Cheetah swoops on newborn baby: ఇంతవరకు మనం చిరుతలు, సింహాలు మనుషులు, జంతువుల పై దాడి చేసిన వీడియోలను చూశాం. ఒక్కొసారి కొన్ని జంతువులు ఆ చిరుతలు, సింహాల పై ఎదురుదాడిన చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడొక చిరుత పులి ఇంటిలో ఎవ్వరు లేరని ఒక నవజాత శిశువు పై వేగంగా దూసుకుపోతుంది. కానీ పాపం చిరుత తోక ముడిచి వెనక్కి వెళ్లిపోయింది ఎందుకో తెలుసా!.
అసలు విషయంలోకెళ్తే...యూకేలోని వెస్ట్ మిడ్‌లాండ్స్ సఫారీ పార్క్‌లో ఒక పసి కందు నేలపై పాకుతూ ఆడుకుంటు ఉంటాడు. వాడు చాలా అమాయకంగా ఎదురుగా ఉన్న గుమ్మం వరకు పాక్కుంటూ వచ్చేశాడు. అయితే ఇంతతో ఒక చిరుత పులి చాలా వేగంగా ఆ పసివాడిపై దాడి చేసేందుకు యత్నించింది. నిజంగానే చంపేస్తుందేమో అనిపిస్తుంది. కానీ మధ్యలో ఒక పారదర్శకమైన గాజు అద్దం ఉండటం వల్ల ఆ పిల్లాడి బతికిపోతాడు.
దీంతో ఆ చిరుత దాడి చేయలేనని భావించి వెనుదిరిగి వెళ్లిపోతుంది. అయితే ఆ చిన్నారి చిరుత దాడి చేసేందుకు వచ్చినప్పుడు భయపడి గుక్కపెట్టి ఏడవడం జరుగుతుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఆ చిరుత వేగానికి అద్దం పగలి ఉంటే ఏమై ఉండేది..ఊహిచడానికే భయం వేస్తుంది అంటూ రకరకాలుగా కామెంట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment