
Baby With 2 Heads And 3 Hands: వైద్యపరిభాషలో పాలీసెఫాలీ కండిషన్. అంటే తల్లి కడుపులో ఉండగానే.. జెనెటిక్ కండిషన్‌తో బిడ్డ వింత ఆకారంలోకి మారిపోతారు. ఇలాంటి పరిస్థితిలో పుట్టిన బిడ్డలు.. ఆరోగ్యంగా ఉండడం కష్టం. సర్జరీ చేసినా.. బతకడమూ కష్టమే!. అలాంటి దీనస్థితికి మధ్యప్రదేశ్‌లో ఓ పసికందుకు ఎదురైంది!.
మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ అరుదైన బిడ్డకు జన్మించింది. రాట్లాం జిల్లాలోని జావ్రా గ్రామానికి చెందిన షహీన్.. రెండు తలలు, మూడు చేతులతో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అంతకు ముందు ఆమె నొప్పులు పడ్డ సమయంలో పరిస్థితి విషమించడంతో.. సోనోగ్రఫీ చేశారు. ఆ రిపోర్టులో గర్భంలో కవలలు ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఆపరేషన్ చేశాక మాత్రం ఒకే శరీరానికి రెండు తలలు మూడు చేతులు ఉండడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. తలల మధ్య వెనక నుంచి మూడో చేయి ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
బిడ్డను వెంటనే నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ యూనిట్ (ఎస్ఎన్‌సీయూ)కు తరలించారు. ఆపై ఇండోర్‌లోని ఎంవై ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించారు. శిశువు పరిస్థితి విషమంగా ఉందని ఎస్ఎన్‌సీయూ ఇన్‌చార్జ్ డాక్టర్ నవీద్ ఖురేషీ తెలిపారు. ఇలాంటి కేసుల్లో శిశువు గర్భంలోనే మరణిస్తుందని, లేదంటే పుట్టిన 48 గంటల్లోనైనా ప్రాణాలు కోల్పోవచ్చని చెప్పారు. సర్జరీ చేసే అవకాశం ఉన్నా.. 60-70 శాతం మంది చిన్నారులు బతకడం లేదని డాక్టర్ నవీద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment