![Any One See This Pink Pigeon In UK Why It Is Pink - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/19/pigeon.jpg.webp?itok=enNbQm9b)
పావురం అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. పూర్వం వాటిని సమాచారాన్ని చేరే వేసే సాధనాలుగా ఉపయోగించేవారు. ఇటీవల ఈ పావురాలను పెంచేందుకు భయపడే పరిస్థితులు తలెత్తాయి కూడా. వాటి విసర్జకాల వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని పలువురు హెచ్చరించడం జరిగింది. దీంతో ఒకరకంగా వాటిని పెంచడం, ఆహారం వేయడం తగ్గించారు ప్రజలు. వాటి సంఖ్యను తగ్గించాలని చూస్తున్నారు ఆరోగ్య నిపుణులు కూడా. ఇలా ఉండగా గూలాబీ రంగులో ఉన్న ఓ పావురం ప్రజల ముందు హఠాత్తుగా ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది.
యూకేలోని గ్రేట్ మాంచెస్టర్ వద్ద టౌన్ సెంటర్ సమీపంలో వాకింగ్ చేసేవాళ్లు ఓ పక్క, మరోవైపు పోలీసుల పెట్రోలింగ్‌తో జన సందోహంగా ఉన్న ప్రదేశంలో ఈ పక్షి కనువిందుఉ చేసింది. ఏదైన రంగు దానిపై పడటం వల్ల అలా ఉందా అని అనుమానాలు కూడా మొదలయ్యాయి. నిజానికి పావురాలు తెలుపు, నలుపు, బుడిద రంగులోనే ఎక్కువగా ఉంటాయి. అవేమి కాకుండా పింక్ రంగులో ఉండడం అనేది అత్యం అరుదు అనే చెప్పాలి. మొదటగా చూసిన వెంటనే దాన్ని పావురమే ప్రజలు అనుకోలేదు. ఏదో వింత పక్షి అనే అనుకున్నారు అంతా.
కాసేపటికి గానీ అర్థకాలేదు అది పింక్‌కలర్‌లో ఉన్న ఓ పావురమేనని. ఇదిలా ఉండగా గతంలో న్యూయార్క్ నగరంలో జెండర్ రివీల్ పార్టీలో అట్రాక్షన్ కోసం అని ఓ పావురానికి గూలాబిరంగు వేసి ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ పావురాన్ని రక్షించడమే గాక అది పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దాన్ని వైల్డ్ బర్డ్ ఫండ్‌కు తరలించారు. అలానే ఈ పక్షికి కూడా ఎవరైన గూలాబీ రంగు వేశారేమోనని సందేహిస్తున్నారు.
అయితే ఈ పావురం బంధింపబడలేదు. మిగతా పావురాల్లో స్వేచ్ఛగా ఎగురుతూ కనిపించింది. ఎందువల్ల ఆ పావురం ఇలా గూలాబీ రంగులో ఉందనేది తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన ఫోటోను నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో చూసిన యూకేలోని స్థానికులు, పోలీసు అధికారులు తాము కూడా ఈ వింత పావురాన్ని చూసినట్లు తెలపడం విశేషం.
Has anyone else seen this pink pigeon in Bury and does anyone know why it is pink?! #Bury #pinkpigeon #pigeon #pink #bird pic.twitter.com/wrx63R21TP
— Harriet Heywood (@Heywoodharriet_) September 9, 2023
Comments
Please login to add a commentAdd a comment