ఫుల్‌గా తాగితే మనిషి ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కపడితే అక్కడ పడిపోయి ఉంటాడు. పైగా ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. అలా తాగేసి రోడ్లపై పడిపోయిన వాళ్లు ఎందరో ఉన్నారు. అయితే ఇలా క్రూర జంతువులు తాగినే పరిస్థితి ఇలానే ఉంటుందా? అంటే కచ్చితంగా చెప్పలేం అవి కూడా మత్తులోనే జోగుతాయని. కానీ ఇక్కడొక చిరుతని చూస్తే అవి కూడా ఇంతేనా! అని అనుకుంటారు.
అసలేం జరిగిందంటే..బీహార్ రాష్ట్రంలో అడవికి దగ్గరగా ఉన్న ఓ మారుమూల గ్రామంలో మద్యం తయారీ కర్మాగారం ఉంది. అయితే అందులోకి ఓ చిరుత పులి అనుకోకుండా ప్రవేశించింది. పైగా అక్కడ ఉండే మద్యాన్ని ఫుల్‌గా తాగేసింది. పాపం ఆ మద్యం సేవించిన తర్వాత అది ఒక్కసారిగా మత్తులోకి వెళ్లిపోయింది. కనీసం అడుగు తీసి అడుగువేయలేనంత మత్తులోకి వెళ్లిపోయింది.
ఇంతలో కర్మాగారంలో పనిచేసే సిబ్బంది అక్కడకు వచ్చారు. మొదట ఆ చిరుతను చూసి వారంతా భయపడ్డారు. అయితే అది అలాగే పడుకుని ఉండటం చూసి బహుశా మద్యం తాగేసి ఉంటుంది అందుకే అలా ఉందని అనుకున్నారు. అయినప్పటికి అది ఇక్కడే ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అనుకుని దాన్ని అక్కడ నుంచి బయటకు పంపే యత్నం చేశారు. ఇంతలో అది లేచింది. కానీ నడిచే మూడ్‌లో అస్సలు లేదు. ఇక వాళ్లు ఎలాగో లేచింది కదా అని నెమ్మదిగా బయటకు వెళ్లేలా చేశారు.
అయితే అక్కడున్న వారంతా దాని దగ్గరకు వచ్చి దాని మీద చేయి వేసినా.. కిమ్ అనకుండా ఉంది. పైగా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రశాంతంగా వెళ్తోంది. అందుకు సంబంధించిన ఘటనను ఓ ఔత్సాహికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లంత ఆశ్చర్యం వ్యక్తం చేయడమే గాక ఆ పులి గనుకు మత్తులో లేకుంటే మీ అందరి తలలు తీసుకువెల్లేది అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(చదవండి: మంచు పడవ..కేవలం శిల్పం కాదు! అలా నీటిలో చక్కర్లు కొట్టేయొచ్చు!)
Comments
Please login to add a commentAdd a comment