బిహార్ భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు మూతపడ్డాయి. అనేక రైళ్లు రద్దయ్యాయి. పలు యూనివర్సిటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. వర్షాల కారణంగా బిహార్‌లో ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక రాష్ట్రంలోని దాదాపు 12 జిల్లాలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సాధారణ నీటిమట్టాన్ని దాటి అధికంగా పారుతున్నాయి. చాలా చోట్ల గంగా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుంది.
మమ్లాఖా జిల్లాలో గంగా నదీ ఉగ్రరూపానికి దాదాపు 10 ఇళ్లు కొట్టుకుపోయాయి. రెండు, మూడు అంతస్థుల నిర్మాణాలు సైతం నదిలోకి జారుకొని కొన్ని సెకన్లలో అవి అదృశ్యమయ్యాయి. భాగల్‌పూర్ జిల్లాలోని అనేక ఇళ్లు కేవలం 10 నిమిషాల్లో గంగానదిలో మునిగిపోయాయి. దీంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఇళ్లు నీళ్లలో కొట్టుకుపోతుండగా పలువురు వీడియోలు తీయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.
#WATCH : These Videos from Bhagalpur, district of Bihar.. where a terrible flood was seen not in the Ganga, but in just 10 minutes many houses got washed away in the Ganga, thousands of families became homeless.#bhagalpur #BiharNews #Flood #flooding #Ganga pic.twitter.com/tNkBNbv1WL
— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 24, 2024
Comments
Please login to add a commentAdd a comment