బీహార్‌లోని పూర్నియా జిల్లాలో అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యేందుకు కొందరు వ్యక్తులు వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై బయలుదేరారు. సుమారు 20 మంది ఉన్న ఆ తెప్ప అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది. దీంతో ఆ తెప్పపై ఉన్న వారంతా నదిలో పడిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నదిపై వంతెన లేకపోవడంతో వెదురు కర్రలతో తాత్కాలికంగా ఒక తెప్పను తయారు చేసుకుని పిల్లలు, పెద్దలతో సహా సుమారు 20 మంది ఆ తెప్పపై నది దాటేందుకు ప్రయత్నించారు. ఆ తెప్పను తాడు సహాయంతో అవతలి ఒడ్డువైపు లాగేందుకు దానిపై ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. అధిక బరువు కారణంగా ఆ తెప్ప అదుపుతప్పింది. నదిలో పడిన వారంతా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Video: 20 Headed For Funeral On Makeshift Raft Fall Into River In Bihar pic.twitter.com/0fRdhnRdpw
— NDTV (@ndtv) October 17, 2024
Comments
Please login to add a commentAdd a comment