేసింది. ఒక తల్లికి గుండెకోతను తప్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నార్మల్ డెలివరీ ద్వారా పుట్టిన ఓ ఆడబిడ్డ.. చలనం లేకుండా ఉంది. ఆ బిడ్డకు శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారిందని వైద్యులు గుర్తించారు. దీంతో.. ఆక్సిజన్ సపోర్ట్ ద్వారా బిడ్డకు ఊపిరి అందించే యత్నం చేశారు వైద్యులు. అయితే.. నవజాత శిశువు కావడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో.. నోటి ద్వారా శ్వాసను అందించడానికి సిద్ధమైంది అక్కడే ఉన్న ఓ డాక్టరమ్మ. అలా ఏడు నిమిషాలపాటు శ్వాస అందించింది. వేర్వేరు ప్రయత్నాలు చేసింది. చివరకు బిడ్డ ఊపిరి పీల్చుకుంది. కళ్లు తెరిచిన ఆ బిడ్డను చూసి ఆ వైద్యురాలు ఎంతగానో మురిసిపోయింది. వెల కట్టలేని క్షణం అది!. ఆగ్రా ఎట్మాదపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మార్చి నెలలోనే ఈ ఘటన జరిగింది. ఆ వైద్యురాలి పేరు డాక్టర్ సులేఖ చౌదరి. సచిన్ కౌశిక్ అనే యూపీ అధికారి తాజాగా ఈ వీడియోను వైరల్ చేయడంతో.. ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. डॉक्टर सुलेखा चौधरी, पीडियाट्रीसियन, CHC, आगरा। बच्ची का जन्म हुआ लेकिन शरीर में कोई हलचल नहीं थी। बच्ची को पहले ऑक्सिजन सपोर्ट दिया, लेकिन जब उससे भी लाभ नहीं हुआ तो लगभग 7 मिनट तक ‘माउथ टू माउथ रेस्पिरेशन’ दिया, बच्ची में साँस आ गई।👏🏼❤️#Salute #Doctor #respect pic.twitter.com/1PQK8aiJXQ — SACHIN KAUSHIK (@upcopsachin) September 21, 2022 ఇదీ చూడండి: అన్యోన్యం.. ఆ అవ్వ ప్రేమకు అంతా ఫిదా -
వింత జననం.. రెండు తలలు, మూడు చేతులతో పసికందు
Baby With 2 Heads And 3 Hands: వైద్యపరిభాషలో పాలీసెఫాలీ కండిషన్. అంటే తల్లి కడుపులో ఉండగానే.. జెనెటిక్ కండిషన్‌తో బిడ్డ వింత ఆకారంలోకి మారిపోతారు. ఇలాంటి పరిస్థితిలో పుట్టిన బిడ్డలు.. ఆరోగ్యంగా ఉండడం కష్టం. సర్జరీ చేసినా.. బతకడమూ కష్టమే!. అలాంటి దీనస్థితికి మధ్యప్రదేశ్‌లో ఓ పసికందుకు ఎదురైంది!. మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ అరుదైన బిడ్డకు జన్మించింది. రాట్లాం జిల్లాలోని జావ్రా గ్రామానికి చెందిన షహీన్.. రెండు తలలు, మూడు చేతులతో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అంతకు ముందు ఆమె నొప్పులు పడ్డ సమయంలో పరిస్థితి విషమించడంతో.. సోనోగ్రఫీ చేశారు. ఆ రిపోర్టులో గర్భంలో కవలలు ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఆపరేషన్ చేశాక మాత్రం ఒకే శరీరానికి రెండు తలలు మూడు చేతులు ఉండడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. తలల మధ్య వెనక నుంచి మూడో చేయి ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బిడ్డను వెంటనే నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ యూనిట్ (ఎస్ఎన్సీయూ)కు తరలించారు. ఆపై ఇండోర్‌లోని ఎంవై ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించారు. శిశువు పరిస్థితి విషమంగా ఉందని ఎస్ఎన్సీయూ ఇన్చార్జ్ డాక్టర్ నవీద్ ఖురేషీ తెలిపారు. ఇలాంటి కేసుల్లో శిశువు గర్భంలోనే మరణిస్తుందని, లేదంటే పుట్టిన 48 గంటల్లోనైనా ప్రాణాలు కోల్పోవచ్చని చెప్పారు. సర్జరీ చేసే అవకాశం ఉన్నా.. 60-70 శాతం మంది చిన్నారులు బతకడం లేదని డాక్టర్ నవీద్ తెలిపారు. -
ఉక్రెయిన్ చీకట్లో వెలుగు రేఖ! ఈ బిడ్డను చూసైనా పుతిన్ మనసు కరిగేనా?
Ukraine Hope In Darkness New Baby Photos Viral: యుద్ధ మేఘాలు అలుముకోవడంతో చీకట్లు కమ్మేశాయి. ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఉక్రెయిన్ పౌరులు. అంతలో పురిటి నొప్పులతో దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది ఆ తల్లి. ఆ క్షణం ఈ లోకంలోకి వచ్చిన బిడ్డ ఏడ్పు.. అక్కడున్న వారి పెదాలపై చిరునవ్వు పూయించింది. ఉక్రెయిన్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడానికి కొన్ని క్షణాల ముందు వైరల్ అయిన ఆ ఫొటోల్ని.. సోషల్ మీడియా భావోద్వేగంగా భావిస్తోంది. ఆ బిడ్డే తమ ఆశాకిరణంగా, యుద్ధ చీకట్లు పారదోలే వెలుగు రేఖగా భావిస్తోంది యావత్ ఉక్రెయిన్. రష్యా మిలిటరీ చర్యతో భీకర యుద్ధం ఉక్రెయిన్ను వణికిస్తోంది. రష్యా సైన్యం రక్తదాహానికి బలవుతున్న ఉక్రెయిన్ పౌరుల సంఖ్య పెరిగిపోతోంది. నివాస ప్రాంతాల్లో సైతం రష్యా బలగాలు దాడులకు పాల్పడుతుండడంతో.. ప్రాణభీతితో బంకర్లలో, మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్లలో బాంబుల మోతకు దొరక్కుండా తలదాచుకుంటున్నారు పౌరులు. రాజధాని కీవ్‌లో మెట్రోతో పాటు బాంబ్ షెల్టర్, మరో 4500 షెల్టర్ హోమ్స్ ఉన్నాయి. అక్కడే వేల మంది తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజధాని కీవ్‌లో అండర్ గ్రౌండ్లో దాక్కొన్న ఓ గర్భిణికి శుక్రవారం రాత్రి సమయంలో హఠాత్తుగా నొప్పులు వచ్చాయి. దీంతో అక్కడే ఉన్న వైద్య సిబ్బంది, పోలీసులు ఆమెకు సాయపడ్డారు. బయట బాంబుల మోత మోగుతున్నా.. రెండు నిండు ప్రాణాలు కాపాడేందుకు తొణకకుండా వైద్యం అందించారు. చివరకు ఆ తల్లి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి, తల్లి, ఆ కుటుంబం క్షేమంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధికారులు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కనీసం ఈ బిడ్డలాంటి వాళ్లను చూసైనా పుతిన్ మనసు కరగాలని ప్రార్థిస్తున్నారు నెటిజన్లు. First (to our knowledge) baby was born in one of the shelters in Kyiv. Under the ground, next to the burning buildings and Russian tanks… We shall call her Freedom! 💛💙 Believe in Ukraine, #StandWithUkraine pic.twitter.com/gyV7l2y9K1 — MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) February 26, 2022 మరోవైపు నిప్రోలో రష్యా బాంబుల ధాటికి బెదరకుండా.. వైద్య సిబ్బంది 12 మంది నవజాత శిశువులను అండర్ గ్రౌండ్‌కు తరలించి.. ప్రాణాలు నిలిపారు. ఎంతో మంది గర్భిణిలు ఇబ్బందులు పడకుండా వైద్య సేవలు అందిస్తోంది సిబ్బంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే లక్ష మంది ఉక్రెయిన్ పౌరులు యుద్ధ వాతావరణంలో చెల్లాచెదురయ్యారు. గురువారం ఒక్క రోజే సుమారు 35వేల మంది పోలాండ్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. సుమారు 50 లక్షల మంది ఉక్రెనియన్లు విదేశాలకు తరలివెళ్లే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. నిప్రో నర్సు పర్యవేక్షణలో పసికందులు -
అప్పుడే పుట్టిన నవజాత శిశువు పై చిరుత దాడి! ఐతే ఆ తర్వాత.
Cheetah swoops on newborn baby: ఇంతవరకు మనం చిరుతలు, సింహాలు మనుషులు, జంతువుల పై దాడి చేసిన వీడియోలను చూశాం. ఒక్కొసారి కొన్ని జంతువులు ఆ చిరుతలు, సింహాల పై ఎదురుదాడిన చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడొక చిరుత పులి ఇంటిలో ఎవ్వరు లేరని ఒక నవజాత శిశువు పై వేగంగా దూసుకుపోతుంది. కానీ పాపం చిరుత తోక ముడిచి వెనక్కి వెళ్లిపోయింది ఎందుకో తెలుసా!. అసలు విషయంలోకెళ్తే...యూకేలోని వెస్ట్ మిడ్లాండ్స్ సఫారీ పార్క్‌లో ఒక పసి కందు నేలపై పాకుతూ ఆడుకుంటు ఉంటాడు. వాడు చాలా అమాయకంగా ఎదురుగా ఉన్న గుమ్మం వరకు పాక్కుంటూ వచ్చేశాడు. అయితే ఇంతతో ఒక చిరుత పులి చాలా వేగంగా ఆ పసివాడిపై దాడి చేసేందుకు యత్నించింది. నిజంగానే చంపేస్తుందేమో అనిపిస్తుంది. కానీ మధ్యలో ఒక పారదర్శకమైన గాజు అద్దం ఉండటం వల్ల ఆ పిల్లాడి బతికిపోతాడు. దీంతో ఆ చిరుత దాడి చేయలేనని భావించి వెనుదిరిగి వెళ్లిపోతుంది. అయితే ఆ చిన్నారి చిరుత దాడి చేసేందుకు వచ్చినప్పుడు భయపడి గుక్కపెట్టి ఏడవడం జరుగుతుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఆ చిరుత వేగానికి అద్దం పగలి ఉంటే ఏమై ఉండేది..ఊహిచడానికే భయం వేస్తుంది అంటూ రకరకాలుగా కామెంట్లు చేశారు. (చదవండి: గాల్లో ప్రాణాలు.. గగుర్పాటుకు గురిచేసిన వీడియో) -
సులభ్ కాంప్లెక్స్‌లో నవజాత శిశువు మృతదేహం.. ఎన్నో అనుమానాలు!
సాక్షి, కరీంనగర్: నగరంలోని రాంనగర్ సులభ్ కాంప్లెక్స్‌లో శనివారం ఉదయం నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. రాంనగర్ చేపల మార్కెట్ వద్ద గల సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకులు ఉదయం లోపలికి వెళ్లగా దుర్వాసన వచ్చింది. పరిశీలించి, శిశువు మృతదేహమని గుర్తించి, పోలీసులకు సమచారం అందించారు. అదనపు డీసీపీ ఎస్.శ్రీనివాస్(లాఅండ్ఆర్డర్), సీఐ లక్ష్మీబాబు, ఎస్సై తోట మహేష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. శిశువు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. శిశువు ఇక్కడే జన్మించి, చనిపోయిందా లేదా మృతిచెందిన శిశువును తీసుకొచ్చి పడేశారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి ఓ మహిళ వచ్చి వెళ్లినట్లు స్థానికులు పేర్కొన్నారు. చదవండి: ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. గోల్కొండ ఖిల్లా నుంచి జారిపడి -
అప్పుడే పుట్టిన తన బాబును ఎత్తుకుని.. ఆనందం తట్టుకోలేక..
దంపతులను తమ జీవితాల్లోని మధుర క్షణాలను గురించి అడిగితే వారు ఫస్ట్ చెప్పేది.. వారి మొదట సంతాన జననం, ఆ సమయంలో వారికి కలిగిన ఆ ఆనందం. ఎందుకంటే భార్యాభర్తలు తొలిసారి తల్లిదండ్రులుగా మారినప్పుడు ఇక వాళ్ల ఆనందానికి అవధులు ఉండవు. అదొక ప్రత్యేకమైన అనుభూతి. అది అనుభవించడం తప్ప మాటల్లో వర్షించలేం. తమకో బంధం దొరికిందని మురిసిపోతారు భార్యాభర్తలు. అలానే ఓ తండ్రి.. తనకు కొడుకు పుట్టాడని తెలుసుకొని సంబరపడి పోయాడు. వెంటనే ఆసుపత్రికి వచ్చి తన బాబుని ఎప్పుడెప్పుడు చూస్తానా అంటూ తహతహలాడుతున్నాడు. అంతలో నర్సు ఆ బాబును తీసుకొచ్చింది. తన కొడుకుని చూడగానే ఆ తండ్రి తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. తన కొడుకును చేతుల్లో తీసుకోవాలనే తొందర ఓ వైపు, కళ్ల నిండా కనీళ్లు మరో వైపు అలా ఆ తండ్రి భావోద్వేగానికి గురయ్యాడు. చివరకి ఆ బాబుని తీసుకున్నప్పుడు ఆ తండ్రి కళ్లలో తన ప్రేమను కన్నీళ్ల రూపంలో చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వాళ్లు ఆ తండ్రి భావోద్వేగాన్ని చూసి చలించిపోతున్నారు. First-time father holds his newborn baby for the first time. (🎥:Chrisxia29_) pic.twitter.com/C7s63CMpGv — GoodNewsCorrespondent (@GoodNewsCorres1) September 19, 2021 -
నిజంగా ఆపిల్ పండు లాంటి బిడ్డ, కట్ చేస్తే..
ఆపిల్‌పండు లాంటి బిడ్డను కనమని కాబోయే తల్లులను దీవిస్తుంటారు పెద్దలు. కానీ, సింగపూర్‌లో నిజంగానే యాపిల్ పండు సైజులో ఓ బిడ్డ పుట్టింది. అయితే బతకడం కష్టమనుకున్న తరుణంలో దాదాపు 25 వారాలపాటు శ్రమించిన డాక్టర్లు.. ఎట్టకేలకు ఆ బిడ్డను ఆరోగ్యవంతమైన బరువుకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు. సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్(NUH)లో కిందటి ఏడాది జూన్ 9న నెలలు నిండకుండానే ఓ పాప పుట్టింది. కేవలం 24 సెంటీమీటర్ల పొడవు, కేవలం 212 గ్రాముల బరువుతో పుట్టందా పాప. దీంతో సగటు ఆపిల్ పండు కన్నా తక్కువ బరువు ఉందంటూ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది ఆ చిన్నారి. అయితే బతకడం కష్టమని డాక్టర్లు తేల్చేయడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. వాళ్ల శోకాన్ని అర్థం చేసుకుని రిస్క్ చేసి మరీ 13 నెలలపాటు ఫ్రీ ట్రీట్మెంట్ ద్వారా ప్రయత్నించారు ఎన్హెచ్యూ వైద్యులు. 13 నెలల ఐసీయూ చికిత్సలో అద్భుతం జరిగింది. చివరికి 6.3 కేజీల ఆరోగ్యవంతమైన బరువుకు చేరిన ఆ చిన్నారిని.. ఈమధ్యే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ బిడ్డకు వెక్(క్వెక్) యూ గ్జువాన్ అని పేరుపెట్టుకున్న ఆ తల్లిదండ్రులు.. చిన్నారి ఆరోగ్యంగా తమ చేతికి దక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ లోవా రికార్డుల ప్రకారం.. అమెరికాలో 245 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి పేరిట రికార్డు ఉండగా.. వెక్ యూ గ్జువాన్ ఆ రికార్డును చెరిపేసింది. -
కాళ్లూచేతులు లేని వింత శిశువు జననం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి కుములి ప్రాథమిక వైద్య కేంద్రంలో ఓ గర్భిణి శుక్రవారం వింతశిశువును ప్రసవించింది. జన్మించిన శిశువుకు కాళ్లూచేతులు లేకపోవడం గమనించిన వైద్యులు కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. శిశువు అలా జన్మించడానికి గల కారణాలను వైద్యులు అధ్యయనం చేస్తున్నారు. అయితే జన్మనిచ్చిన తల్లి పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడంతో శిశువు ఈ విధంగా జన్మించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. చదవండి: వింత.. శిశువు కాలికి తొమ్మిది వేళ్లు -
అప్పుడే పుట్టిన శిశువుకు పాజిటివ్.. తల్లికేమో నెగెటివ్, షాక్‌లో వైద్యులు
లక్నో: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను ఇబ్బంది పెడుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎవరినుంచి ఈ మహమ్మారి సోకుతుందో అనే భయం. ఈ నేపథ్యంలో తల్లి కడపులో నుంచి ఓ ఆడ శిశువు కరోనా పాజిటివ్‌తో ప్రపంచంలోకి వచ్చింది. ఇదిలా ఉండగా.. శిశువు తల్లికి మాత్రం నెగెటివ్ రావడంతో వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన యూపీలోని వారణాసిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మే 24న పురిటి నొప్పులతో సుప్రియ అనే మహిళ వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు) లోని ఎస్.ఎస్. ఆసుపత్రిలో చేరింది. ప్రసవానికి ముందు ఆమెకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్‌గా నిర్థారణ అయ్యింది. డెలివరీ చేసిన వైద్యులు మర్నాడు ఆమెకు పుట్టిన పాపకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యసిబ్బందితో పాటు సుప్రియ కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై సుప్రియ భర్త మాట్లాడుతూ.. ఇది వింతగా ఉంది. కరోనా పరీక్షల ఫలితాన్ని చూసి మా కుటుంబ సభ్యులందరిలోను గందరగోళం నెలకొంది. ఒక వేళ పరీక్ష ఫలితాలు తప్పుగా ఉన్నాయో లేదో మాకు అర్థం కాలేదు. వీటి గురించి తెలుసుకోవడానికి ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ కాల్స్ చేయగా ఆయన స్పందించడంలేదని ఆమె భర్త తెలిపాడు. అయితే, శిశువుకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యినట్లు బీహెచ్‌యూ రిజిస్ట్రార్ నీరజ్ త్రిపాఠి ధృవీకరించారు. ప్రస్తుతం తల్లి ,బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని ఆయన వెల్లడించారు. చదవండి: తుఫాన్ వస్తుంటే బయటకొచ్చావ్ ఏంటి.. రిప్లై ఏంటో తెలుసా -
యాస్ తుపాను ‘అల’జడిలో జననం
భువనేశ్వర్: ‘యాస్’ తుఫాన్ అలజడి సమయంలోనూ పలు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. బాలాసోర్, భద్రక్, జగత్సింగ్పూర్, కేంద్రాపడా జిల్లాల్లో తుపాను ముంచెత్తుతున్న తరుణంలో పలువురు గర్భిణులు ప్రసవించారు. తల్లీబిడ్డలంతా క్షేమంగా ఉన్నట్లు రాష్ట్ర సమాచార, ప్రసార విభాగం ప్రకటించింది. నెలలు నిండిన గర్భిణులను అంబులెన్సుల్లో తుఫాన్‌కు ముందుగానే ప్రసూతి కేంద్రాల్లో చేర్చిన విషయం తెలిసిందే. జగత్సింగ్పూర్ జిల్లాలో నెలలు నిండిన 31 మంది గర్భిణుల్లో 10 మంది ప్రసవించినట్లు సమాచారం. ఇతర ప్రాంతాల సమాచారం అందాల్సి ఉంది. -
వింత: శిశువు కాలికి తొమ్మిది వేళ్లు
సాక్షి, బళ్లారి: కాలికి తొమ్మిది వేళ్లతో శిశువు జన్మించిన అరుదైన ఘటన హొసపేటెలో చోటు చేసుకుంది. హొసపేటె తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన గర్భిణి కాన్పు కోసం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. బుధవారం ఆమె మగబిడ్డకు జన్మ ఇచ్చింది. అయితే శిశువు ఎడమ కాలికి తొమ్మిది వేళ్లు ఉండటం వైద్యులను ఆశ్చర్యపరిచింది. ఇలా తొమ్మిది వేళ్లతో జన్మించిన బాలురు ప్రపంచంలో 20 మంది ఉన్నారని వైద్యులు తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. -
మహమ్మారిని జయించిన 25 రోజుల నవజాత శిశువు
-
కరోనాను జయించిన నవజాత శిశువు
భువనేశ్వర్: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ తీవ్రత కారణంగా రోజూ వేలది సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అంతటి భయంకరమైన మహమ్మారిపై ఓ నవజాత శిశువు వెంటిలేటర్‌పై 10 రోజుల పోరాడి విజయం సాధించాడు. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది. ఈ శిశువుకు చికిత్స చేసిన వైద్యుడు మాట్లాడుతూ.. ప్రాణాంతక వైరస్‌తో మూడు వారాల పోరాటం తర్వాత కోలుకోగా. ఈనెల 12వ తేదీన ఆ శిశువుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. 10 రోజులు వెంటలేటర్‌పై పోరాటం ఛత్తీస్‌గఢ్‌లోని కలహండి జిల్లాకు చెందిన అగర్వాల్ భార్య ప్రీతి అగర్వాల్ ఇటీవల ఓ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన 15 రోజులకే జ్వరం రావడంతో అగర్వాల్ దంపతులు భువనేశ్వర్‌లోని జగన్నాథ్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సమక్షంలో కరోనా పరీక్షలు నిర్వహించగా ఆ శిశువుకు పాజిటివ్ అని తేలడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆ శిశువుకు చికిత్స చేసిన నియోనటాలజిస్ట్ డాక్టర్ అరిజిత్ మోహపాత్ర మాట్లాడుతూ.. నవజాత శిశువు కాబట్టి వెంటిలెటర్‌పై ఉంచామని, రెమ్డెసివిర్తో సహా ఇతర యాంటీబయాటిక్స్ ఇచ్చినట్లు చెప్పారు. తల్లిదండ్రుల అనుమతితో రెమ్‌డెసివిర్‌ను ఇంజెక్షన్ ఇచ్చాము. చివరకు చికిత్స సానుకూలంగా స్పందించి, కోలుకున్నట్లు తెలిపారు. పుట్టిన వెంటనే తమ చిన్నారికి వైరస్ సోకడంతో తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యారు. పది రోజుల్లో ఆ శిశువు కోలుకొని కరోనా పై విజయం సాధించడంతో ఇప్పుడు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ( చదవండి: బెలూన్లు ఊది.. ఒక్క ఊపిరితిత్తితోనే కరోనాను జయించిన నర్సు ) -
కనుపాపనై వచ్చా.. కన్నీరై కరిగిపోయా!
అమరావతి, సత్తెనపల్లి: అమ్మ చనుబాల తీపి పూర్తిగా చవిచూడనే లేదు. అమ్మ పొత్తిళ్ల వెచ్చదనాన్ని అనుభవించలేదు.నాన్న గుండెల్లో ఉప్పొంగే అనంతమైన ప్రేమ మాధుర్యం ఇంకా తాకనే లేదు. కనుగుడ్లు తెరిచీ తెరవక ముందే నా కళ్లు శాశ్వతంగా మూతబడ్డాయి. నా పసి ప్రాణం పంచ భూతాల్లో కలిసిపోయింది. ఆరు రోజుల్లోనే నూరేళ్ల నిండు జీవితం ముగిసిపోయింది. నేను ఏం పాపం చేశానని.. అనంత లోకాలకు ఆయువుపోసే ఆడ బిడ్డననా? వరకట్నాల కటకటాలు తెంచలేని అభాగ్యురాలిననా? తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ఆరు రోజుల చిన్నారి ఆత్మఘోష ఇది. సత్తెనపల్లి మండలం ధూళ్ళిపాళ్ల గ్రామ శివారులోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్యశాల సమీపంలోని బ్రిడ్జి పక్కన నేలపై దుప్పటి వేసి ఆరు రోజుల శివువును గుర్తు తెలియని వారు గురువారం వదిలి వెళ్లారు. అక్కడి ఆనవాళ్లను పరిశీలిస్తే గురువారం తెల్లవారుజామున వదిలి ఉండవచ్చునన్నట్లు ఉంది. స్థానికులు శిశువు మృతి చెంది ఉండడం చూసి డయల్ 100కు సమాచారం అందించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శిశువు మృతదేహన్ని సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పుత్రోత్సాహంలో బాలీవుడ్ హీరో
బాలీవుడ్ హీరో సుమీత్ వ్యాస్ కుటుంబంలో నూతన ఆనందాలు వెల్లువిరిశాయి. సుమీత్ వ్యాస్, ఎక్తా కౌల్ దంపతులు జూన్ 4(గురువారం) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తమ అభిమనులకు తెలియ జేశారు. ‘మాకు అబ్బాయి జన్మించాడు. తల్లిదండ్రులుగా వాడి ప్రతి క్షణాన్ని మేము ఆస్వాదిస్తున్నాం’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. అంతేగాక బాబుకు అప్పుడే పేరు కూడా పెట్టేశారు. చిన్నోడికి ‘వేద్’ అని నామకరణం చేశారు. పుత్రోత్సాహంతో ఉన్న ఈ జంటకు ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (విరాటపర్వం: ‘కామ్రేడ్ భారతక్క’గా ప్రియమణి) It’s a boy. Shall be called VED. Mamma and Daddy are acting cliché ... smothering the child every few minutes... — Sumeet Vyas (@vyas_sumeet) June 4, 2020 సుమీత్, ఎక్తాలు 2018 సెప్టెంబర్‌లో కశ్మీరి సంప్రదాయం ప్రకారం జమ్మూలో వివాహం చేసుకున్నారు. కాగా ఏప్రిల్ నెలలో తండ్రి కాబోతున్నట్లు సుమీత్ వ్యాస్ వెల్లడించిన విషయం తెలిసిందే. ‘గర్వంగా మా కొత్త ప్రాజెక్టును ప్రకటిస్తున్నాము. త్వరలో జూనియర్ కౌల్, వ్యాస్ రాబోతున్నాడు. దీనికి సుమీత్, నేను దర్మకత్వం, నిర్మాతలుగా వ్యవహరించాం’. అంటూ సినిమాటిక్ భాషలో తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ఎక్తా కౌల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. (బాలీవుడ్ యువ కాస్టింగ్ డైరెక్టర్ మృతి) View this post on Instagram Proudly announcing our new project together. 👶🏻👶🏻 Introducing Jr. KaulVyas (soon) Created, Directed and Produced by US.... @sumeetvyas and I 🙏🏻🙏🏻 A post shared by Ekta Rajinder Kaul (@ektakaul11) on Apr 4, 2020 at 10:19pm PDT -
మంచువారింట ఆనందం
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వేళ మంచు కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. హీరో విష్ణు – విరానికా దంపతులకు అమ్మాయి పుట్టింది. ఇప్పటికే ఈ దంపతులకు వివియానా, అరియానా అనే కవల ఆడపిల్లలతో పాటు అవ్రామ్ అనే కొడుకు ఉన్నాడు. శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు విరానికా. ఈ విషయాన్ని మంచు విష్ణు అభిమానులతో పంచుకున్నారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ విష్ణు–విరానికాలకు శుభాకాంక్షలు తెలిపారు. -
చిన్నారి ‘శ్రీదేవి’ వీడియో చక్కర్లు
-
చిన్నారి ‘శ్రీదేవి’ వీడియో చక్కర్లు
ప్రపంచంలోవున్న ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు వుంటారని నానుడి. అవును కదా.. అనిపించేలా మనలో చాలామంది ఇలాంటి ఉదంతాలను చూసే వింటాం కూడా. మన బంధువులు లేదా సన్నిహితులకు కార్బన్ కాపీలా ఉండే మనుషులను చూసినపుడు ఒకింత ఆశ్చర్యపోతాం. అచ్చం..అలాగే.. జిరాక్స్.. అని అబ్బుర పడతాం..కదా! ఇపుడు నెట్ లో చక్కర్లు కొడుతున్న ఇలాంటి వీడియో ఇలాంటి అనుభవాన్నే మిగుల్చుతోంది. దీన్ని చూస్తే ఆశ్చర్యంతో పాటు ముచ్చటపడిపోవడం మీ వంతు అవుతుంది. ఇక ‘అతిలోకి సుందరి’ వీర ఫాన్స్ కయితే మరింత కన్నుల పండుగే. సూటిగా సుత్తి లేకుండా విషయానికి వస్తే.. బాలనటిగా సినీ జీవితంలోకి ప్రవేశించి.. తనదైన నటనతో టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా అభిమానులను ఆకట్టుకున్న నటి శ్రీదేవి పోలికలతో ఉన్న ఓ చిన్నారి వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెలల వయసున్న ఈ చిన్నారి అచ్చం ..అచ్చుగుద్దినట్టు.. అతిలోకసుందరి శ్రీదేవిలా వుంది.. కాదు..కాదు. అసలు శ్రీదేవి చిన్నప్పటి వీడియోనా ఇది. ఏ సినిమాలోది అబ్బా.. అని సందేహం వచ్చేలా ఉంది. కళ్ళు, ముక్కు, టోటల్‌గా శ్రీదేవి(కాస్మొటిక్ సర్జరీకి ముందు) మాదిరిగా వున్న ఈ చిన్నారి వీడియో సోషల్‌మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. పాప భయంతో బిక్క మొహం పెట్టిందిగానీ, నవ్వితే ముత్యాల వాన కురిసేదేమో....ఇంకెందుకు ఆలస్యం.. చిన్నితల్లీ.. నీకు దృష్టెంత తగిలేనురా అన్నట్టు ఉన్న ఈ బంగారాన్ని మీరూ చూసేయండి మరి.