
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న అదనపు డీసీపీ, సీఐ
సాక్షి, కరీంనగర్: నగరంలోని రాంనగర్ సులభ్ కాంప్లెక్స్‌లో శనివారం ఉదయం నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. రాంనగర్ చేపల మార్కెట్ వద్ద గల సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకులు ఉదయం లోపలికి వెళ్లగా దుర్వాసన వచ్చింది. పరిశీలించి, శిశువు మృతదేహమని గుర్తించి, పోలీసులకు సమచారం అందించారు. అదనపు డీసీపీ ఎస్.శ్రీనివాస్(లాఅండ్‌ఆర్డర్), సీఐ లక్ష్మీబాబు, ఎస్సై తోట మహేష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు.
శిశువు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. శిశువు ఇక్కడే జన్మించి, చనిపోయిందా లేదా మృతిచెందిన శిశువును తీసుకొచ్చి పడేశారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి ఓ మహిళ వచ్చి వెళ్లినట్లు స్థానికులు పేర్కొన్నారు.
చదవండి: ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. గోల్కొండ ఖిల్లా నుంచి జారిపడి
Comments
Please login to add a commentAdd a comment